అంబాపురం గుహాలయం
అంబాపురం గుహాలయం అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ సమీపంలో ఉన్న అంబాపురం గ్రామంలోని రాతిలో చెక్కిన జైన గుహాలయం.
అంబాపురం జైన గుహాలయం | |
---|---|
మతం | |
అనుబంధం | జైనమతం |
దైవం | మహావీరుడు |
ప్రదేశం | |
ప్రదేశం | అంబాపురం గ్రామం |
భౌగోళిక అంశాలు | 16°34′04.4″N 80°37′27.7″E / 16.567889°N 80.624361°E |
వాస్తుశాస్త్రం. | |
శైలి | రాతిలో చెక్కిన శిల్పకళ |
సృష్టికర్త | తూర్పు చాళుక్యులు |
స్థాపించబడిన తేదీ | సా.శ. 7 వ శతాబ్దం |
లక్షణాలు | |
దేవాలయాలు | 1 |
స్మారక చిహ్నాలు | 5 |
నిర్మాణ సామాగ్రి | రాతిలో తొలిచినవి |
చరిత్ర
మార్చుసా.శ. 7వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల పాలనలో జైనమతం విజయవాడ ప్రాంతంలో ప్రాచుర్యం పొందింది. 7వ-8వ శతాబ్దపు కాలంలో అంబాపురం, అడవినెక్కలం కొండల్లో మొత్తం ఐదు జైన గుహలు నిర్మించారు.[1] ఈ గ్రామం పేరు జైన గుహాలయం లోపల ఉన్న అంబికా దేవి పేరు నుండి వచ్చింది.[2]
ఆర్కిటెక్చర్
మార్చుగుహాలయంలో మూడు గదులు ఉన్నాయి - వరండా, అంతరాలం, గర్భగృహం. వరండాలో శిల్పాలు లేని సాదా గోడలు, పైకప్పులూ ఉన్నాయి. అంతరాలయం తలుపుకు ఇరువైపులా యక్ష చిత్రాలను, ఐదు తలలతో సర్పముతో కూడిన పార్శ్వనాథుని విగ్రహాన్ని చిత్రించారు. అంతరాలయంలో రక్షక దేవతగా అంబికా దేవితో పాటు మరొక గుర్తుతెలియని దేవత శిల్పం ఉంది. మహావీరునికి అటూ ఇటూ చౌరీ (విస్క్) మోసేవారి చిత్రం ఉంది.[1] గర్భగృహం వెనుక ఉన్న గోడపై పద్మాసనంలో ఉన్న 24వ తీర్థంకరుడైన మహావీరుడి విగ్రహం, సింహం గుర్తు పీఠంపై ఉంది. ఈ గుహాలయంలో రాతిలో చెక్కిన సూక్ష్మ జైన స్థూపం కూడా ఉంది. [2] కాయోత్సర్గ భంగిమలో 7 తలల సర్పంతో 3 అడుగులు (0.91 మీ.) ఎత్తున్న పార్శ్వనాథుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాలు 7వ శతాబ్దానికి చెందిన కుబ్జ విష్ణువర్ధనుడి (సా.శ. 624-641) కాలం నాటివి.[3][4]
2019లో, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, RCV 70 మంది విద్యార్థులతో కలిసి ఈ గుహాలయానికి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ట్రెక్‌ను నిర్వహించింది.[5][6]