అనిష్ జాన్

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినిమా సౌండ్ డిజైనర్, మిక్సర్

అనీష్ జాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినిమా సౌండ్ డిజైనర్, మిక్సర్.[1] 2014లో వచ్చిన లేబర్ ఆఫ్ లవ్ అనే సినిమాకు ఉత్తమ సౌండ్ డిజైన్ (ఉత్తమ ఆడియోగ్రఫీ)[2] విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. 2017లో వచ్చిన ట్రాప్డ్ సినిమాకు 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ సౌండ్ డిజైన్ అవార్డును అందుకున్నాడు. అనిష్ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, తమిళం, మలయాళం, మరాఠీ సినిమాలకు అనేక డాక్యుమెంటరీలు, సృజనాత్మక ప్రకటనల ప్రాజెక్టులలో పనిచేశాడు.

అనిష్ జాన్
జననం
వృత్తిసినిమా సౌండ్ డిజైనర్, మిక్సర్
క్రియాశీల సంవత్సరాలు2008 - ప్రస్తుతం

జీవిత విశేషాలు

మార్చు

అనిష్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో పుట్టి పెరిగాడు. పార్క్ సర్కస్‌లోని డాన్ బాస్కో స్కూల్‌లో తన పాఠశాల విద్యను, సెయింట్ జేవియర్స్ కళాశాలలో కళాశాల విద్యను చదివాడు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఫిల్మ్ సౌండ్‌లో మూడు సంవత్సరాల కోర్సు చేసాడు.[3]

సినిమారంగం

మార్చు

గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ముంబైకి వెళ్ళి, అక్కడ వివిధ లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలకు ఎడిటింగ్ చేశాడు.[4] షిప్ ఆఫ్ థెసియస్ (టొరంటో 2012), ఐడి (2012), మిలియన్ డాలర్ ఆర్మ్ (2014), 24 (ఇండియన్ టీవీ సిరీస్ 2013) వంటి ప్రముఖ అంతర్జాతీయ సినిమా, టీవీ ప్రొడక్షన్‌లు ఉన్నాయి.

సినిమాలు

మార్చు
  • బెల్ బాటమ్ - (2021)
  • షెర్ని - (2021)
  • బుల్ బుల్ - (2020)
  • భూత్ – పార్ట్ వన్: ది హాంటెడ్ షిప్ - (2020)
  • కార్గో - (2019)
  • లాల్ కప్తాన్ - (2019)
  • ది స్కై ఈజ్ పింక్ - (2019)
  • సేక్రేడ్ గేమ్స్ (2018–19)
  • కార్వాన్ - (2018)
  • హై జాక్ (2018)
  • పరి (2018)
  • న్యూటన్ (2017)
  • ట్రాప్డ్ (2017)
  • ఎజ్రా (2017)
  • కింగ్‌డమ్ ఆఫ్ క్లే సబ్జెక్ట్స్ (2015)
  • బ్లూ మౌంటైన్స్ (2015)
  • మిలియన్ డాలర్ ఆర్మ్
  • ఆశా జావర్ మాజే (2014)
  • అజోబా (2014)
  • షిప్ ఆఫ్ థిసస్ (2013)
  • 24 (టీవీ సిరీస్)
  • లండన్, పారిస్, న్యూయార్క్ (2012)
  • వేనలోడుంగతే
  • ఐడి (2012)
  • పెడ్లర్స్ (2012)
  • ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్ (2012)
  • మిస్ లవ్లీ (2012)
  • ట్రావెలింగ్ విత్ ది ప్రోస్ (2012 - స్పోర్ట్స్ డాక్యుమెంటరీ)
  • ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్ టోల్డ్ (డాక్యుమెంటరీ, 2011)
  • ఖిచ్డీ: ది మూవీ (2010)

అవార్డులు

మార్చు
అవార్డులు[5]
సంవత్సరం అవార్డు పేరు సినిమా పేరు భాష
2014 జాతీయ చలనచిత్ర అవార్డులు రజత కమలం అవార్డు (రజత్ కమల్) ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) ఆశా జావోర్ మాఝే బెంగాలీ
2015 ఉత్తమ సౌండ్ డిజైన్ (రికార్డిస్ట్) కోసం జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఆశా జావోర్ మాఝే బెంగాలీ
2017 ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డుకు ఫిల్మ్ ఫేర్ అవార్డు ట్రాప్డ్ హిందీ
2017 ఉత్తమ సౌండ్ డిజైన్ (రికార్డిస్ట్) కోసం జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ట్రాప్డ్ హిందీ
2018 ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డు కోసం న్యూస్ 18 రీల్ మూవీ అవార్డ్స్ ట్రాప్డ్ హిందీ

మూలాలు

మార్చు
  1. "Sound engineer". Hindustan Times. Live Mint. Retrieved 2023-05-14.
  2. "National Award". Huffingtonpost. Huffingtonpost. Retrieved 2023-05-14.
  3. "Life". indianexpress.com/. The Indian Express. Retrieved 2023-05-14.
  4. "Career in Sound". Indiatoday IN Beta. Living Media Daily. Retrieved 2023-05-14.
  5. John, Anish. "6th Jagran Film Festival Awards". Indiatoday.indiatoday.in. Indiatoday Magazine (Online). Retrieved 2023-05-14.

బయటి లింకులు

మార్చు