అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018
ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, బదలాయింపుతోపాటు మైనింగ్, అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలపై చర్చించేందుకు 2018 ఫిబ్రవరిలో అంతర్జాతీయ మైనింగ్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు హైదరాబాద్ లోని హైటెక్స్‌లో 2018 ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరిగింది. దేశ విదేశాల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018 | |
---|---|
నిర్వహించు దేశం | భారతదేశం |
తేదిs | ఫిబ్రవరి 14 - 17, 2018 |
వేదిక(లు) | హైటెక్స్ |
నగరాలు | హైదరాబాద్ |
ప్రభుత్వ అధికారులు | తెలంగాణ |
మూఖ్యాంశాలు
మార్చుఈ సదస్సుకు అమెరికా, కెనడా, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుంచి మైనింగ్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కి సంయుక్తంగా అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన నిర్వహించాయి.[1]
ప్రారంభోత్సవం
మార్చుఈ సదస్సు ప్రారంభోత్సవంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర గనులు, పురపాలన , ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ లు పాల్గొన్నారు.
మూలాలు
మార్చు- ↑ అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018. "అంతర్జాతీయ మైనింగ్ సదస్సు ప్రారంభం". టీ న్యూస్. www.tnews.media. Archived from the original on 17 ఫిబ్రవరి 2018. Retrieved 15 February 2018.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)