అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి

అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి (ఎ.సి.పి.శాస్త్రి) బహుముఖ ప్రజ్ఞాశాలి. కంచుఘంట లాంటి స్వరంతో వేదాల నుంచి వేమన పద్యాల వరకు ఏ విషయంలోనైనా అనర్గళంగా మాట్లాడగల నేర్పు గలవారు. శాస్త్రం నుంచి శాస్త్రీయ దృక్పధాన్ని పిండగల ఓర్పూ నేర్పు గలవారు. ఏది చెప్పినా, మాట్లాడినా రుషిప్రోక్తంగా భాసి౦పజేసే వాక్కు అతని స్వంతం. నాటక రచనలో సిద్ధ హస్తుడు. వృత్తి రీత్యా రిజర్వ్ బాంక్ ఉద్యోగమే కాని ప్రవృత్తి పరంగా సాహిత్యము, సంగీతము లలోకూడ తన ప్రతిభను చాటుతూ సార్ధకంగా జీవిస్తున్న పెద్దలు శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి గారు.[1]

అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి
జననం
అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి

(1944-01-19) 1944 జనవరి 19 (వయసు 80)
జాతీయతభారతీయుడు
విద్యబి.ఎ., సంగీత విభూషణ్
విద్యాసంస్థశ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, రాంకోఠీ, హైదరాబాదు
వృత్తిఅసిస్టెంట్ మేనేజర్
ఉద్యోగంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాదు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నాటక రచయిత, నటుడు
గుర్తించదగిన సేవలు
ప్రాణి ప్రధానం,
బిల్హణీయం,
పులకేశి,
సత్య నిష్ట,
కుముద్వతీ పరిణయం,
వైజయింతీ విలాసం,
ఇయం సీతా మమ సుతా,
అవంతీ సుందరీ పరిణయం
తల్లిదండ్రులుఅందుకూరి వెంకట సుబ్బయ్య, అచ్చమాంబ

జీవిత విశేషాలు మార్చు

అందుకూరి వెంకట సుబ్బయ్య, అచ్చమాంబ దంపతులకు జనవరి 19 1944 న జన్మించారు . బి.ఎ.డిగ్రీ చదివిన వీరు రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగిగా చేరి కాలక్రమంలో అసిస్టెంట్ మేనేజర్‌గా 2002 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేశారు. హైదరాబాద్ రాం కోఠి ప్రభుత్వ కళాశాలలో 1968లో చేరి కర్నాటక సంగీతం నేర్చి ‘’సంగీత విభూషణ్ ‘’ పట్టా పొందారు. తను నేర్చిన సంగీతాన్నిసార్ధకం చేయ సంకల్పించి, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం వారు ప్రారంభించిన యువవాణి సంగీత కార్యక్రమాలను తన ప్రతిభా సామర్ధ్యంతో సమర్థంగా నిర్వహించారు.

శాస్త్రి గారి రచనలు చాలా భావరకు ‘రుషి పీఠం, మూసీ పత్రికలలో ప్రచురిత మయ్యాయి. .వైదిక సాహిత్య విషయాలపై శాస్త్రిగారు ఎన్నో విజ్ఞాన దాయక వ్యాసాలూ రచించి అందులోని నిగూఢ భావాలను సామాన్య ప్రజలకు తెలియ జేశారు. శాస్త్రిగారు ఆకాశవాణికి అనేక రేడియో నాటకాలను సమకూర్చారు. అందులో ముఖ్యమైవవి - కాళిదాసు ను గురించిన నాటకము, ప్రాణి ప్రధానం, బిల్హణ కవి జీవితంపై ‘’బిల్హణీయం ‘’ అనే నాటిక, పులకేశి అనే చారిత్రిక నాటకం, గరుత్మంతుని కధను ‘’సత్య నిష్ట’’గా రచించిన నాటకము, మను చరిత్ర, నల చరిత్ర, రఘు వంశ కధలను కుముద్వతీ పరిణయంగా రచించిన నాటకము, విప్రనారాయణ చరితంను వైజయింతీ విలాసంగా మలచిన నాటకము, విడాకులపై ఇయం సీతా మమ సుతా అనే సాంఘిక నాటకం, దండి దశకుమార చరిత్రను అవంతీ సుందరీ పరిణయంగా నాటికగా. ఇవన్నీ రేడియోలో ప్రసారమై బహుళ జనామోదం పొందాయి. శాస్త్రి గారి నల చరిత్ర నాటకాన్నిధర్మ పూరి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ కీ శే.కోరిడే రాజన్న శాస్త్రి గారు సంస్కృతంలోకి అనువదించగా సురభారతి సంస్థ ప్రచురిచింది.

నాటక రచనలోనే కాకుండా శాస్త్రి గారు గొప్ప స్టేజి నటులుగా కూడ కీర్తి నార్జించారు. 1970 వరకు చాలా నాటకాలలో వివిధ పాత్రలు ధరించి మెప్పించారు. 1977లో లిటిల్ థియేటర్ వారి విరజాజి నాటకంలో హీరో పాత్ర ధరించి, తర్వాత రంగస్థల నటనకు స్వస్తి పలికారు.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు