అనగాని మంజుల

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు, గైనకాలజిస్టు.

అనగాని మంజుల, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు, గైనకాలజిస్టు. భారత ప్రభుత్వం నుండి 2015లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది.[1][2]

అనగాని మంజుల
2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి పద్మశ్రీ అవార్డును అందుకుంటున్న మంజుల
జననం
వృత్తిగైనకాలజిస్టు
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (2015)

జీవిత విశేషాలు

మార్చు

మంజుల ఇంజినీరింగ్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ (ఎంసెట్) లో 58వ ర్యాంక్ సాధించి, గాంధీ మెడికల్ కాలేజీలో చేరింది. పదవ తరగతిలో అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ముఖ్యమంత్రి స్కాలర్‌షిప్ కూడా అందుకుంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ లో పట్టభద్రురాలైంది. ప్రినేటల్ జెనెటిక్ మూల్యాంకనం, వంధ్యత్వం, అల్ట్రాసోనోగ్రఫీ, హిస్టెరోస్కోపీ, లాపరోస్కోపీ వంటి మినిమల్లీ ఇన్వాసివ్ విధానాలలో ఉన్నత శిక్షణను పొందింది.[3]

వృత్తిరంగం

మార్చు

మంజుల కొత్త లాపరోస్కోపిక్ పద్ధతులకు మార్గదర్శకత్వం వహించి, ప్రైమరీ అమెనోరియా, ఎండోమెట్రియల్ పునరుత్పత్తి కోసం స్టెమ్ సెల్ ప్రక్రియలు, నియోవాజినాను సృష్టించే సాంకేతికతపై కృషి చేసింది.[4] మహిళల ఆరోగ్యం గురించి ప్రచారం చేయడానికి ప్రత్యూష అనే పేరుతో ఒక ప్రభుత్వేతర సంస్థను కూడా స్థాపించింది.[4] మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్న మంజుల 2020 ఫిబ్రవరి 8న అతిథి ప్రసంగంలో పాల్గొని షీ సేఫ్ వాక్‌లో పాల్గొంది.

పురస్కారాలు

మార్చు
  1. 2015లో, భారత ప్రభుత్వం నుండి నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం అందుకుంది.[5]
  2. 2016లో, ముంబైలో జరిగిన 2016 ఇండియా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో మంజుల ఇండియన్ అఫైర్స్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకుంది.[6]
  3. 2016లో ఒకే ఆపరేషన్‌లో అత్యధిక సంఖ్యలో గర్భాశయ ఫైబ్రాయిడ్‌లను తొలగించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తించబడింది. మంజుల తన బృందంతో కలిసి ఇన్వాసివ్ తక్కువ అడ్డంగా ఉండే మినీ-లాపరోటమీ కోత ద్వారా మొత్తం 4 కిలోగ్రాముల బరువున్న 84 ఫైబ్రాయిడ్‌లను (అతిపెద్ద బరువు 1.07 కిలోగ్రాములు) తీసివేసింది.[7]

మూలాలు

మార్చు
  1. "Padma Awards 2015". pib.gov.in. Retrieved 2022-03-30.
  2. "Full list: Padma Awards 2015". News18 (in ఇంగ్లీష్). 2015-01-25. Retrieved 2022-03-30.
  3. "21 Padma Awardees of 2015 You Probably Haven't Heard Of But Definitely Should Know". The Better India (in ఇంగ్లీష్). 2015-04-09. Retrieved 2022-03-30.
  4. 4.0 4.1 Rajendra, Ranjani (2015-02-09). "No shortcuts for her". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-03-30.
  5. "Padma Awards 2015". pib.nic.in. Retrieved 2022-03-30.
  6. "Top Entrepreneurs in Business & Iconic Stars in Cinema shined at India Leadership Conclave 2016 's ILC Power Brand Awards 2016 – Indian Affairs". Retrieved 2022-03-30.
  7. "Doctor enters Guinness World Records". The Hindu (in Indian English). Special Correspondent. 2016-03-10. ISSN 0971-751X. Retrieved 2022-03-30.{{cite news}}: CS1 maint: others (link)