అక్బర్ అలీ ఖాన్ (1899-1994) ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు.[1]

అక్బర్ అలీ ఖాన్
Akbar Ali Khan

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలము
1954 – 1972

పదవీ కాలము
1972 – 1974

పదవీ కాలము
1974 – 1976

వ్యక్తిగత వివరాలు

జననం 20 నవంబర్ 1899
మరణం 28 ఏప్రెల్ 1994
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తి న్యాయవాది
మతం ముస్లిం

వీరు 1899 సంవత్సరం హైదరాబాదునగరంలోని ఒక జాగీర్దారీ కుటుంబంలో జన్మించారు. తండ్రి మహబూబ్ అలీ ఖాన్, తల్లి కరమతున్నీసా బేగం. ఇంగ్లాండు వెళ్లి బారిస్టర్ పట్టా పొంది హైదరాబాదు హైకోర్టులో పనిచేయడం ప్రారంభించి; సుమారు మూడు దశాబ్దాలు ఆ వృత్తిలో మంచి పేరు సంపాదించారు. వీరు 1954లో రాజ్యసభకు సభ్యులుగా ఉన్నారు. 1972 నుండి 1974 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నరుగాను 1974 నుండి 1975 వరకు ఒరిస్సా గవర్నరుగాను పదవీ బాధ్యతలు నిర్వహించారు.

వీరిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది.[2]

వీరు 1994 ఏప్రిల్ 26 తేదీన పరమపదించారు.

మూలాలుసవరించు

  1. ఎం.ఎల్., నరసింహారావు (2005). వెలగా, వెంకటప్పయ్య; ఎం. ఎల్., నరసింహారావు (eds.). 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 2. |access-date= requires |url= (help)
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Retrieved July 21, 2015.