అంపశయ్య
అంపశయ్య 1965- 1968 సంవత్సరాల మధ్యకాలంలో రచించిన తెలుగు నవల. వెయ్యేండ్ల కాలంలో గొప్ప రచనలుగా గుర్తింపు పొందిన వాటిలో ఒకటైన ఈ నవలను అంపశయ్య నవీన్ రచించాడు.[1] ఇది నవీన్ మొదటి నవల. 1969లో మొదటిసారిగా ప్రచురితమైంది. ఈ నవల పేరే రచయిత ఇంటిపేరుగా మారిపోయింది.[2]
అంపశయ్య | |
కృతికర్త: | అంపశయ్య నవీన్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | ప్రత్యూష ప్రచురణలు |
విడుదల: | |
పేజీలు: | 276 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 81-87353-27-9 |
నేపథ్యం
మార్చుఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని విద్యార్థుల సామూహిక జీవితాన్ని, రవి అనే విద్యార్థి వైయక్తిక జీవితంతో సమన్వయం చేసి రాసిన విలక్షణ నవల ఇది. ఈ నవల ఒకానొక తెల్లవారుజామున యూనివర్సిటీ హాస్టల్ గదిలో కథానాయకుడు రవికి ఒక కల రావడంతో మొదలవుతుంది. ఆ కలకు అర్థమేమిటో రవికి బోధపడదు. ఆ కలనుంచి మేలుకున్న రవిలో మొదలైన ఆలోచనల ప్రవాహం నిరంతరంగా పరిగెడుతూ 18గంటల పాటు నడిచి చివరికి ఆ రాత్రి అదే గదిలో ముగుస్తుంది. 1970ల నాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం జీవితంతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ గల్లీలు, సినిమా టాకీసుల కథాకమామిషు అంతా రచయిత నవలలో అక్షరబద్ధం చేశాడు.[3]
ముద్రణ
మార్చుసృజన త్రైమాసిక పత్రికలో రెండు భాగాల పాటు ప్రచురితమై ఆ తర్వాత నవలగా వచ్చింది. 1969లో ప్రచురితమైన ఈ నవల 2017 వరకు 12 ముద్రణలు పొందింది. హిందీ తమిళం, ఇంగ్లీష్ భాషల్లోకి కూడా అనువాదం అయింది.
సినిమాగా
మార్చుఈ నవల జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మాణ సారధ్యంలో ప్రభాకర్ జైని దర్శకత్వంలో 2016లో క్యాంపస్ అంపశయ్య సినిమాగా వచ్చింది.[4]
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రభూమి (26 March 2017). "సమకాలికులలో ఆధునికుడు అంపశయ్య నవీన్". Archived from the original on 9 ఏప్రిల్ 2017. Retrieved 11 January 2018.
- ↑ ఈమాట. "అంపశయ్య: మరొకసారి కొత్తగా!". eemaata.com. సుజాత. Archived from the original on 16 జనవరి 2018. Retrieved 11 January 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (9 December 2017). "ఉస్మానియాలో పుట్టిన 'అంపశయ్య'". Retrieved 11 January 2018.[permanent dead link]
- ↑ 10టీవి (28 July 2016). "జాతీయ అవార్డు కోసమే సినిమా - ప్రభాకర్ జైనీ." Archived from the original on 13 నవంబరు 2016. Retrieved 11 January 2018.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)