సంతమాగులూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం


సంతమాగులూరు మండలం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా లోని మండలం.[1]ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]మండలం కోడ్: 05104.[3] ఈ మండలం, బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని, అద్దంకి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. ఇది ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 20 మండలాల్లో ఇది ఒకటిOSM గతిశీల పటం

సంతమాగులూరు మండలం
జిల్లా పటంలో మండల ప్రాంతం
జిల్లా పటంలో మండల ప్రాంతం
సంతమాగులూరు మండలం is located in Andhra Pradesh
సంతమాగులూరు మండలం
సంతమాగులూరు మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండలకేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 16°06′N 79°54′E / 16.1°N 79.9°E / 16.1; 79.9Coordinates: 16°06′N 79°54′E / 16.1°N 79.9°E / 16.1; 79.9 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంసంతమాగులూరు
విస్తీర్ణం
 • మొత్తం20,747 హె. (51,267 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం59,528
 • సాంద్రత290/కి.మీ2 (740/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం సంతమాగులూరు మండల పరిధిలో మొత్తం జనాభా 59,528. వారిలో 30,355 మంది పురుషులు కాగా, 29,173 మంది మహిళలు ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండల పరిధిలో మొత్తం 15,344 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండలం సగటు సెక్స్ నిష్పత్తి 961.[4]

మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6782 ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 11% గా ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 3567 మగ పిల్లలు ఉండగా, 3215 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలం చైల్డ్ సెక్స్ నిష్పత్తి 901 గాఉంది. ఇది సంతమాగులురు మండల సగటు సెక్స్ నిష్పత్తి (961) కన్నా తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత 53.88% గా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 56.35% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 38.79% గా ఉంది.[4]

2001 మొత్తం 53,608 - పురుషులు 27,180 - స్త్రీలు 26,428 అక్షరాస్యత (2001) - మొత్తం 48.87% - పురుషులు 60.28% - స్త్రీలు 37.10%

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. చవిటిపాలెం
 2. మిన్నెకల్లు
 3. అడవిపాలెము
 4. వెల్లాలచెరువు
 5. కామేపల్లి
 6. సంతమాగులూరు
 7. తంగెడుమల్లి
 8. గురిజెపల్లి
 9. కొప్పారం
 10. సజ్జాపురం
 11. ఏల్చూరు
 12. కుందూరు (పశ్చిమ)
 13. కొమ్మలపాడు
 14. బండి వారిపాలెం
 15. పాతమాగులూరు
 16. మక్కెన వారి పాలెం
 17. మామిళ్ళపల్లి
 18. పరిటాలవారిపాలెం
 19. పుట్టావారి పాలెం
 20. పత్తెపురం
 21. కొప్పరం
 22. రామిరెడ్డిపాలెం

మూలాలుసవరించు

 1. "Villages & Towns in Santhamaguluru Mandal of Prakasam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-21.
 2. "Villages and Towns in Santhamaguluru Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఆంగ్లం). Retrieved 2020-06-21.
 3. "Santhamaguluru Mandal Villages, Prakasam, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-21.
 4. 4.0 4.1 "Santhamaguluru Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఆంగ్లం). Retrieved 2020-06-21.

వెలుపలి లంకెలుసవరించు