అంటావో డిసౌజా

పాకిస్తానీ మాజీ క్రికెటర్

అంటావో డిసౌజా (జననం 1939, జనవరి 17) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం 1959 నుండి 1962 వరకు ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2] మీడియం పేస్ బౌలర్ గా, ఓబ్డ్యూరేట్ టెయిల్-ఎండ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.

అంటావో డిసౌజా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అంటావో డిసౌజా
పుట్టిన తేదీ (1939-01-17) 1939 జనవరి 17 (వయసు 85)
నాగోవా, గోవా, పోర్చుగీస్ ఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 29)1959 ఫిబ్రవరి 20 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1962 ఆగస్టు 20 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 6 61
చేసిన పరుగులు 76 815
బ్యాటింగు సగటు 38.00 18.95
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 23* 45
వేసిన బంతులు 1,587 11,738
వికెట్లు 17 190
బౌలింగు సగటు 43.82 26.03
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 12
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 5/112 7/33
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 20/–
మూలం: Cricinfo, 2012 అక్టోబరు 29

జీవిత విశేషాలు

మార్చు

ఇతను గోవాలో పుట్టి పెరిగాడు, డిసౌజా తండ్రి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పాకిస్తాన్‌లోని కరాచీకి వలస వెళ్ళాడు. డిసౌజా అక్కడి సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో చదివాడు.[3] ఇతని సోదరులు విన్సెంట్ డిసౌజా, జోసెఫ్ డిసౌజా కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

1999లో డిసౌజా తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి కెనడాలోని అంటారియోకు వలస వెళ్ళాడు.[3][4]

క్రికెట్ రంగం

మార్చు

డిసౌజా 1962లో ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. తన ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదింటిలో నాటౌట్‌గా నిలిచాడు. దేశీయంగా, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, కరాచీ బ్లూస్, కరాచీ, పెషావర్‌ల తరపున ఆడారు. [5]

మూలాలు

మార్చు
  1. "Antao D'Souza Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
  2. Wisden. Engel, Matthew (ed.). Wisden Cricketers' Almanack, 132nd edition (1995 ed.). London: John Wisden & Co Ltd. p. 1388.
  3. 3.0 3.1 Dias, Jude (2011) Goan who Shone on the International Cricket Arena Archived 23 జనవరి 2013 at the Wayback MachineNavhind Times online. Published 17 April 2011. Retrieved 29 October 2012.
  4. "Non-Muslims to play international cricket for Pakistan". www.thenews.com.pk.
  5. Teams Antao D'Souza played for – CricketArchive. Retrieved 29 October 2012.