దర్గామిట్ట కతలు

(దర్గామిట్ట కథలు నుండి దారిమార్పు చెందింది)
దర్గామిట్ట కతలు పుస్తక ముఖచిత్రం

పుస్తక పరిచయంసవరించు

దర్గామిట్ట కతలు పుస్తక రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు. ఇయన ఆంధ్రజ్యోతిలో పనిచేసాడు. మొత్తం 25 కతలున్నాయి ఈ పుస్తకంలో. ఇవన్ని 1998లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో 25 వారాలపాటు సిరియల్ గా ప్రచురింపబడినవి. ఈకతల సంకలనాన్నీ 'దర్గామిట్ట కతలు' పేరుమీద మేనెల 1999లో కావలి ప్రచురణలు ద్వారా పాఠకుల ముందుంచాడు. తిరిగి మలిముద్రణ ఫిబ్రవరి 2002లో జరిగింది. ఈ కథలన్ని నెల్లూరు యాసలో, ఉర్దూపదాలను మమేకంచేస్తూ రాసినారు. ఈ కథలన్ని ఒక ముస్లిం కుటుంబ నేపథ్యం నుండి చుట్టుపక్కలవారితో కలిసిమెలసి అల్లుకుపోయి పుట్టిన కథలు. ఉర్దూపదాలకయికతో నెల్లూరుయాసలో రాసిన ఈకతలు పాఠకున్ని నవ్విస్తాయి, గిలిగింతలు పెడతాయి. యాంత్రిక జీవనంలోపడి మరచిపోయిన చిన్ననాటి రోజులను కట్టెదట నిలుపుతాయి. ఈ కతల పుట్తిల్లు కావలిలోని 'కసాబ్ గల్లి ', 'పాతూరులోని పోలేరమ్మబండ '. ఈపుస్తకాన్ని తనతండ్రి కి.శే.ఎం.డి. కరీం గారి కంకితమిచ్చాడు. ఈ కతలను చదివి మురిసిపోయున ముళ్ళపూడి వెంకటరమణ ఖదీర్ ను వెతుక్కుంటూ ఆంధ్రజ్యోతి ఆఫిసుకెళ్లి 'ముబారక్ 'అంటూ తన ప్రశంసపత్రాన్ని ఇచ్చారు.

దర్గామిట్ట కతలెనకాల కతసవరించు

నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత. ఆయన చిత్తూరు యాసలో ప్రజలు మాట్లాడుకొనే భాషలో 'పచ్చనాకు సాక్షిగా'. సిన్నబ్బ కతలు '.'మునికన్నడి సేద్యం 'తదితర కథలురాసి వాసికెక్కిన రచయిత. మొదట్లో ఆంధ్రజ్యోతి వీక్లీ, తిరుపతిలో ఇన్‍చార్జిగా వుండేవాడు. అక్కడినుండి ఆయన హైదారాబాద్కు బదిలి అయ్యినప్పుడు, అందులో పనిచేస్తున్న ఖదీర్‍బాబుకు ఆయనతో చెలిమి కుదిరింది. నామినిగారు తన గదికొచ్చినప్పుడు, ఖదీరు తాను రాసిన రెండు కథలను ఆయన ముందుంచాడు. ఆయన అవి చదివి, ఖదీర్‍బాబుతో "..ప్రెతొక్కడూ వాళ్లమ్మ గురించి, వాళ్ళ నాయిన గురించి, చిన్నప్పుడు గురించి రాయాలబ్బా. అట్టా రాస్తేనే మనకు తెలియని జీవితాలు బయలు పడతాయి. ఆ జీవితాల్లోని బ్యూటి తెలుస్తుందన్నాడు." ఆ మాటలను ప్రేరణగా, చాలెంజ్ గా తీసుకొని రాసినవే ఈ దర్గామిట్ట కతలు. ఆ విధంగా నామిని గారు ఖదీర్‍బాబు కలంనుండి దర్గామిట్ట కతలు రావటానికి మూలహేతువైనాడు.

పుస్తకంలోని కతల సోదిసవరించు

ఈపుస్తకంలో ఇరవైఐదు కథలున్నాయి.అవి వరుస క్రమంలో.

దర్గామిట్ట కతల్లోవున్నోలెవరంటేసవరించు

ఈకతల నాయకుడు ఖదీరు వోళ్ల నాయిన 'ట్రిక్కు'లెరుగని కరెంట్ కరీంసాబ్, వోళ్లమ్మ సర్తాజ్ (యింటిపక్కొల్లకు సత్తారమ్మా, నాయినమ్మ, జరీనాంటి, జైబూన్ ఆఫా, నజీరత్త, పూలరిహానా, మాబ్బాష. ఇంతేనా?.ఎందుకులేరు..ఇస్కూల్లో హెడ్ మిసెస్సు రమాదేవి, మీసాలసుబ్బారాజయిలోరు, మాల్యాద్రయివోరు, ఇక సావాసగాళ్లయితే షమ్మీ, సతీష్‍సింగ్, నేరేళ్ళమాస్తాన్ సురేష్, మురళి.సురేష్ గాడయితే ఖాదీరుకు దేవుడే.కరీంగారి గురువు పెండంరవి, సవాసగాడు పలావెంకటరెడ్డి...వీళ్ళాంతా !మరచిపోయే మనుసులేమబ్బా?!.

ముళ్ళపూడి వారి ముబారక్సవరించు

"అచ్చుతప్పులూ అవకతవకలూ అయోమయాలూ సందేశాలూ సమస్యల పరిష్కారాలూ వున్న కథల గురించి రాయడం బలే జిల్లయిన పని.మనక్లవర్లూ చమత్కారాలూ మిరియాలూ గుప్పించి పేట్రేగిపోవచ్చు, 'వర్ధమాన 'రచయిత తల నిమిరి వెన్నుతట్టి ఎంకరేజి చేసి షయినయిపోవచ్చు.కాని-ఆ'వర్థమానుడు'అయిదడుగులు కాకుండా జైన విగ్రహంలా అరవై అడుగుల ఎత్తున నిశ్చలంగా చిరునవ్వుతో నిలబడివుంటే వాడి వెన్ను తట్టడంఎలా?ఇకరాసేదేముంది.చేసేదేముంది.చేతులుజోడించి నమస్కరించడం తప్పు.వేదంలా ప్రవహించే తెలుగు జీవనదిలో ముస్లిం జీవన స్రవంతి ఇంతకాలం అంతర్వాహినిగా-కనపడకుండా ప్రవహిస్తూవుండాలి.ఖదీర్‍బాబు-దర్గామిట్ట కతలతో భగీరథుడిలా ఆనదిని మనముందు మళ్లించాడు.ఈనదినీటిలో ప్రతిబిందువు ఒక ఆణిముత్యం.మంచుని ఎగజిమ్మే అగ్నిపర్వతం.ఇందులో నాన్నలూ అమ్మలూ అవ్వలూ తాతలూ అందరూ భూలోక దేవతలు.సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్లనూ కూడా నగలుగా వేసుకొని హుషారుగా తిరుగుతారు.పాలూ పూలూ పాపాలూ తాపాలూ అన్నీ ఒకటే.ఘోషాలో వున్నట్లుగా ఇన్నాళ్ళూ మనకి కనుపించని ఈ మనోహర జీవన చైతన్యాన్ని ఈనాడు ఆవిష్కరించిన వైతాళికుడు మహమ్మద్‍ఖదీర్‍బాబుకు నా అభినందనలు -ముళ్ళపూడి వెంకటరమణ.