అడవిపాలెము, ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523302 [1]

అడవిపాలెము
గ్రామం
అడవిపాలెము is located in Andhra Pradesh
అడవిపాలెము
అడవిపాలెము
నిర్దేశాంకాలు: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E / 16.13; 79.949Coordinates: 16°07′48″N 79°56′56″E / 16.13°N 79.949°E / 16.13; 79.949 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాసంతమాగులూరు మండలం
మండలంసంతమాగులూరు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

గ్రామ చరిత్రసవరించు

చరిత్ర ప్రకారం ఈ గ్రామం దాదాపుగా 200 సంవత్సరాలుగా విరజిల్లుతున్నది. అడవిపాలెం గ్రామ ప్రజలు ప్రకాశం జిల్లా లక్కవరం నుండి వలస వచ్చి నివాసం ఏర్పరుచుకోనిరి. మరియెక గ్రామం పేరు "గొపాపురం"గా ఉందెది. ఈ గ్రామం ఎల్చురు గ్రామం దగ్గరిగా ఉందెది. కాల క్రమేనంలో ఇది దొంగలబారిన పడింది, ఆ బాధలు తాళ లేక ఈ గ్రామ ప్రజలు అడవిపాలెం గ్రామం ప్రజలతో జీవనం కొనసాగించారు. అదే ఇప్పటి అడవిపాలెం గ్రామం. గ్రామం ఏర్పడినప్పుడు అక్కడ చిన్న పాటి చెట్ల సముదాయం వుండేది అందువల్ల ఈ గ్రామానికి "అడవిపాలెం" అని పేరు ఆనాటి గ్రామస్థుల వలన నిర్ణయం జరిగింది. మరియొక కథనం ప్రకారం ఈ గ్రామం పేరు "ఆనందపురం" అని కూడా పేరుగాంచింది.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామం ఏర్పడినప్పుడు అక్కడ చిన్న పాటి చెట్ల సముదాయం వుండేది అందువల్ల ఈ గ్రామానికి "అడవిపాలెం" అని పేరు ఆనాటి గ్రామస్థుల వలన నిర్ణయం జరిగింది. మరియొక కథనం ప్రకారం ఈ గ్రామం పేరు ఆనందపురం అని కూడా పేరుగాంచింది.

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామం చుట్టూ ప్రక్కల గల గ్రామాలు ఏల్చూరు, కామేపల్లి, వెల్లాలచెరువు, గంటవారిపాలెం, మతుకుమల్లి, కారుమంచి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

సంతమాగులూరు, శావల్యాపురం, రొంపిచెర్ల, బల్లికురవ, అద్దంకి, వినుకొండ, నరసరావుపేట.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామానికి రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి.

  1. ఏల్చూరు నుండి మార్గం. ఇది సుమారుగా 4 కి.మీ దూరం, నేషనల్ హైవే - 45 కు సమీపముగా గలదు.
  2. వెల్లాలచెరువు నుండి మార్గం. ఇది సుమారుగా 4 కి.మీ దూరం, స్టేట్ హైవే - 50 కు సమీపముగా గలదు.

ఈ ఊరు చేరుకొనుటకు ప్రైవేటు ఆటోలు ఉన్నాయి. లేదా దాదాపుగా ఊరివారందరకు వ్యక్తిగత వాహనములు (బైక్స్, మోటారు వాహనములు) ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  2. నాలుగు వందల మంది చుట్టుప్రక్కల గల రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్నారు.
  3. గ్రంథాలయం.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

  1. ప్రదాన రహదారులు
  2. మంచి నీటి పధకం
  3. పంచాయితి భవనం
  4. కమ్యూనిటి భవనం
  5. కళ్యాణ మండపం
  6. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
  7. పశువుల ఆసుపత్రి
  8. సొసైటి భవనం
  9. పొలములకు ప్రత్యెక రహదారులు

గ్రామంలో రాజకీయాలుసవరించు

రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలసి మెలసి ఉంటారు. రాజకీయాలలో ఈ ఊరు ఆదర్శ గ్రామంగా ఉంటుంది .

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కోలా గురవమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ ఒంగోలు వెంకటరావు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలుసవరించు

ప్రదానంగా రామాలయం, శ్రీ వేంకటేశ్వర ఆలయం, శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి ఆలయము, శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి ఆశ్రమం, అప్పిరెడ్డి స్వామి ఆలయం, పోలేరమ్మ తల్లి ఆలయం, అంకాలమ్మ ఆలయాలు గలవు. వీటిలో ప్రధానంగా ప్రతి రోజు పూజలు అందుకొనే ఆలయాలు ఉన్నాయి.

  1. రామాలయం:- ఈ దేవాలయం గత 150 సంవత్సరాలుగా విరాజిల్లుతున్నది, ఇక్కడ శ్రీ రాముడు నిత్యం పూజలు అందుకుంటూ ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు.
  2. శ్రీ వెంకటేశ్వర ఆలయం:- ఈ దేవాలయం గత 20 సంవత్సరాలుగా విరాజిల్లుతున్నది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడు నిత్యం పూజలు అందుకుంటూ ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు.
  3. శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి ఆలయము:- ఈ దేవాలయం గత 10 సంవత్సరాలుగా విరాజిల్లుతున్నది, ఇక్కడ తిరుపతమ్మ తల్లి నిత్యం పూజలు అందుకుంటుంది.
  4. శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి ఆశ్రమం:- ఈ ఆశ్రమం గత 5 సంవత్సరాలుగా విరజిల్లుతున్నది, ఇక్కడ తిరుపతమ్మ తల్లి నిత్యం పూజలు అందుకుంటుంది.

ఆధ్యాత్మిక విశేషాలుసవరించు

ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రజలందరూ అత్యంత విభోవోపేతముగా భక్తీగా జరుపుకొనే సంబరాలు, ఊత్చవాలు, వేడుకలు, పండుగలు:- 1. సంక్రాంతి సంబరాలు 2. మహా శివరాత్రి జాగరణ 3. ఉగాది వేడుకలు 4. శ్రీరామా నవమి 5. వినాయక చవితి పూజలు, ఊత్చవాలు, ఊరేగింపులు 6. దసరా సంబరం 7. శ్రీ లకీౣ తిరుపతమ్మ తల్లి కళ్యాణం 8. అప్పిరెడ్డి తాత తిరునాళ్ళ 9. బొడ్డు రాయి పూజ 10. గ్రామ దేవతల పూజలు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, ఆగస్టు-30; 1వపేజీ.

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]