అదివో అల్లదివో (కీర్తన)
అదివో అల్లదివో అనేది ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన అన్నమాచార్యులు రచించారు.
ఈ కీర్తన ఖరహరప్రియ జన్యమైన మధ్యమావతి రాగం, ఆదితాళంలో గానం చేయబడుతుంది.[1]
కీర్తన
మార్చుఅదివో అల్లదివో శ్రీ హరివాసము
పదివేలు శేషుల పడగలమయము | | అదివో | |
వివరణ
మార్చుఅన్నమాచార్య శేషాచలాన్ని పదివేల పడగలు కలిగిన శ్రీహరి నివాసంగా పేర్కొంటాడు. ఇక్కడ దేవతలు, ఋషులు ఆ దేవదేవున్ని పూజించడానికి ఇష్టపడతారు. ఇతడిని కొలిచిన వారికి పరమానందాన్ని, కైవల్యాన్ని ఇచ్చే ఇష్టదైవంగా పూజిస్తాడు.
భారతీయ సంస్కృతి
మార్చు- అన్నమాచార్య నిత్య సంకీర్తనలో భాగంగా నిత్య సంతోషిణి దీనిని శాస్త్రీయంగా గానం చేశారు.[2]
- అన్నమయ్య (1997) సినిమాలో ఈ కీర్తనను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. దీనిని ఎం.ఎం.కీరవాణి స్వరపరిచారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నమయ్యగా నటించిన అక్కినేని నాగార్జున మీద ఈ కీర్తనను చిత్రీకరించారు.[3] ఈ సినిమాలో అన్నమాచార్యుడు శ్రీహరి కోసం వెతుకుతూ తిరుమల యాత్రికులతో కొండను ఎక్కుతూ పాడుతున్నట్లు చూపిస్తారు.
పూర్తి పాఠం
మార్చు- వికీసోర్స్లో అదివో అల్లదివో పూర్తి కీర్తన
మూలాలు
మార్చు- ↑ "కర్ణాటిక్ సైట్ లో అదివో అల్లదివో కీర్తన సాహిత్యం". Archived from the original on 2020-06-29. Retrieved 2011-10-24.
- ↑ నిత్య సంతోషిణి గానం చేసిన అదివో అల్లదివో కీర్తన రాగా.కాంలో వినండి.
- ↑ అదివో అల్లదివో నాగార్జున నటించిన వీడియో.