గోపాల గోపాల వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై దగ్గుబాటి సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. కిషొర్ కుమార్ పార్ధసాని (డాలి) దర్శకుదు. ఇతర సహాయక పాత్రల్లో శ్రియ శరణ్, మిథున్ చక్రవర్తి, కృష్ణుడు, ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి నటించారు. జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, గౌతం రాజు ఎడిటింగ్ నిర్వహించారు.అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 2012 లో విడుదల అయిన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్! (OMG) కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రధానంగా హైదరాబాదులో, కొన్ని భాగాలు విశాఖపట్నం, వారణాసిలో చిత్రీకరించబడ్డాయి. 2014 జూన్ 9 న ప్రారంభమైంది, సంక్రాంతికి విడుదలగా 2015 జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందినది.

గోపాల గోపాల
Gopala Gopala poster.jpg
చిత్ర గోడపత్రిక
దర్శకత్వము కిషోర్ కుమార్ పార్థసాని(డాలి)
నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు,
శరత్ మరార్
స్క్రీన్ ప్లే కిషోర్ కుమార్ పార్థసాని(డాలి),
భూపతిరాజా,
దీపక్ రాజ్
కథా రచయిత ఉమేశ్ శుక్లా
భవేష్ మండలియా
తారాగణం దగ్గుబాటి వెంకటేష్,
పవన్ కళ్యాణ్,
శ్రియా
సంగీతం అనూప్ రూబెన్స్
సినిమెటోగ్రఫీ జయంత్ విన్సెంట్
కూర్పు గౌతంరాజు
స్టుడియో సురేష్ ప్రొడక్షన్స్,
నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
డిస్ట్రిబ్యూటరు BlueSky Cinemas Inc.,
(United States)[1]
విడుదలైన తేదీలు 10 జనవరి 2015 (2015-01-10)[2]
నిడివి 153 నిమిషాలు
దేశము భారత్
భాష తెలుగు
బడ్జెట్ INR120 million[3]
మొత్తం వ్యయం INR91.9 million
(Day 1).[4]

కథసవరించు

నాస్తికుడైన గోపాల్రావు (వెంకటేష్‌) మోసపూరిత మాటలు చెప్పి దేవుడి విగ్రహాలు అమ్ముకుని భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటుంటాడు. ఒకానొక సందర్భంలో దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ ఒక భక్త కూటమిని చెదరగొట్టి వారి భక్తిని అపహాస్యం చేస్తాడు. అదే రోజు రాత్రి సంభవించిన భూకంపంలో తన దుకాణం ఒక్కటే నేలమట్టమై... ఎనభై లక్షల అప్పుతో నడి వీధికి వచ్చేస్తాడు. బీమా మొత్తం చెల్లించడానికి కూడా భీమా సంస్థ అంగీకరించదు. 'దేవుడి చర్య ' వల్ల జరిగిన నష్టం బీమాలో కవర్‌ అవదని అంటే... తనకి జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టుకి వెళతాడు. దేవుడి మిషన్లు నడిపే సంస్థలకి, దేవాలయాలకి, ట్రస్టులకి అన్నిటికీ సమన్లు పంపిస్తాడు. గోపాల్రావు వాదనలో న్యాయం ఉందని అతని కేసుని కోర్టు స్వీకరిస్తుంది. అయితే భక్తులు గోపాల్రావుపై పగబట్టి అతడిని చంపాలని చూస్తారు. అప్పుడు భగవంతుడే మనిషి రూపంలో (పవన్‌కళ్యాణ్‌) వచ్చి గోపాల్రావుని కాపాడి.. అతడికి దిశా నిర్దేశం చేస్తాడు.

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "'Gopala Gopala' in USA by BlueSky". IndiaGlitz. 16 December 2014. Archived from the original on 9 జనవరి 2015. Retrieved 16 December 2014. Check date values in: |archivedate= (help)
  2. H. Hooli, Shekhar (8 January 2015). "'Gopala Gopala' Gets 'U' Certificate from Censor Board; Set to Release on 10 January". International Business Times India. Archived from the original on 9 జనవరి 2015. Retrieved 9 January 2015. Italic or bold markup not allowed in: |publisher= (help); Check date values in: |archivedate= (help)
  3. Srikanya (17 July 2014). "Believe? Pawan Kalyan's new film, the budget of 12 crore". Oneindia Entertainment. Archived from the original on 9 జనవరి 2015. Retrieved 3 October 2014. Check date values in: |archivedate= (help)
  4. Seshagiri, Sangeetha (11 January 2015). "'Gopala Gopala' First Day Box Office Collection: Pawan-Venky Movie Fails to Beat 'Attarintiki Daaredi', 'Aagadu' in AP/Nizam". International Business Times India. Archived from the original on 11 జనవరి 2015. Retrieved 11 January 2015. Italic or bold markup not allowed in: |publisher= (help); Check date values in: |archivedate= (help)

బయటి లంకెలుసవరించు