కేంద్రక భౌతికశాస్త్రం

(అణు భౌతికశాస్త్రం నుండి దారిమార్పు చెందింది)

కేంద్రక భౌతికశాస్త్రం అనేది పరమాణు కేంద్రకం, దానిలో భాగాలు, అవి ఒకదానితో ఒకటి జరిపే చర్యల గురించి వివరించే ఒక భౌతిక శాస్త్ర విభాగం. ఈ శాస్త్రం వల్ల ముఖ్యమైన ఉపయోగం అణు విద్యుత్ ఉత్పాదన. ఈ శాస్త్ర పరిశోధన వల్ల ఇంకా అణు వైద్యం, ఎం.ఆర్.ఐ స్కానింగ్, అణ్వాయుధాలు, పదార్థాల గురించి మరింత పరిశోధన సాధ్యమయ్యాయి. భౌగోళిక శాస్త్ర నిపుణులు వస్తువుల వయస్సును నిర్ధారించేందుకు వాడే రేడియోకార్బన్ డేటింగ్ కూడా అణుభౌతిక శాస్త్ర పరిశోధన ఫలమే. ఇందులో నుంచే మరల కణ భౌతికశాస్త్రం అనే ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటయ్యింది.

చరిత్ర

మార్చు
 
హన్రీ బెక్వరల్l

1896 లో హెన్రీ బెకరెల్ యురేనియం లవణాలలో ఫోటోపాస్ఫారిసెన్స్ గురించి పరిశోధన చేస్తున్నపుడు [1] పదార్థాల యొక్క రేడియో ధార్మికత కనుగొనడంతో [2] అణుకేంద్రక శాస్త్రాన్ని ఒక ప్రత్యేక విభాగంగా అధ్యయనం చేయడం ప్రారంభమైంది. ఒక సంవత్సరం తరువాత జె.జె. థామ్సన్ ఎలక్ట్రాన్లను కనుక్కోవడంతో పరమాణువు లోపల ఏదో నిర్మాణం ఉంటుందని శాస్త్రజ్ఞులు భావించారు. 20వ శతాబ్దం మొదట్లో థామ్సన్ ప్రతిపాదించిన పుచ్చకాయ నమూనా శాస్త్రజ్ఞులు ఆమోదించారు. దీని ప్రకారం పరమాణువును ఒక ధన విద్యుదావేశం గల బంతిగానూ అందులో ఎలక్ట్రాన్లు పుచ్చకాయల్లో గింజల్లాగా గుదిగుచ్చబడి ఉంటాయని ఊహించారు.

తరువాతి సంవత్సరాల్లో రేడియో ధార్మికత మీద విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. మేడం క్యూరీ, పియరీ క్యూరీ దంపతులు, రూథర్‌ఫోర్డ్, అతని బృందం ఈ పరిశోధనలు జరిపిన వారిలో ముఖ్యులు.

మూలాలు

మార్చు
  1. Henri Becquerel (1896). "Sur les radiations émises par phosphorescence". Comptes Rendus. 122: 420–421.
  2. B. R. Martin (2006). Nuclear and Particle Physics. John Wiley & Sons, Ltd. ISBN 0-470-01999-9.