అనగాని భగవంతరావు

అనగాని భగవంతరావు (1923 మే 28 - జనవరి 27, 1986) ప్రముఖ న్యాయవాది, మంత్రివర్యులు.

అనగాని భగవంతరావు
జననం1923
గుంటూరు జిల్లా
చెరుకుపల్లి మండలం
అనగానివారిపాలెం
మరణంజనవరి 27, 1986
వృత్తి1955 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు
1967 - 1972: నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గం లో దేవాదాయ ధర్మాదాయ మంత్రి
1967 నుండి సహకార శాఖ మంత్రి
1974లో ఆర్థికశాఖ మంత్రి
1963 నుండి 1967 వరకు రాష్ట్ర ఖాదీ బోర్డు ఛైర్మన్
ప్రసిద్ధిప్రముఖ న్యాయవాది , మంత్రివర్యులు.
పదవి పేరుకాంగ్రెస్
తండ్రికోటయ్య
తల్లివెంకమ్మ

వీరు గుంటూరు జిల్లా లోని చెరుకుపల్లి మండలంలో అనగానివారిపాలెంలో కోటయ్య, వెంకమ్మ దంపతులకు, 1923, మే-28న జన్మించారు. గుంటూరు తర్వాత నాగపూర్ లలో విద్యాభాసం చేసి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వీరు సింగం బసవపున్నయ్య గారితో కలసి 1950లో రేపల్లెలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. 1955లో తొలిసారిగా శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. తర్వాత 1967లో, 1972 లో కూచినపూడి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభర్ధిగా విజయం సాధించారు. నీలం సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో దేవాదాయ ధర్మాదాయ మంత్రిగాను, 1967 నుండి సహకార శాఖ మంత్రిగాను, 1974లో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. 1963 నుండి 1967 వరకు రాష్ట్ర ఖాదీ బోర్డు ఛైర్మన్ గా సేవలందించారు.

రేపల్లె ప్రాంతంలో విద్యాభివృద్ధికి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసారు. వీరి సేవలకు చిహ్నంగా ఎ.బి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రేపల్లె పట్నంలో ఇప్పటికీ పనిచేస్తుంది. రాష్ట్రమంత్రిగా, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసారు. కూచినపూడి నియోజకవర్గంలోని గ్రామీణప్రాంతాలలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయాలలో ఉన్నత విలువలకు, నిరాడంబరతకు పట్టం కట్టినారు.

వీరు 1986 జనవరి 27 తేదీన పరమపదించారు.

మూలాలు మార్చు

[1] 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ 395-6. [2] ఆంధ్రజ్యోతి, దినపత్రిక/గుంటూరు; 2016, నవంబరు-25; 2వపేజీ.