అంజు జైన్

ఒక భారతీయ మాజీ క్రికెటర్.

అంజు జైన్ (జననం: 1974 ఆగస్టు 11) ఒక భారతీయ మాజీ క్రికెటర్, ప్రస్తుత క్రికెట్ కోచ్.ఆమె వికెట్ కీపర్‌గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడింది. ఆమె 1993-2005 మధ్య భారతదేశం తరపున ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు, 65 మహిళల ఒకరోజు అంతర్జాతీయ ఆటలలో ఆడింది.ఆమె ఢిల్లీ,ఎయిర్ ఇండియా తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2] ఆమె గతంలో భారతదేశం, బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం భారతదేశీయ సర్క్యూట్‌లో శిక్షకురాలుగాఉంది.[3]

అంజు జైన్
రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం 2006లో అంజు జైన్‌కు 2005 అర్జున అవార్డును అందజేస్తున్న చిత్రం
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అంజు జైన్
పుట్టిన తేదీ (1974-08-11) 1974 ఆగస్టు 11 (వయసు 50)
ఢిల్లీ, భారతదేశం
బ్యాటింగుకుడి చేతివాటం
బౌలింగుకుడి చేయి ఆఫ్ బ్రేక్
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 41)1995 ఫిబ్రవరి 7 - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు2003 నవంబరు 27 - న్యూజిలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 38)1993 జులై 20 - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే2005 ఏప్రిల్ 10 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992/93–1993/94ఢిల్లీ
1993/94–2004/05ఎయిర్ ఇండియా
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 8 65 25 124
చేసిన పరుగులు 441 1,729 1,028 3,798
బ్యాటింగు సగటు 36.75 29.81 33.16 35.16
100లు/50లు 1/3 0/12 2/5 0/29
అత్యుత్తమ స్కోరు 110 90 140* 90
క్యాచ్‌లు/స్టంపింగులు 15/8 30/51 24/17 49/69
మూలం: CricketArchive, 16 August 2022

ఆమె 2000 ప్రపంచ కప్‌లో భారతదేశానికి సారథ్యం వహించింది.ఆ ఆటలో న్యూజిలాండ్‌తో ఓడిపోయే ముందు ఆమె జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.[4]

ఆమె మహిళల ఒకరోజు అంతర్జాతీయ ఆటలలో అత్యధిక స్టంపింగ్‌లతో సంయుక్తంగా 51 స్టంపింగ్‌లతో రికార్డ్‌ను కలిగి ఉంది [5] జైన్ కెప్టెన్, వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్‌గా ఏడు మహిళల ఒకరోజు అంతర్జాతీయ ఆటలు ఆడింది.ఇది ఒక రికార్డు.[6]

అంజు తన క్రీడా విజయాలకు 2005లో అప్పటి భారత రాష్ట్రపతి, అబ్దుల్ కలాం నుండి అర్జున అవార్డును అందుకుంది.[3]

పదవీ విరమణ అనంతరం, జైన్ దేశీయ స్థాయిలో ఒడిశా, త్రిపుర, అస్సాం, విదర్భ, బరోడాలకు శిక్షకురాలుగా పనిచేసింది.[3]

2011 - 2013 మధ్య,ఆమె భారత ప్రధాన కోచ్‌గా, 2018 - 2020 మధ్య ఆమె బంగ్లాదేశ్‌కు ప్రధాన శిక్షకురాలుగా పనిచేసింది.[3][7]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Anju Jain". ESPNcricinfo. Retrieved 16 August 2022.
  2. "Player Profile: Anju Jain". CricketArchive. Retrieved 16 August 2022.
  3. 3.0 3.1 3.2 3.3 ""I was able to change the perception of other teams about Bangladesh," says Anju Jain/The Pioneers". Female Cricket. Retrieved 16 August 2022.
  4. "CricInfo Women's World Cup 2000/01". ESPNcricinfo. Retrieved 16 August 2022.
  5. "Records/Women's One Day Internationals/Wicketkeeping Records/Most stumpings in career". ESPNcricinfo. Retrieved 16 August 2022.
  6. "Records | Women's One-Day Internationals | Individual records (captains, players, umpires) | Captains who have kept wicket and opened the batting | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-07-26.
  7. "Anju Jain to take over as Bangladesh women coach". ESPNcricinfo. Retrieved 16 August 2022.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అంజు_జైన్&oldid=4016411" నుండి వెలికితీశారు