అనేకల్ రైలు ప్రమాదం
బెంగుళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[3] ఇది బెంగుళూరు రైల్వే స్టేషను , ఎర్నాకుళం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[4] ఈ రైలు 2015 ఫిబ్రవరి 13 న 7.10 గంటలకు బెంగుళూరు నుండి ఎర్నాకుళం ప్రయాణంలో వెళ్ళుతూండగా బెంగళూర్ పట్టణంలోని కర్ణాటక పట్టణ జిల్లాలోని అనేకల్ వద్ద తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు , 150 మందికి గాయాలయినాయి.[2][5][6]
Anekal derailment | |
---|---|
వివరాలు | |
తేదీ | 13 ఫిబ్రవరి 2015 07:35 IST (UTC+05:30) |
స్థానం | అనకేల్, కర్ణాటక |
భౌగోళికాంశాలు | 12°43′05″N 77°42′39″E / 12.718072°N 77.710795°E |
దేశం | భారత దేశము |
రైలు మర్గము | బెంగళూరు సిటీ జంక్షన్ - ఎర్నాకులం జంక్షన్ |
ఆపరేటర్ | సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ |
ప్రమాద రకం | పట్టాలు తప్పింది |
కారణం | రైలుపట్టా విరిగింది[1] |
గణాంకాలు | |
మరణాలు | 10[2] |
గాయపడినవారు | 150+ |
నష్టం | ₹1.11 crore (equivalent to ₹1.4 croreమూస:INRConvert/USD EUR GBP in 2020)[1] |
ప్రమాదం
మార్చుభారతీయ రైల్వేలు ఆధ్వర్యంలో నడుపుతున్న బెంగుళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12677) యొక్క తొమ్మిది బోగీలు, గం.7:35 ని.ల స్థానిక సమయంలో, మూలగొండపల్లి, చంద్రాపురం సమీపంలోని బిదారేగేర్ ప్రాంతంలో అనేకల్ సమీపంలో పట్టాలు తప్పాయి.[7] ఈ ప్రమాదం ఒక ఇరుకైన రైలుమార్గంలో జరిగింది. ప్రయాణీకులు 3 నుండి 5 సెకన్లలో ఈ ప్రమాదం విషయం తెలుసుకున్నారు, వారు ప్రయాణిస్తున్న రైలు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నదని భావించారు. ఆ తరువాత రైలు ఒక పెద్ద క్రాష్‌తో ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ఆగిపోవడం గమనించారు.[6] రైలు డి9 భోగీ (కంపార్ట్మెంట్) డి8 లోకి చొచ్చుకు పోయింది, డి8 (కంపార్ట్‌మెంట్) బోగీ మొదటి 4 వరుస సీట్లను తుత్తినియలు (ధ్వసం) చేసింది. చాలామంది ప్రయాణికులు డి8 భోగీలో చిక్కుకుపోయారు, కొందరు మరణించారు.[5]
రెస్క్యూ , పునరుద్ధరణ
మార్చురైలు ప్రమాదం ప్రత్యక్షంగా చూసిన వారి దగ్గర నుండి కర్ణాటక పోలీసులు, అగ్నిమాపక విభాగాలు వారికి డజన్ల కొద్దీ ఫోన్ కాల్స్ వెళ్ళాయి. కర్ణాటక అగ్నిమాపక విభాగం, స్వచ్ఛంద రెస్క్యూ కార్మికులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి నిమిషాల్లోనే వచ్చారు , భోగీల (కోచ్‌ల) నుండి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడేందుకు బయటకు లాగడం ప్రారంభించారు.
ఇన్వెస్టిగేషన్
మార్చురైలు ప్రమాదం జరగడానికి కారణం ఈ రైలు ప్రయాణించే మార్గము లోని రైలు పట్టాలపై ఆ సమయంలో కంకర లేదని ఈ నివేదిక పేర్కొంది. ఈ ప్రమాదం రైల్వే ఇంజనీర్లు (ట్రాక్ పర్యవేక్షకులు) వలన జరిగిందని, వీరు ఇంతకు ముందు అక్కడ విరిగిన రైలుపట్టా చోటుచేసుకున్న ప్రాంతంల్లో వేగం పరిమితిని ఎత్తివేసేందుకు అనుమతించారని, అందువల్ల ప్రమాదం జరిగిందని రాబోయే ప్రాథమిక నివేదిక కోసం ఒక (ప్రారంభ) ముందస్తు ప్రెస్ రిపోర్ట్ లో పేర్కొంది.[8]
ఈ రైలు ప్రమాదం రైలుపట్టా విరగడం వలన జరిగిందని, రైల్వే భద్రత కమిషనర్ ద్వారా 2015 మార్చి 17 సం.లో ఒక ప్రాథమిక నివేదిక జారీ చేయబడింది. ఒక రైల్వే ట్రాక్ కార్మికుడు ప్రమాదం జరగడానికి ఒక అరగంట ముందు రోజువారీ తనిఖీలో భాగంగా, రైలు మార్గము పరీక్ష చేయడం జరిగిందని , రైలుమార్గములో స్పష్టమైన లోపాలు లేదా కంకర లేకపోవడం లోపం అనేది అతనికి కనిపించలేదు. ఈ ప్రమాదం వలన ₹ 1.11 కోట్ల వరకు రైల్వేకు నష్టం వాటిల్లిందని భారతీయ రైల్వేలు నమోదు చేసింది. [1]
జనవరి 2016 సం.లో ఒక వార్తా నివేదిక ప్రకారం, నవంబరు 2015 నాటికి రైలు భద్రతా కమిషనర్ (సిఆర్ఎస్) సతీష్ కుమార్ మిట్టల్ రైల్వే బోర్డుకు తుది నివేదిక పంపారని రైల్వేలకు చెందిన ఒక అధికారి పేర్కొన్నారు. ఆ నివేదిక ఇంకా ఆ సమయంలో బహిరంగంగా లేదు కాబట్టి, లోకో-పైలట్ (రైలు డ్రైవర్) , ప్రయాణీకుల కోచ్‌లను నిర్వహిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ మీద , అపరాధభావంతో సీనియర్ విభాగం ఇంజనీరు పైన ప్రధానంగా నింద ఉంచడం జరిగింది.[9]
తుది నివేదిక ప్రకారం ప్రమాద సమయంలో ఈ రైలు గంటకు కనీసం 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) వేగంతోను , గంటకు 100 కిలోమీటర్ల (62 మైళ్ళు) స్పీడ్ పరిమితి కంటే తక్కువగా, ప్రయాణం చేస్తోందని పేర్కొంది. ఈ నివేదికలో కేవలం 42 మందికి గాయాలయినట్లు , 9 మంది మరణించినట్లు పేర్కొన బడింది.[9]
ఈ రైలు ప్రమాదం జరగడానికి ముఖ్యంగా సెక్షన్ ఇంజినీర్ దోషం అధికమని అభియోగం మోపబడింది, ఎందుకంటే ఈ రైలు ప్రమాదం జరిగిన చోటు నుండి కొన్ని అడుగులు దూరంలోనే మరొక రైలు పగుళ్లను మరమ్మతు చేశారు, అతను ట్రాక్ విభాగంలో పూర్తి వేగంతో రైలు వేగవంతంగా నడిచేందుకు అనుమతి ఇచ్చాడు. మొదటి పగులు, మరమ్మత్తు ప్రమాదం ముందు రోజు పూర్తి చేయడం జరిగింది. సెక్షన్ ఇంజనీర్ రైలుపట్టా మరమ్మత్తు తర్వాత 24 గంటల సమయం లోపలనే ట్రాక్ విభాగంలో అతను పూర్తిస్థాయి వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతినిచ్చాడు. అందువలన సెక్షన్ ఇంజినీర్, తప్పిదము అధికమని భావించారు.[9]
అదేవిధముగా, భోగీలు అడుగుభాగం తుప్పుపట్టి, బలహీనపడే అవకాశం ఉండే విధంగా మారడానికి కారణమని, ఇది ప్రమాద తీవ్రతకు దోహదపడింది కాబట్టి, కోచ్‌లు తయారు చేసిన 'కోచ్ ఫ్యాక్టరీ మీద కూడా తప్పిదములో భాగం ఉందని ఆరోపించబడింది. అలాగే సంఘటన జరిగినందుకు వేగంగా తదుపరి ప్రతిచర్యలు సరయిన సమయంలో ఉండకపోవడం వలన లోకో-పైలట్ మీద కూడా ఆరోపించారు.[9] ఈ ప్రమాదానికి నిందితుడిగా బాధ్యుడిని చేయడం మీద, లోకో-పైలట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం అయినటువంటి ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ , తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రమాద సమయంలో, రైలును గంటకు 63 కి.మీ. వేగంతో , పరిమితి కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నదని పరిగణిస్తున్నందున, డ్రైవర్ సంఘటనకు ఎలాంటి బాధ్యత వహించనవసరం లేదని అసోసియేషన్ వారు తెలియజేసారు. అలాగే రైలుమార్గములోని ట్రాక్ పైన కంకర వలన ప్రమాదం జరగలేదని కూడా వారు తెలిపారు.[10]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Broken Rail Caused Anekal Accident, Says Probe Report". The New Indian Express. Express Network Private Limited. Express News Service. 18 March 2015. Archived from the original on 7 May 2015. Retrieved 14 June 2016.
- ↑ 2.0 2.1 "10 dead, over 150 injured as Ernakulam-bound Inter City Express derails near Bengaluru". Yahoo India. No. 13 February 2015. Yahoo India. PTI. 13 February 2015. Retrieved 13 February 2015.
- ↑ http://indiarailinfo.com/train/bengaluru-city-ernakulam-intercity-express-12677-sbc-to-ers/709/136/52
- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ 5.0 5.1 "5 feared dead as Bengaluru-Ernakulam train derails". The Hindu. No. 13 February 2015. The Hindu. 13 February 2015. Retrieved 13 February 2015.
- ↑ 6.0 6.1 "2 Killed, Several Injured as Train Derails Near Tamil Nadu's Hosur". NDTV Convergence Limited. No. 13 February 2015. NDTV Convergence Limited. Press Trust of India. 13 February 2015. Retrieved 13 February 2015.
- ↑ Google map[permanent dead link]
- ↑ "Engineers' negligence blamed for B'luru-Ernakulam train accident". Deccan Herald. The Printers (Mysore) Private Ltd. DHNS. 8 March 2015. Archived from the original on 10 July 2015. Retrieved 14 June 2016.
- ↑ 9.0 9.1 9.2 9.3 Lalitha, S (14 January 2016). "Engineer, Coach Factory, Driver Chargesheeted for Anekal Train Mishap". The New Indian Express. Express Network Private Limited. Archived from the original on 14 June 2016. Retrieved 14 June 2016.
- ↑ "Loco pilots reject rly report on Anekal train accident". Deccan Herald. The Printers (Mysore) Private Ltd. 14 January 2016. Archived from the original on 14 June 2016. Retrieved 14 June 2016.
బయటి లింకులు
మార్చు- 1990 - ప్రధాన భారతీయ రైలు ప్రమాదాలు క్రోనాలజీ - టైమ్స్ ఆఫ్ ఇండియా
- "Major Railway Accidents in India, 2000-09" by Ajai Banerji, ISBN 978-1-257-84773-0 and ISBN 978-81-921876-0-0