అధీర్ రంజన్ చౌదరి

అధీర్‌ రంజన్‌ చౌదరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో బెర్హంపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికై తరువాత వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికై కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పని చేసి ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా వ్యవహరిస్తున్నాడు.

అధీర్ రంజన్ చౌదరి
అధీర్ రంజన్ చౌదరి


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 జూన్ 2019
అధ్యక్షుడు రాహుల్ గాంధీ
సోనియా గాంధీ (మధ్యంతర)
ముందు మల్లికార్జున్ ఖర్గే

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 సెప్టెంబర్ 2020
అధ్యక్షుడు సోనియా గాంధీ (Interim)
ముందు సోమేంద్ర నాథ్ మిత్ర
పదవీ కాలం
11 ఫిబ్రవరి 2014 – 22 సెప్టెంబర్ 2018
ముందు ప్రదీప్ భట్టాచార్య
తరువాత సోమేంద్ర నాథ్ మిత్ర

పార్లమెంటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పిఏసి) ఛైర్మన్‌
పదవీ కాలం
26 జులై 2019 – ప్రస్తుతం
నియమించిన వారు ఓం బిర్లా

(లోక్‌సభ స్పీకర్)

ముందు మల్లికార్జున్ ఖర్గే

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 అక్టోబర్ 1999
ముందు ప్రమోధ్స్ ముఖర్జీ
నియోజకవర్గం బెర్హంపూర్

కేంద్ర రైల్వే సహాయ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి
తరువాత మనోజ్ సిన్హా
రాజేన్ గోహైన్

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1996 – 1999
ముందు శిశిర్ సర్కార్
నియోజకవర్గం నాబా గ్రామ్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-04-02) 1956 ఏప్రిల్ 2 (వయసు 68)[1]
బెర్హంపూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి
  • అర్పితా చౌధురి
    (m. invalid year; died invalid year)
  • అటాసి చట్తోపాధ్యాయ చౌధురి
    (m. 2019)
సంతానం 2
నివాసం 9, హరిబాబు లేన్
పోస్ట్ ఆఫీస్ - కాస్సిమ్ బజార్
బెర్హంపూర్ - 2
పశ్చిమ బెంగాల్ - 742102
వృత్తి సామజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ, ప్రియరంజన్ దాస్ మున్షీ తర్వాత సీనియర్ నేత. ఆయన 1996లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై, తరువాత 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముర్హీదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ నుంచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అధీర్ రంజన్ చౌదరి బెర్హంపూర్ నుంచి వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికై 2012 అక్టోబర్ 28 నుండి 2014 మే 26 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2] ఆయన 2019లో పార్లమెంటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పిఏసి) ఛైర్మన్‌గా,[3] 17వ లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా నియమితుడయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. Lok Sabha (2019). "Adhir Ranjan Chowdhury". Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
  2. Sakshi (28 August 2013). "రైలు రవాణా భారం!". Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
  3. Vaartha (9 July 2019). "పిఏసి ఛైర్మన్‌గా అధీర్‌ రంజన్‌ చౌదరి పేరు ఖరారు". Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.
  4. Sakshi (18 June 2019). "లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా అధీర్‌ చౌదరి". Archived from the original on 7 March 2022. Retrieved 7 March 2022.