అల్లాహు అక్బర్ : అల్లాహ్ అనగా దేవుడు 'అక్బర్' అనగా గొప్పవాడు అని అర్ధం. 'అక్బర్' అనునది అరబ్బీ పదజాలము. 'అక్బర్' అనే పదానికి మూలం 'కిబ్ర్', అనగా 'గొప్ప'. ఈ మూలంతో పుట్టిన పదాలు 'కబీర్', 'అక్బర్', 'కుబ్రా', వీటన్నిటికీ అర్థం 'గొప్ప' లేదా 'ఘనమైన'. అల్లాహ్ విశేషణాత్మక 99 నామాలలో 'అక్బర్' ఒకటి. 'అల్లాహు అక్బర్' లేదా 'అల్లాహ్-ఒ-అక్బర్' అనునది ఒక తక్బీర్. తక్బీర్ అనగా ఒక 'స్తుతి'. ఈ తక్బీర్ అల్లాహ్ స్తుతి, లేదా అల్లాహ్ ను స్తుతించడం. తరచుగా ముస్లింలు 'నారయే తక్బీర్' అంటే 'అల్లాహు అక్బర్' అని జవాబిస్తారు. 'నారా' అంటే నినాదమని అర్థం, నారయే-తక్బీర్ అనగా కీర్తి-నాదం. మూలంగా చెప్పాలంటే 'అల్లాహ్ ను స్తుతిస్తూ కీర్తి నాదం చేయుట'.

అల్లాహు అక్బర్ చిత్రం

మసీదులలో మైకుల ద్వారా అల్లాహు అక్బర్ అంటూ నమాజుకు రండని రోజూ అయిదుసార్లు పిలుస్తారు. ఇలా పిలవటాన్ని అజాన్ అంటారు. సాయిబులు అక్బర్ చక్రవర్తిని తలుచుకొని ఇలా కేకలు పెడుతున్నారని కొంతమంది అపార్థం చేసుకుంటారు. కానీ అది దైవ స్తోత్రం. మొఘల్ రాజైన అక్బర్ కూ ఈ అజాన్ కూ ఏ సంబంధం లేదు.

ఇవీ చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=తక్బీర్&oldid=3265883" నుండి వెలికితీశారు