నెల్లూరు కాంతారావు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
నెల్లూరు కాంతారావు ఒక చలన చిత్ర నటుడు. అనేక సినిమాలలో ప్రతినాయక పాత్ర పోషించాడు. టైగర్ ప్రొడక్షన్స్ అనే చిత్రనిర్మాణ సంస్థను ఎస్.హెచ్.హుసేన్ అనే వ్యక్తితో కలిసి స్థాపించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. ఇతనికి నెల్లూరులో కనకమహల్ అనే సినిమా ప్రదర్శనశాల కూడా ఉండేది.
జీవిత విశేషాలుసవరించు
ఇతడు నెల్లూరులో 1931, జనవరి 24న జన్మించాడు. నెల్లూరు వి.ఆర్.కాలేజిలో ఇంటర్‌మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇతనికి ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. చిన్నతనం నుండే శరీరవ్యాయామం చేస్తూ, దేహధారుఢ్యాన్ని పెంచుకున్నాడు. 1948 నుండి 1956 వరకు ఆంధ్ర, ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించి అనేక బిరుదులు, బహుమతులు, ఛాంపియన్‌షిప్‌లు సంపాదించాడు. 'ఆంధ్రా టైగర్' అనే బిరుదును పొందాడు.1952లో ఇండియా ఒలింపిక్ గేమ్స్‌కు ఉమ్మడి మద్రాసురాష్ట్ర ప్రతినిధిగా, 1956లో పోలాండ్ దేశం వార్సాలో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నాడు[1]. నెల్లూరులో ఉన్న కనక్మహల్ థియేటర్‌లో ఇతడు ఒక భాగస్వామి. రేచుక్క-పగటిచుక్క సినిమాలో వస్తాదు పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా, నిర్మాతగా మారాడు. పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే ఇతడు ఎందరికో స్నేహపాత్రుడైనాడు. అంతగా అనుభవం లేకున్నా కేవలం తన మంచితనంతోనే నిర్మాతగా మారి అసాధ్యుడు, అఖండుడు లాంటి సినిమాలను నిర్మించాడు. ఇతడు 1970, అక్టోబరు 8వ తేదీ నూజివీడులో ఆసుపత్రిలో మరణించాడు[2].
చిత్రరంగంసవరించు
నటుడిగాసవరించు
- బొబ్బిలి యుద్ధం (1964) - మల్లయోధుడు
- అంతస్తులు (1965)
- జమీందార్ (1965) - మూర్తి
- జ్వాలాద్వీప రహస్యం (1965)
- నర్తనశాల (1965) - మల్లయోధుడు
- పాండవ వనవాసం (1965) - కిమీరుడు
- వీరాభిమన్యు (1965) - ఘటోత్కచుడు
- గూఢచారి 116 (1966)
- అసాధ్యుడు (1967)
- ఇద్దరు మొనగాళ్లు (1967)
- కంచుకోట (1967)
- నిలువు దోపిడి (1968)
- నేనంటే నేనే (1968)
- వింత కాపురం (1968) - పులి
- ప్రేమ మనసులు (1969)
- అఖండుడు (1970)
- అగ్నిపరీక్ష (1970)
- రౌడీరాణి (1970)
- అల్లుడే మేనల్లుడు (1970)
- అందరికీ మొనగాడు (1971)
- భలేపాప (1971)
నిర్మాతగాసవరించు
- సర్వర్ సుందరం (1966)
- నువ్వే (1967)
- అసాధ్యుడు (1967)
- అఖండుడు (1970)
మూలాలుసవరించు
- ↑ విలేకరి (23 October 1970). "నటుడు పహిల్వాన్ ఎన్.కాంతారావు మరి లేడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 30 June 2020.
- ↑ సంపాదకుడు (1 November 1970). "నెల్లూరు కాంతారావు మృతి". విజయచిత్ర. 5 (5): 29.