అడోబీ ఫోటోషాప్

(అడోబి ఫొటోషాప్ నుండి దారిమార్పు చెందింది)

అడోబీ ఫోటోషాప్ (Adobe Photoshop) లేక ఫోటోషాప్, ఫోటోలపై (ఛాయా చిత్రాలు) మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. ఈ సాఫ్టువేరును ఉపయోగించి ఫోటోలను కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీనిని అభివృద్ధి చేస్తూ, అమ్మకం చేస్తున్నది అడోబీ సిస్టమ్స్ (Adobe systems). ప్రపంచములో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్ మరియూ ఫోటోఎడిటర్లకు ప్రామాణికమైన ఇమేజ్ ఎడిటింగ్ పరికరంగా ప్రసిద్ధి చెందింది.[1] ఆగస్టు 30, 2012న విడుదల చేయబడిన అడోబీ ఫొటోషాప్ సిఎస్6, ప్రస్తుతం లభ్యమవుతున్న తాజా వెర్షను. సిఎస్6లో ఉన్న 6, అడోబీ క్రియేటీవ్ స్యూట్ లో ఫోటోషాప్‌ను కూడా కలిపేసిన తరువాత విడుదల చేసిన 6వ వెర్షను అని సూచిస్తుంది.

అడోబీ ఫోటోషాప్
అభివృద్ధిచేసినవారు అడోబీ సిస్టమ్స్ దస్త్రం:AdobeSystems.png
సరికొత్త విడుదల సిఎస్6 , సిఎస్6 ఎక్స్‌టెండెడ్ (13.0) / 23/04, 2012
ప్రోగ్రామింగ్ భాష సీ++
నిర్వహణ వ్యవస్థ విండోస్
మ్యాకింటాష్
రకము రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్
లైసెన్సు యాజమాన్య సంబంధమయినది
వెబ్‌సైట్ అడోబీ ఫోటోషాప్

అభివృద్ది

మార్చు

ప్రారంభ చరిత్ర

మార్చు
 
ఫోటోషాప్ సృష్టి కర్త థామస్ నోల్
 
థామస్ నోల్ తమ్ముడు జాన్ నోల్; ఇతను ఫోటోషాప్ అభివృద్ధిలో పాలుపంచుకున్నాడు

1987లో అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో థామస్ నోల్ (Thomas Knoll) అనే పరిశోధనా (PhD) విద్యార్థి, తన మ్యాకింటాష్ ప్లస్ కంప్యూటరులో, గ్రే స్కేల్ (greyscale: నలుపు తెలుపు రంగుల మిశ్రమం) చిత్రాలను మొనోక్రోం (monochrome: నలుపు తెలుపు రంగులు మాత్రమే) తెరపై కనిపించేలా ఒక ప్రోగ్రాం వ్రాయటం మొదలు పెట్టాడు. "డిస్ప్లే" అనే ఈ ప్రోగ్రామును థామస్ నోల్ తమ్ముడు జాన్ నోల్ (John Knoll) దృష్టిని ఆకర్షించింది. ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ అనే సంస్థలో పనిచేస్తున్న జాన్ నోల్ ప్రోత్సాహంతో థామస్ నోల్ "డిస్ప్లే" అనే ఈ చిన్న ప్రోగ్రామును పూర్తి స్థాయి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్టువేరుగా మార్చాలని నిర్ణయించుకుని తన పి.హెచ్.డి చదువు నుండి 6 నెలలు పాటు విరామం తీసుకున్నాడు. ఈ విరామంలో తమ్ముడితో కలసి 1988లో "ఇమేజ్ ప్రో" (ImagePro) అనే మొదటి ఎడిటింగ్ సాఫ్టువేరును తయారు చేసాడు.[2]

తరువాతి సంవత్సరంలో థామస్ నోల్ ఇమేజ్ ప్రో సాఫ్టువేరును ఫోటోషాప్ గా పేరుమార్చి, స్కానర్లు తయారు చేసే 'బర్నేస్కాన్' అనే ఒక కంపెనీతో వారి స్కానర్ పరికరంతో పాటుగా పంపిణి చేసేట్టు ఒప్పందం కుదుర్చుకుని 200 ఫోటోషాప్ కాపీలు అమ్మగలిగారు.[3] ఇదే సమయంలో జాన్ నోల్, సిలికాన్ వ్యాలీలోని యాపిల్ ఇంజినీర్లకు ఫోటోషాప్ పనితనాన్ని ప్రదర్శించి, వాళ్ళను మెప్పించగలిగాడు. సెప్టెంబరు, 1988లో అడోబీ సంస్థ, ఫోటోషాప్ పంపిణీ హక్కులను కొనుక్కుంది.[2] జాన్ నోల్ కాలిఫోర్నియాలో ఉండి ఫోటోషాప్ ప్లగ్‌ఇన్‌ల మీద పనిచేస్తూ ఉంటే, థామస్ నాల్ అర్బోర్ పట్టణంలో ఉండి ఫోటోషాప్ ప్రొగ్రామును అభివృద్ధిపరుస్తూ ఉండేవాడు.[4]

విడుదలలు

మార్చు
మరింత సమాచారం కోసం ఫోటోషాప్ వెర్షన్లు చూడండి

తరువాత కొన్ని సంవత్సరములపాటు ఫొటోషాప్ ప్రోగ్రాముకు పనితీరుకు మరిన్ని హంగులను జోడించి, దానిని అభివృద్ధి పరుస్తూ కొత్త కొత్త వెర్షన్లను వుడుదల చేశారు. 1992 నవంబరులో, మైక్రోసాఫ్టు విండోసులో కూడా పనిచేయగలిగే ఫొటోషాప్ రెండవ వెర్షనును విడుదల చేశారు, ఇంకో సంవత్సరానికి ఎస్‌జీఐ, ఐఆర్ఐక్స్ మరియూ సన్ సోలారిస్ ప్లాట్ఫారాలపై కూడా ఫొటోషాప్‌ను నడపగలిగేటట్లు చేశారు. సెప్టెంబరు 1994లో మూడవ వెర్షనును విడుదలతో, ఫొటోషాప్‌లో లేయర్లూ మరియూ ట్యాబ్డ్ ప్యాలెట్ల సదుపాయాన్ని కల్పించారు. 2003 ఫిబ్రవరిలో, విడుదల చేసిన కెమెరా రా 1.x ప్లగిన్‌తో, వాడుకరులు తమ డిజిటలు కెమెరాల నుండి నేరుగా ఫొటోషాప్‌లోకి చిత్రాలను తెచ్చుకోగలిగే సదుపాయాన్ని కల్పించారు.[5]

2004 అక్టోబరులో, ఈ ప్రోగ్రాముకు అడోబీ ఫొటోషాప్ CS అనే కొత్త పేరు పెట్టారు. ఈ పేరులో ఉన్న CS అనే అక్షరాలు, అడోబీ సంస్థ విడుదల చేస్తున్న అడోబీ క్రియేటీవ్ స్యూట్‌లో ఫొటోషాప్ కూడా ఒక భాగమని సూచిస్తుంది.[6] ఫొటోషాప్ యొక్క 10వ వెర్షను, ఫొటోషాప్ CS3ని ఏప్రిల్ 16, 2007న విడుదల చేసారు.

విండోసుపై నడిచే సాఫ్టువేర్లను, లినక్సులో కూడా వాడుకునేటట్లు చేసే వైన్ సాఫ్టువేరు, జనవరి 2008లో, ఫొటోషాప్‌ CS2ను కూడా లినక్సు తదితర వ్యవస్థలపై వాడుకునే సదుపాయాన్ని కల్పించిందని అధికారికంగా ప్రకటించింది.

ఫొటోషాప్‌ను సీ++ ప్రోగ్రామింగు భాషలో రూపొందించారు.[7]
ఫోటోషాప్ ఎక్స్ ప్రేస్

అడోబి కంపెనీ వారు ఈ మధ్యనే ఫోటోషాప్ ఎక్స్ ప్రేస్ పేరుతో ఆన్ లైన్ ఫోటో ఎడిటింగ్ సౌకర్యం కలిగించారు. ఎవరైనా రిజిస్టర్ చేసుకుని తమ ఫోటోలని ఎగుమతి చేసుకుని కావలసిన మార్పులు చేర్పులు (ఎడిటింగ్)చేసుకుని ఆల్బం రూపంలో ఉంచుకోవటంతో పాటు ఫేస్ బుక్ లాంటి సైట్లకి ఎగుమతి చేసికోవచ్చు లేదా తమ ఈ మెయిలుకి పంపుకోవచ్చు. ఇందుకోసం అడోబి వారు 2జీబి స్పేస్ ఉచితంగా ఇస్తున్నారు. తమ ఆదాయాన్ని పెంచుకోవటంతో పాటు ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్న సైట్లకి (సంస్థలకి) గట్టి పోటీ ఇవ్వటం అడోబి వారి వ్యాపార ఎత్తుగడగా కనిపిస్తుంది.

ఫోటోషాప్ ఆల్బం స్టార్టర్ ఎడిషన్

మార్చు
 
ఫోటోషాప్ తో సృజనాత్మకంగా తయారు చేసిన మనిషి చిత్రం

పేరులో సూచించినట్లే ఫోటోగ్రఫి నేర్చుకుంటున్న వారి కోసం, వారు తీసిన ఫోటో లని చిన్న చిన్న మార్పులు చేయటం,ఆల్బంలుగా మార్చుకోవటం మొదలగు ప్రాథమిక ఎడిటింగ్ ఎలాగో నేర్చు కోవటానికి ఇది ఉద్దేశింపబడింది.

  • ఒక్క క్లిక్ లో సాధారణంగా ఫోటోలలో వుండే తప్పులని సరిచేయడం: అంటే ఫ్లాష్ ఉపయోగించి ఫోటో తీసినప్పుడు కళ్ళల్లో వచ్చే ఎర్రటి చుక్క (red eye), రంగులని (color), ఫోటో లోని ప్రకాశపు స్థాయి (brightness)
  • సులభముగా పంచుకోవటం: ఫోటోలని ఈమెయిలు ద్వారా పంపించుకోవటం, మొబైల్ ఫోన్ లకి పంపించుకోవటం, సులభముగా సీడీ (CD)లో వ్రాయటం (తయారు చేయటం), మీరే స్వంతంగా ప్రింట్లు వేసుకోవటం లేదా ఆర్డర్ చేయటం, ఫోటో బుక్స్ గా తయారు చేయటం ఇంకా ఆన్‌లైన్ లో ఎన్నో విధాలు.
  • ఏ ఫోటోని అయిన స్నాప్ (snap)తో కనుగోనటం: ఆటోమాటిక్ అర్గన్యేజేషన్ (automatic organisation) అనే ప్రక్రియలో మీ డిజిటల్ ఫోటోలని అన్నింటిని ఒక్క చోటే క్రమ పద్ధతిలో అంటే అందరికి తెలిసిన కాలెండరు రూపంలో చూపిస్తుంది.

విశేషాలు

మార్చు
 
ఫొటొషాప్ సిఎస్3 పటచిత్రం

1980 లలో వచ్చిన "మ్యాక్" వెర్షన్లు ఇమేజ్ ఎడిటింగ్ ని పర్సనల్,డెస్కుటాపు కంప్యూటర్ లలో వాడుకొనుటని ఎంతో సులభతరం చేయటమే కాక, ప్రాచుర్యం లోనికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఫోటోషాప్ విండోస్ (windows), మ్యాకింటాష్ (macintosh) ప్లాట్ ఫోరంలలో 'ఫోటోషాప్ ఫ్యామిలీ' క్రింద సరదాగా,ఫోటోలని,ఇమేజ్ లని మార్పులు చేసుకునే వారికోసం "అడోబీ ఫోటోషాప్ ఆల్బం స్టార్టర్ ఎడిషన్" మొదలుకుని ఫిల్మ్,వీడియో,మల్టిమేడియా,వెబ్,గ్రాఫిక్ దేజినేర్,3డి,మోషోన్ పిక్చర్ మాన్యు ఫక్చురేర్లు,అర్కి టేక్టులు,ఇంజనీర్ లు,సైంటిఫిక్ పరిశోధకులు మొదలయిన ఉన్నతశ్రేణి వృత్తి నిపుణుల కోసం "అడోబీ ఫోటోషాప్ సిఎస్3 ఎక్స్ టెండేడ్ (CS3 extended) అనే ఎడిషన్ వరకు రకరకలయిన వెర్షన్ లని అందరికి అందుబాటులోకి తెచ్చింది.

ఫోటోషాప్ ఆర్ జి బి (RGB),లాబ్ (lab),సి ఎం వై కె (CMYK),గ్రే స్కేల్ (grayscale),బైనరి బిట్టుమాప్ (binary bitmap), డ్యూ టోన్ (duotone) రంగుల విధానంలో పనిచేస్తుంది లేదా చిత్రాలని గుర్తిస్తుంది అని చెప్పవచ్చు.

ఫోటోషాప్ రాస్టర్, వెక్టార్ గ్రాఫిక్ ఫార్మాట్ రెండింటిలో చిత్రాలని స్వీకరిస్తుంది. అంటే .యి పి ఎస్ (.EPS) .పి ఎన్ జి (.PNG) .జిఫ్ (.GIF).జే పి ఇ జి (.JPEG) .ఫైర్ వర్క్స్ (Fireworks) ఫోర్మాట్లలో ఉన్న చిత్రాలని ఎడిటింగ్ చేసికోవచ్చు అని అర్థం.

తన (ఫోటోషాప్)స్వంత ఫైల్ ఫార్మాట్ ఎక్స్ టెన్షన్ ల గురించి కొంత సమాచారం.

  • ఫోటోషాప్ స్వంత ఫైల్ పేరు.పి ఎస్ డి (.PSD) అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ అని అర్థం. .పి ఎస్ డి ఎక్స్ టెన్షన్తో నిక్షిప్తము చేయబడిన ఫైల్ తో ఒక చిత్రం లేదా ఫోటోకి చేసిన మార్పులు చేర్పులు అన్ని అంటే లేయర్ మాస్క్ (Layer mask),కలర్ స్పేసేస్ (Color spaces),ఐ సి సి ప్రోఫైల్స్ (ICC profiles),టెక్స్ట్ (Text),ఆల్ఫా చానెల్స్ (alpha channels),స్పాట్ కలర్స్ (Spot colors),క్లిప్పింగ్ పాత్స్ ( Clipping paths),డ్యూ టోన్ సెట్టింగ్స్ మొదలగు అన్ని ఆప్షన్లు మరల ఎడిటింగ్ చేసుకునే దానికి వీలుగా రక్షింపబడి ఉంటాయి.
  • ఇప్పుడు .పి ఎస్ బి (.PSB)అనే కొత్త ఫార్మాట్ ని వినియోగంలోకి తీసికువచ్చింది.దీని ఉపయోగం రెండు జిబి (GB) లకంటే పెద్ద ఫైళ్లని నిక్షిప్తం చేసుకోవటం..పి ఎస్ డి (.PSD)ని ఆధునీకరించిన కొత్త ఎక్స్ టెన్షన్ ఫైల్ ఫార్మాట్ ఇది.
  • .పి డి డి (.PDD)అంటే ఫోటో డీలక్స్ డాక్యుమెంట్ అని అర్థం.ఇది కూడా .పి ఎస్ డి ఫైల్ ఫార్మాట్ ఫీచర్లనన్నింటిని అంగీకరిస్తుంది. ఇప్పుడు ఆపివేయబడిన ఫోటో డీలక్స్ సాఫ్టువేరు ఫైల్ ఫార్మాట్ ఎక్స్ టెన్షన్ ఇది.

పరికరాలు మెన్యూ గురించి

మార్చు
టూల్స్ గురించి మరింత సమాచారన్ కోసం ఫోటోషాప్ పరికరాల పెట్టె చూడండి

అడోబీ ఫోటోషాప్ ని మొదలు పెట్టిన వెంటనే పరికరాల పెట్టె (టూల్ బాక్స్) ఫోటోషాప్ తెర మీద ఎడమ వైపున కనిపిస్తుంది. అడోబీ ఫొటోషాప్‌లో ఉన్న ఈ పరికరాల పెట్టెలో ఉన్న వనరులను ఉపయోగించి బొమ్మలపై ప్రయోగించలగ అన్ని ప్రాథమిక ఇమేజ్ ఎడిటింగ్ పనులనూ చేయవచ్చు. ఏదన్నా ప్రాథమిక టూల్ బటను మీద మీరు మౌస్ పాయింటరుని వుంచిన వెంటనే ఆ పరికరం గురించి, దాని పనితనం గురించి సంక్షిప్త సమాచారం వస్తుంది. కొన్ని పరికరాల బటన్ల కిందభాగంలో త్రికోణం ఆకారంలో ఉన్న చిన్న బాణం గుర్తు వుందంటే, ఆ పరికరం క్రింద దానికి సంబంధించిన మరికొన్ని ఉపపరికరాలు ఉన్నట్టు. (ప్రక్కన ఉన్న చిత్రం పెద్దదిగా చేసి పరిశీలించండి).

కావలిసిన కంప్యూటరు

మార్చు

  విండోస్ కంప్యూటర్ కోసం

  • ఇంటెల్ పెంటియం 4 (Intel® Pentium® 4), ఇంటెల్ సెంట్రినొ (Intel Centrino®), ఇంటెల్ జిఒన్ (Xeon®) లేక ఇంటెల్ కొర్ డ్యుఓ (IntelCore™ Duo) లేక దానికి సామానమయిన (equivalent) ప్రొసెసెర్.
  • విండోస్ ఎక్స్ పి సర్విస్ పాక్2 తొ పాటు (Microsoft® Windows® XP with Service Pack 2)లేక విండౌస్ విస్టా (Windows Vista™), హొం ప్రీమియం, బిసినెస్, అల్టిమేట్ లేదా ఎంటర్ ప్రైజ్ 32 బిట్ ఎడిషన్ కి సర్టిఫయ్ అయి వుండాలి (certified for 32-bit editions)
  • 512 ఎంబి ర్యాం (512 MB RAM)
  • 64 ఎంబి వీడియో రాం (512 MB of Video ROM)
  • హార్డ్ డిస్క్ లో ఒక జిబి ఖాళి స్థలము. గమనిక: సాఫ్టువేరు కంప్యూటర్ లోకి నింపుతున్న సమయములో మరికొంత ఖాళి స్థలము కావలసి ఉంటుంది.
  • 1024x768 మానిటర్ రిసోల్యుషన్ (1,024x768 monitor resolution)16 బిట్ వీడియో కార్డ్ తో (with 16-bit video card)
  • డీవీడీ రామ్ డ్రైవ్ (DVD-ROM drive)
  • మల్టిమీడియా ఫీచర్ల కోసం క్విక్ టైం 7 (QuickTime 7) సాఫ్టువేరు అవసరం
  • సాఫ్టువేరు అక్టివేషన్ (సాఫ్టువేరు పనిచేసేందుకు ) కోసం ఇంటర్నెట్ (Internet) లేదా ఫోన్ కనెక్షన్ (phone connection)
  • బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, అడోబీ స్టాక్ ఫొటోస్ (Adobe stock photos), ఇతర సేవలకోసం

  మ్యాకింటాష్ (Macintosh®) కంప్యూటర్ కోసం

  • పవర్ పీసీ జి4 లేక జి5 లేక మల్టికోర్ ఇంటెల్ ప్రోసెస్సర్ (PowerPC® G4 or G5 or multicore Intel processor)
  • మ్యాక్ ఓయస్ టెన్ వెర్షన్ 10.4.8 టైగెర్ -10.5 లియోపార్డ్ ఆపరేటింగ్ సిస్టం (Mac OS X v10.4.8 (Tiger) -10.5 (Leopard))
  • 512 ఎంబి ర్యాం (512 MB RAM)
  • 64 ఎంబి వీడియో ర్యాం (64 MB of Video RAM)
  • హార్డ్ డిస్క్ లో రెండు జిబీల ఖాళి స్థలము. గమనిక: సాఫ్టువేరు కంప్యూటర్ లోకి నింపుతున్న సమయములో మరికొంత ఖాళి స్థలము కావలసి ఉంటుంది.
  • 1024x768 మానిటర్ రిసోల్యుషన్ (1,024x768 monitor resolution), 16 బిట్ వీడియో కార్డ్ తో (with 16-bit video card)
  • డీవీడీ రామ్ డ్రైవ్ (DVD-ROM drive)
  • మల్టిమీడియా ఫీచర్ల కోసం క్విక్ టైం 7 (QuickTime 7) సాఫ్టువేరు అవసరం
  • సాఫ్టువేరు అక్టివేషన్ (సాఫ్టువేరు పనిచేసేందుకు) కోసం ఇంటర్నెట్ (Internet) లేదా ఫోన్ కనెక్షన్ (Phone connection)
  • బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, అడోబీ స్టాక్ ఫొటోస్ (Adobe stock photos) ఇతర సేవల కోసం

పుస్తకాలు

మార్చు
పుస్తకం పేరు వివరణ రచయిత ప్రచురించింది పేజీలు వెల (USD) ఇతర సమాచారం
Adobe Photoshop CS3 Classroom in a Book Photoshop CS3 Classroom in a Book: ఫోటోషాప్ నేర్చుకునే వారిని, తెలిసిన వారిని దృష్టిలో ఉంచుకొని ఫోటోషాప్ సియేస్ 3 పుస్తకాన్ని చాల విపులంగా ప్రామాణికంగా అడోబీ సంస్థకే చెందిన నిపుణులు వ్రాసినట్టు అడోబీ ప్రెస్ చెబుతోంది.సాఫ్టువేరు తయారు చేసింది కూడా ప్రచురణకర్తలకే చెందిన అడోబీ సిస్టమ్స్. Adobe team Adobe Press, 1 edition Pages: 496; Edition: 1st List Price:$54.99. ISBN 0-321-49202-1, ISBN 978-0-321-49202-9
Dynamic Learning: Photoshop CS3 Dynamic Learning: Photoshop CS3:Topics covered include:

What's new in Photoshop CS3 Bridge Camera Raw Making Selections Painting and Retouching Layers, Smart Objects, and Smart Filters Creating graphics for video and the Web

Jennifer Smith,Aquent Graphics Institute (AGI) oreilly, First Edition July 2007 Pages: 360; Print Book $44.99 ISBN 0-596-51061-6, ISBN 9780596510619
Photoshop CS3 Book for Digital Photographers Photoshop CS3 Book for Digital Photographers:Scott Kelby's The Adobe Photoshop CS3 Book for Digital Photographers was honored with Professional Photographer magazine's highly coveted 2008 Hot One Award. The award winners are featured in the February issue of the magazine. Scott Kelby New Riders. Pages: 496, Edition: 1st. List Price: $49.99 ISBN 0-321-50191-8, ISBN 978-0-321-50191-2
Controlling Color and Tone in Photoshop Controlling Color and Tone in Photoshop:ఫోటోషాప్ ఉపయోగించి రంగులు, చాయ లని ఎలా సరిదిద్దవచ్చో వివరించే పుస్తకం. Eddie Tapp oreilly Pages: 176,Edition: 1st Print Book $29.99 ISBN 0-596-52922-8, ISBN 9780596529222
లేయర్లు (Layers) లేయర్లు: అడోబీ ఫోటోషాప్ శక్తివంతమయిన ఫీచర్ "లేయేర్ల" గురించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శిక్షకుడు, రచయిత అయిన మాట్ క్లోస్కోవెస్కే (Matt Kloskowski)అందరికి అర్థమయ్యే రీతిలో వ్రాసిన ఈ పుస్తకం ఫోటోషాప్ నేర్చుకునే వారికి ఇప్పటికే ఈ రంగంలో ఉండేవారికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రచురణ కర్తల ఉవాచ. Matt Kloskowski Peachpit Press, 1 edition (February 22, 2008) Paperback: 288 pages $39.99. ISBN 0321534166, ISBN 978-0321534163
The Adobe Photoshop Lightroom Book ఫోటోగ్రాఫర్లని దృష్టిలో ఉంచుకొని చాల విపులంగా అన్ని ఫీచర్ల గురించి వ్రాసిన అడోబీ ఫోటోషాప్ లైట్ రూం పుస్తకాని విడుదల చేసినట్టు అడోబీ ప్రెస్చెబుతుంది. రచయిత: మార్టిన్ యీవనింగ్ సాఫ్టువేరు తయారు చేసింది కూడా ప్రచురణకర్తలకే చెందిన అడోబీ సిస్టమ్స్. Martin Evening Adobe press ;Edition: 1st. Pages: 352 $40.00 ISBN 0-321-38543-8 & ISBN 978-0-321-38543-7
Photoshop CS3 Raw ఈ పుస్తకముతో మీరు నేర్చుకునేవి
  • ముడి చిత్రాలని ఎప్పుడు చిత్రీకరించవచ్చో,కూడదో
  • అడోబీ బ్రిడ్జి సహకారంతో మీ చిత్రాలని సరిదిద్దటం, ఒక క్రమ పద్ధతిలో వుంచుకోవటం
  • స్క్రిప్టులు,ఏక్షన్ ల సహకారముతో చిత్రాలని వాటికవే సొంతంగా సరిదిద్దుకునేట్టు,నిక్షిప్తమయేట్టు చేయటం
  • చాయాలని,రంగులని ఖచ్చితమయిన రీతిలో సరిదిద్దటం నిక్షిప్తమయేట్టు చేయటం
  • ముడి చిత్రాలని ఎంతో నాణ్యమయిన చిత్రాలుగా మార్చటం
  • ముడి చిత్రాల నుండి అద్బుతమయిన నలుపు & తెలుపు (B&W)చిత్రాల తయారి
  • ముడి చిత్రాలని డి ఎన్ జి ఫైలుగా రక్షించటం,నిక్షిప్తం చేయటం.
Mikkel Aaland O’Reilly $34.99 Visit his Web site at http://www.shooting-digital.com.
The Creative Digital Darkroom ది క్రిఏటివ్ డిజిటల్ డార్క్ రూంమీ కంప్యూటర్ లో ఇమేజ్ ఎడిటర్ ని ఉపయోగించి ఫోటోలని,చిత్రాలని పెయింటింగ్ లాగ మార్చుకోవటం ఎలాగో తెలిసికోవచ్చు. Katrin Eismann,Sean Duggan August 2005 O’Reilly Media, Inc. (January 11, 2008) List Price: $49.99

Amazon Price: $31.46

ISBN 0596100477

ISBN 978-0596100476

Photoshop CS3 for Forensics Professionals Photoshop CS3 for Forensics Professionals: A Complete Digital Imaging Course for Investigators ఫోటోషాప్ ఉపయోగించి నేరాలను,నేరస్తులని తెలుసుకునే పోరేన్సిక్ నిపుణుల కోసం వ్రాయబడింది. George Reis publisher Paperback: 252 pages $37.79 & this item ships for FREE ISBN 0470114541

ISBN 978-0470114544

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Adobe in Photoshop freebie". సీఎన్ఎన్. 2007-03-01. Retrieved 2008-04-10.
  2. 2.0 2.1 Schewe, Jeff. "థామస్ మరియూ జాన్ నోల్". PhotoshopNews. Archived from the original on 2007-06-26. Retrieved 2008-04-11.
  3. Story, Derrick (2000-02-18). "చీకటిగది నుండి డెస్కుటాపు ప్రపంచానికి—ఫోటోషాప్ వెలుగు చూసిన విధానం". Story Photography. Archived from the original on 2007-06-26. Retrieved 2008-04-11.
  4. Hormby, John (2007-06-05). "అడోబీ ఫొటోషాప్ జన్మించిన విధానం". Story Photography. Archived from the original on 2007-10-11. Retrieved 2008-04-11.
  5. "డిజిటలు కేమెరాల 'రా' ఫైలు సపోర్టు". అడోబీ అధికారిక వెబ్సైటు. Archived from the original on 2008-04-12. Retrieved 2008-04-11.
  6. Reiven (alias) (2007-01-25). "ఫొటోషాప్ చరిత్ర". వెబ్ డిసైన్ లైబ్రరీ. Retrieved 2008-04-11.
  7. బిజార్న్ స్టౌస్ట్రూప్ (2007-05-25). "సీ++ ను ఉపయోగిస్తున్న సాఫ్టువేర్లు". AT&T పరిశోధనా ప్రయోగశాలలు. Retrieved 2008-04-11.