అంజు అస్రాని

అంజు అస్రాని తెలుగు టెలివిజన్ నటి. 2002లో వచ్చిన కర్తవ్యం (సూపర్‌ ఉమెన్‌) సీరియల్ ద్వారా టీవిరంగంలోకి అడుగుపెట్టింది.[1]

అంజు అస్రాని
Anju Asrani.jpg
జననంనవంబరు 10
వృత్తిటెలివిజన్ నటి
తల్లిదండ్రులుశ్యామ్‌లాల్‌, కిషోరీదేవి
బంధువులుప్రీతి అస్రాని (చెల్లెలు - నటి), అమర్ కుమార్ (అన్న)

జననం - విద్యాభ్యాసంసవరించు

అంజు నవంబరు 10న శ్యామ్‌లాల్‌, కిషోరీదేవి దంపతులకు పంజాబ్‌లో జన్మించింది. అంజు కుటుంబం వైజాగ్‌లో ఐదు సంవత్సరాలు ఉండి, హైదరాబాదులో స్థిరపడింది.[2]

మోడలింగ్సవరించు

ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో లండన్‌ హెయిర్‌ అండ్‌ స్కిన్‌ కేర్‌, ఇతర వస్తువుల వ్యాపార ప్రకటనల్లో నటించింది.

టీవిరంగంసవరించు

2002లో కర్తవ్యం సీరియల్‌లో తొలిసారిగా నటించిన అంజు వివిధ సీరియల్స్‌లో ముఖ్యపాత్రలను పోషించింది.

నటించినవిసవరించు

 1. కర్తవ్యం
 2. బొమ్మరిల్లు
 3. శిరీష
 4. ఎగిరే పావురమా
 5. ధర్మయుద్ధం
 6. మౌనమేలనోయి
 7. మేఘసందేశం
 8. రుద్రవీణ
 9. తూర్పు-పడమర
 10. అగ్నిపూలు
 11. మూగమనసులు
 12. నాతిచరామి
 13. శంకర్ దాదా ఐ.ఫై.యస్
 14. శుభం
 15. మీలో సగం
 16. దమయంతి

కార్యక్రమాలు

 1. వావ్ (ఈటీవీ )
 2. స్టార్ మహిళ (ఈటివి )
 3. గడసరి అత్త సొగసరి కోడలు (జీ తెలుగు)
 4. ఎగిరే పావురమా (ఈటివి)
 5. లక్కు కిక్కు
 6. భలే ఛాన్సులే

సినిమారంగంసవరించు

గోపాల గోపాల సినిమాలో వెంకటేష్‌కు చెల్లిగా, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో లాయర్‌ పాత్రలో, ఈ మాయ పేరేమిటో సినిమాలో నటించింది.

ఇతర వివరాలుసవరించు

 1. అంజు చెల్లెలు ప్రీతి అస్రాని హీరోయిన్ గా ప్రెషర్ కుక్కర్ సినిమాలో నటించింది.[3][4]

మూలాలుసవరించు

 1. అగ్నిపూల అంజు, నమస్తే తెలంగాణ జందగీ, 10 అక్టోబరు 2014
 2. నవతెలంగాణ, మానవి (26 July 2015). "ఛాలెంజింగ్‌ పాత్రలే ఇష్టం". NavaTelangana. Archived from the original on 7 April 2020. Retrieved 25 April 2020.
 3. ప్రజాశక్తి, మూవీ (14 February 2020). "గమ్మత్తుగా అనిపించింది". www.prajasakti.com. Retrieved 26 April 2020.[permanent dead link]
 4. సాక్షి, సినిమా (15 February 2020). "నాకు ఆ అవకాశం ఇవ్వలేదు". Sakshi. Archived from the original on 26 April 2020. Retrieved 26 April 2020.