అంతస్తులు

1965 తెలుగు సినిమా

అంతస్తులు అనేది 1965 తెలుగు చిత్రం, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ పేరున వి. బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించింది. దీనికి వి. మధుసూదన రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. ప్రధాన పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, కృష్ణకుమారి నటించగా, కె. వి. మహదేవన్ సంగీతం స్వరపరచాడు. సహాయ సంగీత దర్శకుడుగా పుహళేంది పనిచేసాడు. ఈ చిత్రం 1965 సం. తెలుగు సినిమాలలో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందింది.[1] ఈ సినిమాలో ధనము, అధికారము గల జమిందారి జీవితము గురించి చూపించారు.

అంతస్తులు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. మధుసూదనరావు
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
భానుమతి,
కృష్ణకుమారి,
జగ్గయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
జి.వరలక్ష్మి,
మిక్కిలినేని,
రేలంగి,
రమణారెడ్డి
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఘంటసాల,
భానుమతి,
మాధవపెద్ది సత్యం,
పి.సుశీల
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

1966 : సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈచిత్రం ప్రదర్శితమైనది .

కథ సవరించు

రాజా జగన్నాథరావు (గుమ్మడి) ఒక ధనిక జమీందారు, క్రమశిక్షణతో నిమగ్నమయి ఉంటాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అతనిని వ్యతిరేకిస్తారు. అతని నియమాలు, క్రమశిక్షణకు సంబంధించి కుటుంబ సభ్యులు లేదా కార్మికులు అనే తేడా చూపించడు. ఎవరైనా ఇతని నియమాలు ధైర్యం చేసి ఉల్లంఘిస్తే వాళ్ళని కొట్టడానికి కూడా వెనాకాడడు. జగన్నాథరావు భార్య రూప దేవి (జి. వరలక్ష్మి), పెద్ద కుమారుడు రఘు (అక్కినేని నగేశ్వరరావు) భక్తిపరంగా అతని మాటలు వింటారు. కాని, చిన్న కుమారుడు చిన్నాబాబు (నాగరాజు) ఈ నియమాలకు చాలా చికాకు తెచ్చుకుంటాడు. అతను చిన్న కోరికలను నెరవేర్చలేని ఇంటి కంటే ఒక జైలు కూడా మంచిదని అతను భావిస్తాడు. జగన్నాథరావు చిన్న కుమారుడు ఆలోచనలు గురించి తెలుసుకుంటాడు, మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆలోచనలు చేయకుండా అతనిని రెండుసార్లు హెచ్చరిస్తాడు కానీ చిన్నాబాబు నియమాలను విచ్ఛిన్నం చేస్తాడు. జగన్నాథరావు విపరీతమైన కోపంతో చిన్నాబాబును కొట్టే ప్రయత్నం చేస్తాడు, అతని తండ్రి కోపం చూస్తాడు, తరువాతి మానసిక షాక్ వల్ల మరణిస్తాడు. ఈ సంఘటన ఫలితంగా జగన్నాథరావు మనసు మానసికంగా విచ్ఛిన్నం అవుతుంది. అప్పటి నుండి అతను మంచం పడ్తాడు.అతని గతం అతనిని వెంటాడుతుంది. అతను ప్రేమిస్తున్న పేద మహిళను, ఆమెకు తనతో కలిగిన అమ్మాయిని గుర్తు చేసుకుంటాడు. ఈ సంగతిని తన మరణానికి ముందే అతను రఘుతో రహస్యంగా పంచుకుంటాడు, తన కోరికను వ్యక్తపరుస్తాడు. అతను ఏదో విధంగా ఆ అమ్మాయిని కనుగొని, తన కుటుంబంలో సభ్యునిగా చేసుకొనేందుకు రఘుతో మాట్లాడుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, రాణి (భానుమతి). ఈమె డ్యాన్స్ చేస్తూ, వీధుల్లో పాడుతూ ఉంటుంది. రఘు రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి, తన ఇంటికి మాలా (కృష్ణ కుమారి) సహాయంతో తీసుకు వస్తాడు, అతను రాణి ఇంటిలో సరిగ్గా ఎలా ఉండాలో నేర్పుతాడు. జగన్నాథరావు ఆస్తిపై కన్నేసి తమ చేతుల్లోకి తీసుకోవాలనుకున్న నాగు (జగ్గయ్య), జోగులు (నెల్లూరు కాంతారావు) కు సరయిన గుణపాఠం, బుద్ధి చెబుతాడు. ఆస్తి వారి చేతుల్లోకి వెళ్ళకుండా కాపాడతాడు. రఘు తన తండ్రి కలలు నెరవేరుస్తాడు, చివరికి మాలాను వివాహం చేసుకుంటాడు.

తారాగణం సవరించు

సంగీతం సవరించు

కె.వి.మహదేవన్ రచించిన సంగీతంలో అన్ని పాటలు కూడా హిట్ పాటలుగా ఉన్నాయి, ముఖ్యంగా నిను వీడని నీడను నేనే అనే బ్లాక్ బస్టర్ పాట ఎల్లప్పుడూ ఎవర్ గ్రీన్ పాట. ఈ సినిమా సంగీతం ఆడియో కంపెనీ ద్వారా విడుదలయింది.

పాటలు సవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసము ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
నువ్వంటే నాకెందుకో ఇంత ఇదీ నువ్వన్నా నాకెందుకో అదే ఇదీ ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
దేవీ నీ కరుణా కటాక్షమునకై (పద్యం) ? కె.వి.మహదేవన్ ఘంటసాల
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడ కొసరాజు రాఘవయ్య కె.వి.మహదేవన్ పి. భానుమతి బృందం
పైకంతో కొనలేనిది ఏదీ లేదు నా మైకంలో పడని ఆత్రేయ కె.వి.మహదేవన్ సుశీల, ఘంటసాల
వినరా విస్సన్నా నే వేదం చెపుతా వినరన్నా ఆరుద్ర[2] కె.వి.మహదేవన్ భానుమతి

పురస్కారాలు సవరించు

  • తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ - వి.బి. రాజేంద్ర ప్రసాద్
  • ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ - తెలుగు - వి.బి. రాజేంద్ర ప్రసాద్
  • బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఫర్ నంది అవార్డు - వి.బి. రాజేంద్ర ప్రసాద్
  • ఉత్తమ నటిగా భారత ప్రభుత్వం నుండి రాష్ట్రపతి పురస్కారం - భానుమతి రామకృష్ణ - 1965

ఇతరములు సవరించు

  • విసిడి, డివిడిలు - వోల్గా వీడియోలు, హైదరాబాదు.

మూలాలు సవరించు

  1. "13th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 15 September 2011.
  2. అంతస్తులు, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 34-35.

వనరులు సవరించు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు