అత్తగారి కథలు
అత్తగారి కథలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ వ్రాసిన పుస్తకం. భానుమతి హాస్య రచన అత్తగారి కథలు. దీనిలో అత్తగారి పాత్ర యొక్క స్వభావం, మాటలు, చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. తను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది. ఈ పుస్తకానికి గాను భానుమతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు అందుకొన్నది.
అత్తగారి కథలు | |
అత్తగారి కథలు పుస్తక ముఖచిత్రం. | |
కృతికర్త: | భానుమతి రామకృష్ణ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కథా సాహిత్యం |
ప్రచురణ: | |
విడుదల: | 1985 |
ఈ పుస్తకం పరిచయంగా AVKF book links [1] సైటులో ఇలా వ్రాశారు - "గిరీశం, కాంతం, ఎంకి, గణపతి, పార్వతీశంలలా కలకాలం నిలిచిపోయే పాత్రలలో భానుమతీ రామకృష్ణ సృష్టించిన అత్తగారు కూడా చేరతారు. ఎందుకంటే ఈ పాత్ర వాస్తవమైనదీ, జీవంతో తొణికిసలాడేదీను. ఈ కథలో అత్తగారు కోడలితో ఒద్దికగా ఉంటుంది. ఇంటిపెత్తనమంతా అత్తగారిదే. కాని ఆవిడ వఠి పూర్వకాలపు చాదస్తపు మనిషి. హాస్యం పుట్టేది ఇక్కడే"
1994లో ఈ రచనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
"అత్తగారి కథలు" ఐదు సంపుటాలుగా లభిస్తున్నాయి
- అత్తగారి కథలు - 1వ భాగం
- అత్తగారి కథలు - 2వ భాగం
- అత్తగారూ నక్సలైట్లూ
- భానుమతి కథలు - 1
- భానుమతి కథలు - 2
వీటిలో ఉన్న కొన్ని కథలు
మార్చు- మానవతా కోణంలో కొంత విషాదం ఉన్నవి - లోభి హృదయం, పతిత, జీవితంలోని అగాధాలు, శమంతకమణి-చాఱుశాస్త్రి
- మూఢాచారాలను విమర్శించేవి - మెకానిక్, ఎందుకులెండి, పెద్ద ఆకారాలు - చిన్న వికారాలు, వస్త్రాపహరణం, మరో ప్రపంచం, కోరికలు-కొరతలు, ఇరుగు పొరుగు, మావాడి లవ్ ఆఫైర్స్
- హాస్య ప్రధానమైనవి - చక్రపాణి రాజధాని, రాంగ్ నెంబర్, త్రిశంకు నరకం, వరసలు, రంభా చక్రపాణీయం, కృత్యాదవస్థ, గుభేళ్ళు, చక్రపాణి ఇంద్రలోక యాత్ర, సినిమా జీవులా-చిరంజీవులా
మొదటి భాగం కథలు
మార్చు- అత్తగారూ - ఆవకాయా
- అత్తగారూ - ఆవు నెం:23
- అత్తాతోడికోడలీయం
- అత్తగారూ - అరటికాయపొడి
- అత్తగారూ - ఆచారాలూ
- అత్తగారూ - జపానుయాత్ర
- అత్తగారూ - అచ్చుతప్పులూ
- అత్తగారూ - నరసమ్మాయణం
- అత్తగారూ - పనినాళ్లూ
- అత్తగారూ - లంకెబిందెలూ
రెండవ భాగం కథలు
మార్చు- అత్తగారూ - అష్టావధానం
- అత్తగారూ - అంతరాత్మా
- అత్తగారూ - నీళ్లబండిబసవయ్యా
- అత్తగారూ - పర్సనాలిటీ
- అత్తగారూ - కూర్మావతారం
- అత్తగారూ - నక్సలైట్లూ
- అత్తగారూ - ఫామిలీప్లానింగ్
- అత్తగారూ - ఓటూ
- అత్తగారూ - కట్టుడుపళ్లూ
- అత్తగారూ - బాల్ పాయింటూ
- అత్తగారూ - కామాక్షికథ
- అత్తగారూ - ఆవుపేడా....!
- మరో ప్రపంచం
- చక్రపాణి ఇంద్రలోక యాత్ర
- ప్రారబ్ధం శిలాతలం
- సోపులా! పెళ్ళిచూపులా!...
- సంసారం గుట్టూ వ్యాధి రట్టూ!
- అత్తగారూ - అరవసంవత్సరాదీ!
- ఫ్యామిలీ కోర్టు
ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసినది కొడవటిగంటి కుటుంబరావు. ముఖచిత్రం గీసినది బాపు
అత్తగారి స్వభావం
మార్చుఈ కథలలో రచయిత్రి చిత్రించిన అత్తగారి స్వభావం హాస్యాన్ని, పెద్దరికాన్ని, మానవతను మనకళ్ళముందు మూర్తీభవింపజేస్తుంది.
అత్తగారి పుట్టిల్లు చంగల్పట్టు, మెట్టినిల్లు రాయలసీమ, నివాసం మదరాసు. నిష్టగా ఉండే శ్రీవైష్ణవురాలు. ఆమె ఇంట్లో, ఆమె మాటకు తిరుగు లేదు. ఇంట్లోవాళ్ళూ, ఇరుగు పొరుగూ అందరూ ఆవిడ మాట జవదాటరు. ఆవిడను అమితంగా ప్రేమిస్తారు. అందరినీ ఆప్యాయంగా పలకరించడంలోనూ, ఆవకాయ పెట్టడంలోనూ, అరటిపొడి చెయ్యడంలోనూ, చాకలి పద్దులు రాయడంలోనూ ఆవిడకు ఎవరూ సాటి లేరని ఆమె విశ్వాసం. అందుకే తన తప్పును ఒక పట్టాన ఒప్పుకోదు. అసలు తప్పు అని తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ. బస్సు, వ్యాను ఒకటే అని ఆమె అభిప్రాయం. జపాన్ అంటే ఢిల్లీ దగ్గర ఉందంటుంది. "సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే" అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది. నవనాగరికురాలైన కోడలు, సత్యకాలపు అత్తగారు గురించిన రచనలలో భానుమతి సృష్టి పరాకాష్ఠ.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు, వనరులు
మార్చు- శత వసంత సాహితీ మంజీరాలులో వ్యాసం - రచయిత: మల్లాది సూరిబాబు
- శ్రీమానస ప్రచురణల వారి అత్తగారి కథలు పుస్తకం
బయటి లింకులు
మార్చు- దిగుమతి కొరకు వన్ డ్రైవ్ నుండి
- అంతర్జాలములో చదువుటకు , దిగుమతి చేసుకొనుటకు Archived 2016-03-11 at the Wayback Machine
- మాలతి, రచయిత (2010-09-26). "భానుమతి కథానికలు". తెలుగు తూలిక. Retrieved 2020-05-26.
- తెలుగు కథలు Archived 2020-06-07 at the Wayback Machine