అగ్నిమిత్ర పాల్
అగ్నిమిత్రా పాల్ ఒక భారతీయ ఫ్యాషన్ డిజైనర్, రాజకీయవేత్త. ఆమె అసన్‌సోల్ దక్షిణ్ నియోజకవర్గం నుండి పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యురాలిగా, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా పశ్చిమ బెంగాల్ యూనిట్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది.[3] రాజకీయాల్లోకి రాకముందు ఆమె కోల్‌కాతాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్.
అగ్నిమిత్ర పాల్ | |
---|---|
పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యురాలు[1] | |
Assumed office 2021 మే 2 | |
అంతకు ముందు వారు | తపస్ బెనర్జీ |
నియోజకవర్గం | అసన్సోల్ దక్షిణ్ |
పశ్చిమ బెంగాల్ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు | |
In office 2020–2021 | |
అంతకు ముందు వారు | లాకెట్ ఛటర్జీ |
తరువాత వారు | తనుజా చక్రవర్తి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | అగ్నిమిత్ర రాయ్ 1974 నవంబరు 25[2] అసన్సోల్, పశ్చిం బర్ధమాన్ జిల్లా, పశ్చిమ బెంగాల్ |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | పార్థో పాల్ |
సంతానం | 2 కుమారులు |
తండ్రి | డా. అశోక్ రాయ్ |
కళాశాల |
|
నైపుణ్యం | రాజకీయ నాయకురాలు, ఫ్యాషన్ డిజైనర్ |
వ్యక్తిగత జీవితం
మార్చుఅగ్నిమిత్ర వైద్యులు, విద్యావేత్తల కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ అశోక్ రాయ్ అసన్సోల్ లో శిశువైద్యుడు. ఆమె లోరెటో కాన్వెంట్, అసన్సోల్ బాలికల కళాశాల నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె బనవారిలాల్ భలోటియా కళాశాలలో వృక్షశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
ఆమె పార్థో పాల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.[4] వీరికి ఇద్దరు పిల్లలు.
కెరీర్
మార్చుఫ్యాషన్ డిజైనర్ గా అగ్నిమిత్ర పాల్, కోయి మేరే దిల్ సే పూచే, వయా డార్జిలింగ్ వంటి అనేక బాలీవుడ్ చిత్రాలకు దుస్తులను డిజైన్ చేసింది.[5]
ఆమె శ్రీదేవి, ఇషా డియోల్, మిథున్ చక్రవర్తి, షోనల్ రావత్, కే కే మీనన్, సోనాలి కులకర్ణి, వినయ్ పాఠక్, పర్వీన్ దబాస్ వంటి వారికి దుస్తులు, వ్యక్తిగత వార్డ్‌రోబ్ లను రూపొందించింది.[6][7]
ఆమె భారతదేశంలోని అనేక నగరాల్లో తన సొంత ఫ్యాషన్ లేబుల్ "ఇంగా" ను ప్రారంభించింది. పాల్ లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్/రిసార్ట్ 2013 కోసం కూడా డిజైన్ చే'rgdr.
అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ కు ఆమె రూపొందించిన శాలువలు, దుప్పట్లు అందజేసింది.[7]
రాజకీయ జీవితం
మార్చు2020లో లాకెట్ ఛటర్జీ తరువాత అగ్నిమిత్ర పాల్ పశ్చిమ బెంగాల్ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలైంది.[8]
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, ఆమె రాష్ట్రంలోని 23 జిల్లాల్లో మహిళల కోసం "ఉమా" అనే ఆత్మరక్షణ శిక్షణా వర్క్‌షాప్ లను నిర్వహించింది.[9]
ఆమె 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో అసన్‌సోల్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గం నుండి టిఎంసి అభ్యర్థి సాయోని ఘోష్ ను ఓడించింది.[10]
మూలాలు
మార్చు- ↑ "Asansol Dakshin Election Result 2021 Live Updates: Agnimitra Paul Of BJP Wins". News18.
- ↑ "Bio". myneta.info. Retrieved 2021-05-03.
- ↑ "Asansol Dakshin Election Result 2021 LIVE: BJP's Agnimitra Paul wins by 1,800 votes". cnbctv18.
- ↑ "Following her heart". www.telegraphindia.com.
- ↑ "Fashion designer Agnimitra Paul joins BJP in Bengal". Business Standard India. 23 March 2019 – via Business Standard.
- ↑ "Sridevi gave me my Bollywood break in 2000: Agnimitra Paul". Business Standard India. Press Trust of India. 26 February 2018 – via Business Standard.
- ↑ 7.0 7.1 "About Indian Designer Agnimitra Paul | Search Indian and Asian Fashion Designer Online". strandofsilk.com. Archived from the original on 25 June 2021. Retrieved 3 May 2021.
- ↑ Das, Madhuparna (24 June 2020). "Roopa, Locket, Agnimitra — how BJP mahila morcha got a 'glamorous turn' in Bengal".
- ↑ "BJP Mohila Morcha to give self-defence training to Bengal women". The Hindu. 16 September 2020 – via www.thehindu.com.
- ↑ "TMC's Saayoni, BJP's Agnimitra battle it out in Asansol South | Kolkata News - Times of India". The Times of India. 27 April 2021.