అదానీ గ్రూప్ (Adani Group) గుజరాత్ రాష్ట్రము లోని అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఒక భారతీయ బహుళజాతి సంస్థ. అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ పరిశ్రమ ( ఫ్లాగ్షిప్ కంపెనీ)తో కలిసి వస్తువుల వ్యాపారంగా ( కమోడిటీ ట్రేడింగ్ ) గౌతమ్ అదానీ 1988 సంవత్సరంలో సంస్థను స్థాపించాడు. పోర్టు మేనేజ్ మెంట్, విద్యుత్ ఉత్పాదన, పంపిణీ ( ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్ మిషన్), రెన్యూవబుల్ ఎనర్జీ, గనులు (మైనింగ్), విమానాశ్రయాల నిర్వహణ (ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్)నేచురల్ గ్యాస్, ఆహార ఉత్పతుల పరిశ్రమలు (ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్) వంటి వివిధ వ్యాపారాలను సంస్థ గ్రూప్ నిర్వహిస్తోంది. అదానీ గ్రూప్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో దేశాలకు దోహదం చేసే వ్యాపార సమ్మేళనం. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న అదానీ గ్రూప్ భారత్ కేంద్రంగా తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది.[1]

అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ

అవలోకనం మార్చు

 
చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, లక్నో

అదానీ గ్రూప్ అనుబంధ ( ఫ్లాగ్షిప్ కంపెనీ) అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఎఇఎల్) విస్తృతమైన ఉత్పత్తులు,సేవలను అందించే వేగంగా అభివృద్ధి చెందుతున్న వైవిధ్యభరితమైన వ్యాపారాలలో ఒకటి. సోలార్ మాడ్యూల్, సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా , మౌలిక ( ట్రాన్స్పోర్ట్ & లాజిస్టిక్స్ ) వ్యాపారం,విమానాశ్రయాలు, నీరు ,డేటా సెంటర్లు, వంట నూనెలు, ఆహార వ్యాపారాలు వంటి రహదారుల ఉపయోగాలతో సహా మైనింగ్ & సర్వీసెస్ రిసోర్స్ లాజిస్టిక్స్ వంటి వ్యాపారాలలో కంపెనీ చేస్తున్నది. సంస్థ నేరుగా వినియోగదారుని( డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపారాలపై దృష్టిని పెంచడంతో పాటు రవాణా & మాలిక, విద్యుత్ శక్తి & యుటిలిటీ రంగాలలో కొత్త వ్యాపారాలను స్థాపించే ఇంక్యుబేటర్ గా కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఈ వ్యాపారాలే గాక ప్యాకేజ్డ్ ఆహార వంట నూనెల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు,పరిశ్రమ నిత్యావసరాల (ఒలియోకెమికల్స్ కాస్టర్ ఆయిల్ , వాటి ఉత్పత్తులు) డీ-ఆయిల్డ్ కేకులతో సహా ఉత్పత్తి లో నిమగ్నమై ఉంది.

 
బ్రావస్ రిసోర్సెస్ (అదానీ గ్రూప్) యాజమాన్యంలోని కార్మైఖేల్ బొగ్గు గని.

మార్చి 31, 2022 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 29 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. దీని 22 ప్లాంట్లు వ్యూహాత్మకంగా భారతదేశంలోని పది రాష్ట్రాల్లో ఉన్నాయి, వీటిలో 10 క్రషింగ్ యూనిట్లు, 18 రిఫైనరీలు ఉన్నాయి. 18 రిఫైనరీలలో 10 దిగుమతి చేసుకున్న ముడి వంట నూనె వాడకాన్ని సులభతరం చేయడాని, రవాణా ఖర్చులను తగ్గించడానికి పోర్టు ఆధారితవి కాగా, మిగిలినవి ముడి పదార్థాల ఉత్పత్తి స్థావరాలకు సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలలో ఉన్నాయి. ముంద్రాలోని కంపెనీ రిఫైనరీ భారతదేశంలో అతిపెద్దది (రోజుకు 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం). అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 1993 లో అదానీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ పేరుతో స్థాపించబడింది. తొలుత 1988లో భాగస్వామ్య సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ 1993లో జాయింట్ స్టాక్ కంపెనీ గా మారింది. భారతదేశంలో సోలార్ ప్యానెల్స్ పంపిణీ కోసం 2000 కి పైగా పట్టణాలతో సహా 21 రాష్ట్రాలలో తన సోలార్ రిటైల్ విస్తరించింది. సూర్యాపేట, మంచిర్యాల ప్రాజెక్టుల్లో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు మైలురాళ్లను సాధించింది. భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ (గంగా) ఎక్స్ ప్రెస్ రహదారి మార్గం పొందింది. సంస్థ గ్రీన్ హైడ్రోజన్ పెట్రోకెమికల్ డిజిటల్, రాగి వ్యాపారాలలోకి ప్రవేశించింది. భారత వైమానిక దళంతో 20 ఏళ్ల బిల్డ్ ఆపరేట్ మెయింటెనెన్స్ ఒప్పందం కింద అదంపూర్ వద్ద మిగ్ 29 సిమ్యులేటర్ కార్యకలాపాలను ప్రారంభించింది.[2]

ప్రస్తుత సమస్యలు మార్చు

.హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడే నాటికి అదానీ సంపద రూ.19.2 లక్షల కోట్లు ఉండగా, 24 ఫిబ్రవరి 2023 నాటికి రూ.7.15 లక్షల కోట్లకు పడిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే రూ.12.05 లక్షల సంపద ఆవిరి కావడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న అదానీ 29వ స్థానానికి వెళ్ళాడు.  దేశంలోని కంపెనీల సంపద పరంగా చూస్తే టాటా గ్రూప్‌, రిలయన్స్‌, రాహుల్‌ బజాజ్‌ గ్రూప్‌ తర్వాత అదానీ గ్రూప్‌ ఉన్నది. హిండెన్‌బర్గ్‌ నివేదికకు ముందు టాటా గ్రూప్‌ తర్వాత రెండో స్థానంలో అదానీ గ్రూప్‌ ఉన్నది. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పతనం కావడంతో దేశంలోని కంపెనీల మార్కెట్‌ విలువ రూ.280.4 లక్షల కోట్ల నుంచి రూ.260 లక్షల కోట్లకు పడిపోయింది. నెల రోజుల్లో మన దేశం 20.4 లక్షల మార్కెట్‌ విలువకు చేరుకున్నది. అదానీ గ్రూప్‌లో రూ.30,127 కోట్ల విలువైన షేర్లను భారత జీవిత భీమా సంస్థ ( లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పెట్టుబడి గా పెట్టడం జరిగింది. ఈ పెట్టుబడుల విలువ ఒక దశలో రూ.50 వేల కోట్లకు చేరుకోగా తాజాగా ఈ విలువ రూ.25 వేల కోట్లకు పడిపోయింది. అయితే మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ మాత్రం స్వల్పంగానే పడిపోవడం జరిగింది. అదానీ గ్రూపు షేర్లు రోజురోజుకు కుప్పకూలుతుండటంతో ఎల్‌ఐసీ సంపద కూడా నష్టం అవుతున్నది. దేశంలో బీమా రంగంలో దశాబ్దాల పాటు  ప్రజలలో ఆదరణ తో కొనసాగిన ఎల్‌ఐసీ. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పోర్ట్స్‌, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ. ఇలా మొత్తం 7 అదానీ స్టాక్‌లలో పెట్టుబడులు పెట్టింది. 2022, డిసెంబర్‌ 31 నాటికి దాని మార్కెట్‌ విలువ రూ.82,970 కోట్లు ఉండగా, ఈ నెల 23కి రూ.33,242 కోట్లకు పడిపోవడంతో జరిగిన నష్టం తాజాగా రూ.49,728 కోట్లుగా తేలింది.[3]

నిపుణల కమిటీ మార్చు

ప్రస్తుతము సంస్థ లో జరుగుతున్న నష్టాలకు ,సమస్యలను లోతుగా పరిశీలించడానికి అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ 2 మార్చి 2023 రోజున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సప్రే నేతృత్వంలో సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఓపీ భట్, కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉంటారు.[4] హిండెన్ బర్గ్ నివేదికలోని సంచలన ఆరోపణల నేపథ్యంలో అదానీ షేర్ల ధరల పతనంపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ స్వాగతించాడు. హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ ధరల పతనంపై సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజనాల కేసుగా (పిల్ ) దాఖలైన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఎం సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని గురువారం ఆదేశించింది. నిపుణుల కమిటీలో మాజీ న్యాయమూర్తి ఏఎం సప్రే, కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖరన్ సుందరన్, ఓపీ భట్, జేపీ దేవదత్ సభ్యులుగా ఉంటారు. జనవరి 25న షార్ట్ సెల్లర్ నివేదిక బహిర్గతం చేసినప్పటి నుంచి అదానీ షేర్లు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. మొత్తం నష్టం సుమారు రూ.12 లక్షల కోట్లకు చేరింది.[5]

అనుబంధ సంస్థలు మార్చు

అదానీ గ్రూప్ అనుబంద సంస్థలలో వనరులు (బొగ్గు గనులు, వాణిజ్యం), మౌళిక సదుపాయాలలో (పోర్టులు, లాజిస్టిక్స్, షిప్పింగ్, రైలు), విద్యుత్ రంగాలలో (పునరుత్పాదక ,థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ), గృహ నిర్మాణ రంగం ( రియల్ ఎస్టేట్) రవాణా సౌకర్యాలు, సోలార్ పరిశ్రమలు, రక్షణ ,కన్స్యూమర్ ఫైనాన్స్ వంటి రంగాలలో తన వ్యాపార నిర్వహణ కొనసాగిస్తున్నది.[6]

మూలాలు మార్చు

  1. "Adani Group - Crunchbase Investor Profile & Investments". Crunchbase (in ఇంగ్లీష్). Retrieved 2023-03-02.
  2. "Adani Enterprises Ltd". Business Standard India. Retrieved 2023-03-02.
  3. telugu, NT News (2023-02-27). "Adani Group | హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌.. అదానీ దెబ్బకు రోజుకు 1000 కోట్ల నష్టం." www.ntnews.com. Retrieved 2023-03-02.
  4. "Adani vs Hindenburg Highlights: All Adani Group stocks end with gains, add Rs 1 lakh crore market cap in three sessions". cnbctv18.com (in ఇంగ్లీష్). 2023-03-02. Retrieved 2023-03-02.
  5. Agarwal, Nikhil (2023-03-02). "Gautam Adani welcomes Supreme Court order, says truth will prevail". The Economic Times. ISSN 0013-0389. Retrieved 2023-03-02.
  6. R, Raveendran (2020-01-06). "Adani Group of Companies | Subsidiaries". IndianCompanies.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-02.