అనంతం

అనంతం పుస్తక ముఖ చిత్రం

ఇదిశ్రీశ్రీ యొక్క అత్మ కథ.శ్రీశ్రీ యొక్క స్వీయ కథ.శ్రీశ్రీ యొక్క జీవిత చరిత్ర. దీన్నిమొదట విరసం తరుపున అగస్టు,1986 లో తొలిసారి ముద్రించారు.ఆ పిమ్మట శ్రీశ్రీ ప్రచురణలు సారథ్యంలో 2000,2006,2007 లో ముద్రించారు.2010 లో శ్రీశ్రీ గారి శతజయంతి సందర్భంగా శ్రీశ్రీ ప్రచురణలు సంస్థ వారు,చలసాని ప్రసాదు గారి సహకారంతో,కొన్ని చేర్పులు,మార్పులతో మలికూర్పును జనవరి 2010లో ప్రచురించారు. పుస్తకం మీది ముఖ చిత్రాన్ని శ్రీ పినిశెట్టి అందించారు (నవ్య వార పత్రిక సౌజన్యంతో)ఈ పుస్తకంలో మొత్తం 328 పుటలున్నాయి.ఈ పుస్తకం మీద శ్రీమతి సరోజ శ్రీశ్రీ, ఎస్.వి.రమణ (జూనియర్ శ్రీశ్రీ) కాపీ రైట్ హక్కులు కలిగి ఉన్నారు.వారి లిఖితపూర్వక హామీ లేనిదే ఈ పుస్తకం లోని ఏ భాగాన్ని కూడా ఉపయోగించరాదు.ఈ పుస్తక అక్షరాలంకరణను సవేరా గ్రాఫిక్స్,హైదరాబాదు వారు చేయగా, ముద్రణను శ్రీ కళాంజలి గ్రాఫిక్స్,హైదరాబాదు వారు చేసారు.ఈ పుస్తకానికి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,అబిడ్స్ వారు సోల్ డిస్ట్రిబ్యూటరులు.

శ్రీశ్రీ గారు 1910 లో,విశాఖపట్నంలో తన పుట్టుక మొదలు 1977 వరకు తనజీవిత సంఘటనలను ఇందులో పొందు పరిచారు..శ్రీశ్రీ తనజీవిత చరిత్రను ఒకేసారి కుదురుగా కూర్చోని రాయలేదు.ఇందులోని భాగాలన్ని, అప్పూడప్పూడు రాసినవి.అత్యధికంగా 1975 నుండి 1977 వరకుప్రజాతంత్రవారపత్రికలో ధారావాహికంగా రాసిన భాగాలు.కొన్ని భాగాలు స్వాతిమాస పత్రికలోనివి.మొదటి ముద్రణ సమయంలో 'ఉదయం 'దిన పత్రిక తన సహకారాన్ని అందించింది.శ్రీశ్రీ 'అనంతం'తన ఆత్మకథ కాదని,'ఆత్మచరిత్రాత్మ చారిత్రక నవల 'అని ఆయనే స్వయంగా చెప్పారు.

తన ఆత్మకథలో శ్రీశ్రీ జీవితంలో తన గురువులగురించి,కవిత్వంలో తాను చేసిన ప్రయోగాలను,సర్రియలిజంగురించి,తన నాస్తిక వాదంగురించి,విదేశ ప్రయాణాలగురించి రాసాడు.దాచుకోకుండ తనబలహీనత లను కూడా కుండబద్దలు కొట్టినట్లుగా ఇందులో ప్రస్తావించాడు.

శ్రీశ్రీ 1983,జూన్ 15 న మరణించాడు.