అఖీదాహ్
అఖీదాహ్ (కొన్నిసార్లు : అఖీదా, అఖీదత్ అని కూడా పలుకుతారు) (అరబ్బీ : عقيدة) ఇస్లామీయ ధార్మిక విశ్వాస పద్ధతిని అఖీదాహ్ అంటారు. ఇస్లామీయ ధార్మిక విశ్వాసాన్నిగల్గిన సముదాయాన్నిగూడా అఖీదాహ్ అంటారు.
ఇస్లామీయ అఖీదా వ్యాసాల క్రమం:
| |
ఐదు స్థంభాలు (సున్నీ) | |
షహాద - విశ్వాస ప్రకటన | |
విశ్వాసాల ఆరు సూత్రాలు (సున్నీ ముస్లిం) | |
తౌహీద్ - ఏకేశ్వరోపాసన | |
ధార్మిక సూత్రాలు (పండ్రెండుగురు) | |
తౌహీద్ - ఏకేశ్వరోపాసన | |
మతావలంబీకరణ (పండ్రెండు ఇమామ్‌లు) | |
నమాజ్ - ప్రార్థనలు | |
ఏడు స్తంభాలు (ఇస్మాయిలీ) | |
వలాయ - సంరక్షణ | |
ఇతరములు | |
|
పరిచయము
మార్చుప్రపంచంలోని అన్ని ముస్లిం సముదాయాలూ ఈ అఖీదాను గలిగివున్నాయి. అందరూ ఏకగ్రీవంగా ఖురాన్ సూచించిన విశ్వాసమార్గాన్ని తు.చ. తప్పకుండా శిరసా ఆమోదించే విషయమిది. షియా, సున్నీలు పరస్పరం విరుద్ధంగా కనబడుతారు. కానీ "ఈమాన్", "అఖీదా" విషయంలో ఏలాంటి పొరపొచ్ఛాలు లేకుండా ఆమోదిస్తారు. ఉదాహరణకు అల్లాహ్, మలాయికాల స్థితిపై భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాని, అల్లాహ్, మలాయికాల ఉనికిపై ఏలాంటి సందేహాలు ఉండవు.
ఆరు విశ్వాసాంగాలు
మార్చుసహీ ముస్లిం, సహీ బుఖారి హదీసుల ప్రకారము మహమ్మదు ప్రవక్త ప్రవచించారు "ఈమాన్ అనునది ఈ విషయాలపై స్థిరమైన అఖీదాహ్ ను కలిగివుండడమే, విశ్వాసం అల్లాహ్ పై, అతడి మలాయిక (దూతలపై), అతడిచే అవతరింపబడ్డ గ్రంధాలు పై (ఖురాన్, జబూర్, తౌరాత్, ఇంజీల్ , ఇతర సహీఫాలు), అతడి ప్రవక్తలపై, ఖయామత్ పై , అల్లాహ్ చే వ్రాయబడ్డ తఖ్దీర్ (విధి) మంచిదైననూ, గాకున్ననూ."
ఆరు విశ్వాసాంగాలు
మార్చు- అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ ఒక్కడే పూజింపబడుటకు సరియైనవాడు. (తౌహీద్).
- ప్రవక్తలపై విశ్వాసం. అల్లాహ్ చే పంపబడ్డ అందరు ప్రవక్తలపై విశ్వాసం.
- మలాయిక పై విశ్వాసం. అల్లాహ్ దూతలపై విశ్వాసం.
- అవతరింపబడ్డ గ్రంధాలపై విశ్వాసం. అల్లాహ్ చే అవతరింపజేయబడిన గ్రంధాలపై విశ్వాసం. (ఖురాన్ తో సహా)
- యౌమ్-అల్-ఖియామ పై విశ్వాసం. ఖయామత్ పై విశ్వాసం. మరణం తరువాత జీవితంపై విశ్వాసం.
- తఖ్దీర్ పై విశ్వాసం. మంచిదైననూ గాకున్ననూ విధిపై విశ్వాసం.
సున్నీ, షియా ల అఖీదాహ్ ఈమాన్ పై, ఈమాన్ సదరు విశ్వాసాంగాలపై ఆధారపడియున్నది.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- Meaning of "Akida" (Map and guide to Tanzania)
- Six Articles of Islamic Faith A description of the Six Articles of Islamic faith.
- Exhaustive Books & Articles on Aqeedah