అక్కితం అత్యుతన్ నంబూద్రి
అక్కితం అచ్యుతన్ నంబూద్రి ( అక్కితం గా సుపరిచితుడు) (జ. 1926 మార్చి 18) భారతీయ కవి, మలయాళం భాషా రచయిత. సరళమైన, స్పష్టమైన రచనా శైలికి పేరుగాంచిన అక్కితం 2019 లో భారతదేశపు అత్యున్నత సాహిత్య గౌరవమైన జ్ఞానపీఠ్ పురస్కారం, [1] పద్మశ్రీ, ఎజుతాచన్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కవిత్వానికి కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, ఒడక్కుజల్ అవార్డు, వల్లతోల్ అవార్డు, వయలార్ అవార్డు, ఆసన్ బహుమతులను పొందాడు.
అక్కితం అత్యుతన్ నంబూద్రి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | కుమారనెల్లూరు, పాలక్కాడ్ | 1926 మార్చి 18
కలం పేరు | అక్కితం |
వృత్తి | రచయిత, సామాస సేవకుడు |
భాష | మలయాళం |
జాతీయత | భారతీయుడు |
గుర్తింపునిచ్చిన రచనలు |
|
పురస్కారాలు |
|
జీవిత భాగస్వామి | శ్రీదేవి అంతర్జానం |
సంతానం | 2 కుమారులు, 4 కుమార్తెలు |
బంధువులు |
|
జీవిత విశేషాలు
మార్చుఅక్కితం అత్యుతన్ నంబూద్రి దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలోని [2] పాలక్కాడ్ జిల్లా కు చెందిన కుమారనల్లూరు సమీపంలో ఉన్న అమేటిక్కర వద్ద 1926 మార్చి 18 న అమెత్తు అక్కితాత్తు మనాయిల్ వాసుదేవన్ నంబూద్రి, చెకూర్ మనాయక్కల్ పార్వతి అంతార్జానం దంపతులకు జన్మించాడు. [3] సంస్కృతం, జ్యోతిషశాస్త్రం, సంగీతంలో పాఠశాల విద్యనభ్యసించిన తరువాత అతను కళాశాల విద్యను చేసాడు. కాని గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సును పూర్తి చేయలేదు. [4] అతను తన సామాజిక కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఒక వేదికగా ఉన్ని నంబూతిరి పత్రికకు సంపాదకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. మంగళోదయం, యోగాక్షేమం పత్రికలలో అసిస్టెంట్ సంపాదకునిగా కూడా పనిచేశాడు. 1956 లో అతను ఆల్ ఇండియా రేడియో (AIR) కోజికోడ్ స్టేషన్‌లో చేరాడు. అక్కడ అతను 1975 వరకు పనిచేశాడు. తరువాత అతను AIR త్రిస్సూర్ స్టేషన్‌కు బదిలీ చేయబడ్డాడు. అతను వేదాల అధ్యయనాలను ప్రాచుర్యం పొందటానికి సాహితీ సేవ ఐన అనాడితో కూడా సంబంధం కలిగి ఉన్నాడు .
అక్కితం శ్రీదేవి అంతర్జనమ్ ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు కుమారుడు నారాయణన్, కుమార్తె శ్రీజా ఉన్నారు. కుటుంబం అమేట్టిక్కరలో నివసిస్తుంది. భారతీయ చిత్రకారుడు అక్కితం నారాయణన్ అతని సోదరుడు. [5]
వారసత్వం
మార్చుఅక్కితం సాహిత్య రచనలు 1950 ప్రారంభంలో విస్తృత దృష్టిని ఆకర్షించడం ప్రారంభమైంది. ఇరుపతం నూట్టండింతె ఇతిహాసం (20 వ శతాబ్ద మహాకావ్యం), మలయాళ సాహిత్యంలో మొదటి ఆధునికతను పద్యాలు గల ఖండకావ్యం పుస్తకం 1952 లో సంజయన్ పురస్కారాన్ని గెలుచుకుంది. [6] కవితా సంకలనాలు, నాటకాలు, చిన్న కథలతో కూడిన 45 పుస్తకాలను అతమి ప్రచురించాడు. బలిదర్శనం , అరంగేట్టం, నిమిషా క్షేత్రం, ఇడింజు పోలింజ లోకం, అమృతఘాటికా, కలికోట్టిలిల్ అతని రచనలలో గుర్తించదగిన కవితా సంకలనాలు. ఉపనయనం, సమవర్తనం, వ్యాసాలు రెండు సంపుటాలు అతని గద్య రచనలలో ఉన్నాయి. శ్రీ మహాభగతం, 14,613 శ్లోకాలతో కూడిన శ్రీమద్ భాగవతం యొక్క అనువాదం 2,400 పేజీలకు పైగా ఉంది.
అక్కితం సామాజిక సంస్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అతనికి యోగక్షేమ సభ తో గల అనుబంధంతో కేరళ లోని నంభూద్రి బ్రాహ్మణుల జీవితాల్లో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించడానికి సహాయపడింది. అతనికి కడవల్లూర్, త్రిసూర్ లలోని తిరునవయ కు సంబంధించిన వివిధ కేంద్రాలతో సంబంధం ఉంది. ఈ కేంద్రం ద్వారా వేద అధ్యయనాలను పోత్సహిస్తారు. 947 లో అంటరానితనానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన పాలియం సత్యాగ్రహంతో అతను పాల్గొన్నాడు. [6]
పురస్కారాలు, గౌరవాలు
మార్చుఅక్కితం 1952 లో సంజయన్ పురస్కరాన్ని అతని రచన ఇరుపతం నూట్టండింటే ఇతిహాసం [6] కు పొందాడు. 1971 లో బలిదర్శనం రచనకు కవిత్వానికి అందించే కేరళ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నాడు . [7] అతను 1973 లో రెండు ప్రధాన గౌరవాలు పొందాడు. అవి బలిదర్శనం కొరకు సాహిత్య అకాడమీ అవార్డు,[8] నిమిషా క్షేత్రానికి ఒడక్కుజల్ అవార్డు . [9] అతను 1994 లో అసన్ స్మారక కవితా పురస్కారానికి ఎంపికయ్యాడు. [10] రెండు సంవత్సరాల తరువాత 1996లో లలితాంబికా అంతర్జనమ్ స్మారక సాహిత్య అవార్డుకు, [11] తరువాత 1997 లో వల్లథోల్ అవార్డుకు ఎంపికయ్యాడు . [12]
అక్కితం కు 2012 లో వయలార్ పురస్కారం వచ్చింది. [13] కేరళ ప్రభుత్వం అతనికి 2016 లో వారి అత్యున్నత సాహిత్య పురస్కారం ఎజుతాచన్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. [14] [15] [16] అతను 2017 లో భారత ప్రభుత్వానికి నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు. [17] [18] అనారోగ్యం కారణంగా అతను ప్రతిష్టాత్మకమైన ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు; ఈ పురస్కారాన్ని తరువాత పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ అతనికి అందజేశాడు. [19] అతను 2019 లో అత్యున్నత భారతీయ సాహిత్య పురస్కారం అయిన జ్ఞాన్‌పిఠ్ పురస్కారాన్ని అందుకున్నాడు. [20] కృష్ణ గీధి పురస్కారం, నలప్పాడ్ అవార్డు, పుతేజాన్ అవార్డు, భారతీయ జ్ఞానపిఠ్ కు సంబంధించిన మూర్తి దేవి అవార్డు, అమృత కీర్తి పురస్కారం (2004) వంటి అనేక గౌరవాలు కూడా ఆయనకు దక్కాయి. అరికిల్ అక్కితం డాక్యుమెంటరీ చిత్రానికి ఇ. సురేష్ దర్శకత్వం వహించాడు. ఇది కవిగా అతని జీవితాన్ని తన కుమార్తె శ్రీజా దృక్పథంలో వివరిస్తుంది. [5]
గ్రంథ పట్టిక
మార్చుకవిత్వం
మార్చు- అక్కితం (1971). ఉపన్యాసం. S.P.C.S.[permanent dead link]
- అక్కితం. ఇదింజు పోలింజ లోకం: కవితాకళ్.[permanent dead link]
- అక్కితం. సమవర్తనం.[permanent dead link]
- అక్కితం. బలిదర్శనం. కొట్టాయం: S.P.C.S.[permanent dead link]
- అక్కితం (2002). అక్కితం కవితాకళ్: సమూర్ణ సమాహారం (1946-2001). కొట్టాయం: కరెంట్ బుక్స్. ISBN 9788124011157.[permanent dead link]
- అక్కితం (2013). తైరంజేదుత కవితాకళ్. డి.సి.బుక్స్. ISBN 9788126423446.
- అక్కితం (1997). సమన్వయతింతే ఆకాశం. కొట్టాయం: డి.సి. బుక్స్.[permanent dead link]
- అక్కితం (1991). స్పర్శమణీకళ్. కొట్టాయం: డి.సి. బుక్స్.[permanent dead link]
- అక్కితం (1985). అమృతఘటిక: కవిత. కాలికట్: పి.కె.బ్రదర్స్.[permanent dead link]
- అక్కితం (1980). మానస పూజ: కవితాకళ్.[permanent dead link]
- అక్కితం (1966). ఓర్ కుల ముందిరింగ. కరెంట్ బుక్స్, త్రిసూర్: కరెంట్ బుక్స్.[permanent dead link]
- అక్కితం (1961). సంజరికళ్. కరెంట్ బుక్స్: కరెంట్ బుక్స్.[permanent dead link]
- అక్కితం (1996). శ్లోకపుణ్యం. అఖిల కేరళ అక్షర శ్లోక పరిషత్, త్రిసూర్: అఖిల కేరళ అక్షర శ్లోక పరిషత్, త్రిసూర్.[permanent dead link]
- అక్కితం. అమృతఘడికం. కాలికట్: పి.కె.బ్రదర్శ్.[permanent dead link]
- అత్యుతన్ నంభూద్రి, అక్కితం (2013). అంతిమహకలం (3rd ed.). కోజీకోడ్: మాతృభూమి బుక్స్. ISBN 9788182657038.[permanent dead link]
- అక్కితం (1975). కోలయరండు. నేషనల్ బుక్ స్టాల్: నేషనల్ బుక్ స్టాల్.[permanent dead link]
- అక్కితం (1948). ప్రతీకారదేవత. మాతృభూంఇ: మాతృభూమి.[permanent dead link]
- అక్కితం (1969). కరతమాలకం. మంగళోదయం లిమిటెడ్: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1966). మధువిదువింశేషం. మంగళోదయం: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1969). ఇరుపతం నూట్టండింతె ఇతిహాసం. మంగళోదయం: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1966). సాగరసంగీతం. మంగళోదయం: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1963). మదువీడు. మంగళోదయం: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1951). మనసాక్షియుదే పూకల్. మంగళోదయం: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1967). ఒరు కుదణ్ణ నిలవు. మంగళోదయం: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1947). దేశసేవిక. మంగళోదయం: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1965). అవతలంగల్. మంగళోదయం: మంగళోదయం.[permanent dead link]
- అక్కితం (1998). పొన్నాని కళరి. కొట్టాయం: సాహిత్య ప్రవర్తక సహకారణ సంఘం, కొట్టాయం.[permanent dead link]
- అక్కితం (1948). ప్రతీకారదేవత. యోగక్షేమం లిమిటెడ్: యోగక్షేమం లిమిటెడ్.[permanent dead link]
- అక్కితం (1990). కాలికొట్టిలి. త్రివేండ్రం: స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చిల్డ్రన్ లిటరేచర్.[permanent dead link]
- అక్కితం (2016). కేదత సూర్యన్. సుకపురం: వల్లతోల్ విద్యాపీఠం.[permanent dead link]
వ్యాసాలు, సాహిత్య విమర్శలు
మార్చు- అక్కితం ఆచ్యుతన్ నంబూద్రి (2004). కవితాయిలె వృతవుం చతురవుం. శుకపురం: వల్లతోల్ విద్యాపీఠం. ISBN 9788124014165.[permanent dead link]
- అక్కితం (1983). వెన్నక్కల్లిందె కధ. దక్షిణ బుక్స్, శుకపురం: దక్షిణ బుక్స్, శుకపురం.[permanent dead link]
- అక్కితం (1993). హృదయతిలెక్కు నొక్కి ఎఝుతు. శుకపురం వల్లాతోల్: శుకపురం వల్లాతోల్.[permanent dead link]
- అక్కితం (2003). సౌతశాస్త్ర పరంబర్యం కేరలతిల్. కోజికోడ్: లిపి పబ్లికేషన్స్.[permanent dead link]
- అక్కితం (2014). సంస్కృతి: అక్కితతింతె తెరెంజెదుత లెఖంగళ్. కాలికట్: హరితం బుక్స్. ISBN 9788192846989.[permanent dead link]
- అక్కితం (2014). స్మృతి: అక్కితతింతె తెరెంజెదుత లేఖంగళ్. కోజీకోడ్: హరితం బుక్స్. ISBN 9788192846996.[permanent dead link]
- అక్కితం (2014). స్మృతి: అక్కితతింతె తెరెంజెదుత లేఖంగళ్. కోజీకోడ్: హరితం బుక్స్. ISBN 9788192846972.[permanent dead link]
- అత్యుతన్ నంబూద్రి, అక్కితం (2011). కవిత ఒరు వలియ సత్యమను. కోజికోడ్: పూర్ణ.[permanent dead link]
బాలల సాహిత్యం
మార్చు- అక్కితం (1966). ఈ ఎదతి నోన్ పరయు (పిల్లల నాటకం). మాతృభూమి.
- అక్కితం (1977). అక్కితతింతె కుట్టిక్కవితకళ్.[permanent dead link]
అనువాదాలు
మార్చు- శర్మ, సిఆర్; అక్కితం (1979). తెలుంకు కతకళ్. కొట్టాయం: నేషనల్ బుక్ స్టాల్.[permanent dead link]
- శర్మ, సి.ఆర్; అక్కితం (2010). తెలుగు కథకళ్: ధనగుప్తనెన్న కచవదక్కరంటె అత్యార్థి (2nd ed.). కోజికోడ్: హరితన్ బుక్స్.[permanent dead link]
ఇతరులు
మార్చు- అక్కితం, ed. (1980). సంస్కృత మలయాళ నిఘంటు.[permanent dead link]
మూలాలు
మార్చు- ↑ "Poet Akkitham bags Jnanpith award". New Delhi. 29 November 2019. Archived from the original on 23 డిసెంబరు 2019. Retrieved 27 మే 2020.
- ↑ "Akkitham Achuthan Namboothiri on Good Reads". 2019-03-08.
- ↑ "പത്മശ്രീ പ്രഭയില് അക്കിത്തം അച്യുതന് നമ്പൂതിരി". 2019-03-08. Archived from the original on 2017-09-10. Retrieved 2020-05-27.
- ↑ "Biography of Akkitham". 2019-03-08.
- ↑ 5.0 5.1 Anoop, Aabha (2015-09-20). "Poet's life, as seen by his daughter". The Hindu (in Indian English). Kozhikode. ISSN 0971-751X.
- ↑ 6.0 6.1 6.2 "Mahakavi Akkitham Achuthan Namboothiri". keralatourism.org. Archived from the original on 2020-10-01. Retrieved 2020-05-27.
- ↑ "Kerala Sahitya Akademi Award for Poetry".
- ↑ "Kendra Sahitya Academy Awards (Malayalam)". Public Relations Department, Government of Kerala. Archived from the original on 2007-05-24. Retrieved 2020-05-27.
- ↑ "Winners of Odakkuzhal Award".
- ↑ "Asan Smaraka Kavitha Puraskaram recipients". Archived from the original on 2014-04-13. Retrieved 2020-05-27.
- ↑ "Lalithambika Antharjanam Smaraka Sahitya Award".
- ↑ "Winners of Vallathol Literary Awards".
- ↑ "വയലാര് അവാര്ഡ് അക്കിത്തത്തിന്".
- ↑ "Ezhuthachan Puraskaram presented". The Hindu (in Indian English). 2008-12-25. Retrieved 2019-03-09.
- ↑ "Ezhuthachan award for Akkitham 2". The Hindu (in Indian English). 2008-11-01. Retrieved 2019-03-09.
- ↑ "Ezhuthachan award for Akkitham". The Hindu. 1 November 2008. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 18 March 2010.
- ↑ "List of Padma awardees 2017". The Hindu (in Indian English). 2017-01-25. Retrieved 2019-03-09.
- ↑ "Padma Awards 2017 announced".
- ↑ "Padma Shri presented to Akkitham".
- ↑ "Malayalam poet Akkitham wins 55th Jnanpith Award". The Hindu (in Indian English). 2019-11-29. ISSN 0971-751X. Retrieved 2019-11-30.
బాహ్య లింకులు
మార్చు- P. P. Raveendran (2002). Joseph Mundasseri. Sahitya Akademi. pp. 49–. ISBN 978-81-260-1535-1.
- "കൊന്നതാരെന്നു തർക്കം; ഇടിമുഴക്കം പോലെ ഉയരുന്നു ആ വരികൾ". ManoramaOnline. Retrieved 8 March 2019.
- P. P. Raveendran (2002). Joseph Mundasseri. Sahitya Akademi. pp. 49–. ISBN 978-81-260-1535-1.