సాయోని ఘోష్ (జననం 1993 జనవరి 27) ఒక భారతీయ బెంగాలీ చలనచిత్ర, టెలివిజన్ నటి, గాయని. ఆమె జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యురాలు కూడా.[1][2] ఆమె టెలిఫిల్మ్ ఇచే దానా తో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇక పెద్ద తెరపై ఆమె అరంగేట్రం నోటోబోర్ నాట్అవుట్ చిత్రంలో చిన్న పాత్రతో జరిగింది.[3]

సయోని ఘోష్
2015లో సయోని ఘోష్
లోక్ సభ సభ్యురాలు
Assumed office
2024 జూన్ 4
అంతకు ముందు వారుమిమీ చక్రవర్తి
నియోజకవర్గంజాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్
Assumed office
2021 జూన్ 5
అంతకు ముందు వారుఅభిషేక్ బెనర్జీ
వ్యక్తిగత వివరాలు
జననం (1993-01-27) 1993 జనవరి 27 (వయసు 31)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (2021-ప్రస్తుతం)
చదువుహీరేంద్ర లీలా పాత్రనావిస్ స్కూల్
వృత్తినటి • రాజకీయవేత్త
పురస్కారాలు
  • టిటిఐఎస్ ఉత్తమ నటి అవార్డు 2010
  • మిర్చి మ్యూజిక్ అవార్డ్ బంగ్లా, 2012
  • విజేత 'ఐ లాఫ్ యు సీజన్ 3, 2015

సయోని 2013, 2014లలో కలకత్తా ఫుట్‌బాల్ లీగ్‌ని ప్రత్యక్ష ప్రసార సమయంలో జల్షా మూవీస్ కోసం సహ-హోస్ట్ గా వ్యవహరించింది.

కెరీర్

మార్చు

ఆమె 2011లో రాజ్ చక్రవర్తి రూపొందించిన చిత్రం షోట్రులో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత రాజ్ చక్రవర్తి రోజువారీ సీరియల్ ప్రోలోయ్ ఆషే లో పాత్రికేయురాలి పాత్రను పోషించింది.[4] ఆమె కనమాచి, అంతరాల్, ఏక్లా చోలో, అమర్ సాహోర్, బిట్నూన్, మేయర్ బీ, రాజ్కాహిని చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది.[1]

హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు తాతాఘతా రాయ్ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత జనవరి 2021లో ఆమె రాజకీయాల్లోకి వచ్చింది.[5]ఆమె 2021 ఫిబ్రవరి 24న అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ చేరింది.

మార్చి 2021లో, ఆమె 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో అస‌న్‌సోల్ దక్షిణ్ శాసనసభ నియోజకవర్గానికి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీబడింది. అయితే ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ చేతిలో ఓడిపోయింది.[6]

జూన్ 2021లో ఆమెను తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షురాలిగా నియమించారు.[2] 2022 పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆమెను 2023 జూన్ 30న ప్రశ్నించింది.[7] 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో, ఆమె జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ అభ్యర్థిగా పోటీ చేసి రెండున్నర లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించింది.[8]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2010 నోట్బోర్ నోటౌట్
2011 షోట్రు పూజ సోదరి
2013 కనమాచి
2013 అలిక్ సుఖ్ నమితా
2013 అంతారాల్
2013 ఆగన్
2014 గోల్పో హోలియో షోట్టీ స్మితా
2014 పునశ్చ
2014 అరణ్యదేబ్
2015 ఏక్లా చోలో రియా
2015 బోధోన్
2015 బిట్నూన్ రుషా
2015 చౌకాత్-ది థ్రెషోల్డ్
2015 బావల్ నుస్రత్
2015 నాటోకర్ మోటో-ఒక నాటకం లాగా ఖెయా స్నేహితురాలు
2015 ఆరో ఎక్బర్
2015 మేయర్ బీయ్
2015 బాబర్ నామ్ గాంధీ ట్రినా
2015 హషితే హషనా
2015 రాజకహిని కోలి
2016 అబార్ ఏక్లా చోలో
2016 బ్యోమకేష్ ఓ చిరియాఖానా ముకుల్
2016 కిరితి రాయ్
2017 మేఘనాథ్ బద్ రహస్యా ఎలెనా
2017 అమర్ సహోర్
2017 అందర్కాహిని
2017 చలో లెట్స్ లైవ్
2017 కిచ్చు నా బోలా కథా
2018 జోజో
2018 కా ఖా గా ఘ
2018 గుడ్ నైట్ సిటీ
2018 రీయునియన్
2019 ద్విఖోండిటో
2019 కే తూమి నందిని
2019 రాంగ్ నంబర్
2019 అడ్డా
2019 అతితి
2019 షక్కీ-జహా బోలిబో షొట్టి బోలిబో
2019 నెట్వర్క్
2019 బ్రోమ్బోడోయిటో
2019 సంజబతి శ్యామలి
2020 ప్రతిధ్వని
2020 డ్రాకులా సర్ రోమిలా సినీ నటిగా చిన్న పాత్ర
2022 అపరాజితో బిమలా రే, అపరాజితో భార్య
2022 సిటీ ఆఫ్ జాకల్స్
2022 ఉత్తవరన్
2023 రహ్సిమోయ్
2023 లాల్: సూట్‌కేసు తా దేఖెచెన్?

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Saayoni Ghosh Movies: Latest and Upcoming Films of Saayoni Ghosh | eTimes". The Times of India. Retrieved 9 February 2021.
  2. 2.0 2.1 Singha, Aritra (5 June 2021). "West Bengal: Abhishek Banerjee appointed as TMC general secretary; Saayoni Ghosh takes charge as party's youth wing president". The Free Press Journal (in ఇంగ్లీష్).
  3. "Actress Sayoni Ghosh to feature in 'Lockdown Diary' - Times of India". The Times of India. Saayoni came into the limelight after featuring in the telefilm 'Ichche Dana'in 2009. (in ఇంగ్లీష్). Retrieved 9 February 2021.
  4. "Lokmat News | Sayoni Ghosh as journalist role in Raj Chakraborty's daily soap Proloy Asche". Lokmat English (in ఇంగ్లీష్). Retrieved 9 February 2021.
  5. Kundu, Indrajit (18 January 2021). "BJP's Tathagata Roy files complaint against actor Sayoni Ghosh over meme for 'hurting Hindu sentiments'". India Today.
  6. "Mamata Banerjee releases TMC's candidate list for Bengal elections". Business Insider.
  7. https://theprint.in/india/ed-grills-tmcp-leader-saayoni-ghosh-for-11-hours-in-school-jobs-scam-probe/1650016/
  8. https://www.dnaindia.com/entertainment/report-meet-actress-saayoni-ghosh-made-headlines-for-hurting-religious-sentiments-upset-bjp-in-lok-sabha-elections-3092081