అజాన్
అజాన్ (ఆంగ్లం : Adhan (Athaan) ) (అరబ్బీ : أَذَان) అనునది, ఇస్లామీయ ప్రార్థనల పిలుపు లేదా ప్రకటన.ఈ ప్రకటనను చిన్న మసీదుల్లో నయితే భవనం పక్కతలుపు దగ్గరనుండి పెద్ద మసీదుల్లోనయితే స్తంభంపైనుండి ముఅజ్జిన్ బిగ్గరగా అందరికీ వినబడేలా అరుస్తాడు. ముఅజ్జిన్ అంటే అరిచేవాడు లేదా పిలిచేవాడు.కొంతమంది ముఅజ్జిన్లు అజాన్ ను రాగయుక్తంగా శ్రావ్యంగా పాడుతారు కూడా.
అజాన్ పలుకులు (సున్నీ)సవరించు
పలుకులు | అరబ్బీ | తెలుగు లిప్యాంతరీకరణ | తర్జుమా |
---|---|---|---|
4x | الله اكبر | అల్లాహు అక్బర్ | అల్లాహ్ గొప్పవాడు* |
2x | اشهد ان لا اله الا الله | అష్-హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్ | అల్లాహ్ ఒక్కడే దేవుడని నేను సాక్ష్యమిస్తున్నాను, |
2x | اشهد ان محمدا رسول الله | అష్-హదు అన్న ముహమ్మద అర్-రసూల్ అల్లాహ్ | ముహమ్మద్ దైవప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను |
2x | حي على الصلاة | హయ్యా అలస్-సలాహ్ | నమాజ్ కోసం త్వరపడండి |
2x | حي على الفلاح | హయ్యా అలల్-ఫలాహ్ | విజయం కోసం త్వరపడండి |
2x | الله اكبر | అల్లాహు అక్బర్ | అల్లాహ్ గొప్పవాడు |
1x | لا اله الا الله | లా ఇలాహ ఇల్లల్లాహ్ | అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు. |
* మాలికి మజహబ్ వారు 4 సార్లకు బదులుగా 2 సార్లు మాత్రమే పలుకుతారు.
** వాక్యం "నిదుర కంటే ప్రార్థన మిన్న" అనునది, ఫజర్-నమాజ్ యొక్క అజాన్ యందు పలుకుతారు.
అజాన్ గురించి కొన్నిమాటలుసవరించు
- ఈ 'అజాన్' ను ముహమ్మద్ ప్రవక్త గారు వ్రాయలేదు, అనలేదు, వీరి సహాబా, ఇథియోపియన్ స్వేచ్ఛనివ్వబడిన బానిస అయిన బిలాల్ ఈ అజాన్ ను పాడారు. ముహమ్మద్ ప్రవక్త, ప్రార్థనల పిలుపు కొరకు దీనిని స్థిరపరచారు.
- 1.నేను (ప్రవక్త ) పరదైసు వెళ్ళి ముత్యాల గోపురాలు చూశాను.దాని మురికి కస్తూరిలా ఉంది.అది నా అనుచరులూ, అజాన్ ఇచ్చే ముఅజ్జిన్ లు, ఇమామ్ లకోసమేనని జిబ్రాయిల్ చెప్పారు. (రవహు అబు యలఫీ ముస్నద్)
- 2.అజాన్ పలికే వారి గురించి పునరుత్థాన దినాన సృష్టి సాక్ష్యమిస్తుంది. (బుఖారీ )
- 3.అజాన్ పలికే వారి శవాలకు పురుగులు పట్టవు.వారి దేహాలు రక్తంలో తడిసిన అమరవీరుల దేహాల్లా ఉంటాయి (రవహుత్ తబ్రాని)
- 4.అజాన్ కు వచ్చే బహుమతి ఏమిటో తెలిస్తే భక్తులు కత్తులు దూసుకుంటారు (రవహు అహ్మద్)
- 5.అజాన్ ఇచ్చే వారికి పునరుత్థాన దినాన పొడవాటి మెడలు ఉంటాయి (ముస్లిం)
- అజాన్ ఇచ్చేటప్పుడు, యుద్దసమయంలో చేసే ప్రార్థన తిరస్కరించబడదు. (దావూద్:1058)
- మీలో అతి మంచి వాళ్ళు అజాన్ పలకండి, ఖురాన్ బాగాచదవగలిగేవాళ్ళు ఇమామ్ లుగా ఉండండి (దావూద్:233)
- ఫాతిమాకు హసన్ పుట్టినప్పుడు అతని చెవిలో ప్రవక్త అజాన్ పలుకులు చెప్పారు (దావూద్:2419)
- ఈద్ ప్రార్థన అజాన్ ఇఖామా లేకుందానే ప్రవక్త చేశారు (దావూద్:441)
- అజాన్ విన్నప్పుడు మీరుకూడా అజాన్ పలకండి (బుఖారీ 1:585)
- వర్షాకాలం బురద తొక్కిడి రోజుల్లో ఇళ్ళలోనే నమాజు చేసుకోమని ఇబ్నే అబ్బాస్ చెప్పారు (బుఖారీ 1:590)
- అజాన్ వినపడకుండా సైతాన్ గాలి శబ్దం చేస్తాడు.ఇఖామా తరువాత కూడా విశ్వాసి హృదయాన్నిదారి మళ్ళించి ఎంత ప్రార్థన చేశాడో మరచిపోయేలా చేస్తాడు. (బుఖారీ 1:582)
అజాన్ తరువాత దుఆసవరించు
ముస్లింలు అజాన్ విన్న తరువాత ఈ దుఆ చదువుతారు.
అరబ్బీ | తెలుగు లిప్యాంతరీకరణ | తర్జుమా |
---|---|---|
اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة | అల్లాహుమ్మ రబ్బా హాది-హిద్ దావతిత్-తామ్మ వ-సలాతిల్ ఖాయిమ | ఓ అల్లాహ్! ఈ పిలుపుకు, మా ప్రార్థనలకు ప్రభువా, |
آت محمداً الوسيلة و الفضيلة | ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత | ముహమ్మద్ కు నీ సామీప్యాన్ని విశిష్టతను, ఉన్నత స్థానాన్ని ప్రసాదించు. |
وابعثه مقاماً محموداً الذي وعدته | వబ్ అత్-హు మకామమ్-మహ్‌మూద-నిల్ లది వ-అత్-త | , నీవు అతని కొరకు మాటిచ్చిన స్థానాన్ని మాకూ ప్రసాదించు. |
ఇవీ చూడండిసవరించు
మూలాలుసవరించు
- [4] Sahih Imam Muslim Translation into English by Abdul Hamid Siddiqi
- https://web.archive.org/web/20061216160137/http://www.iad.org/Pillars/athan.html