అన్షు తెలుగు చలనచిత్ర నటీమణి. మన్మధుడు సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన అన్షు రాఘవేంద్ర, మిస్సమ్మ వంటి చిత్రాలలో నటించింది.

అన్షు
Anshu.jpg
జననంఅన్షు
లండన్
నివాసంలండన్
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2002 – 2005
మతంహిందూ
బంధువులుసచిన్ (భర్త)

జననంసవరించు

అన్షు లండన్ లో జన్మించింది. తల్లిదండ్రుల సొంత ఊరు ఢిల్లీ. ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.

సినీరంగ ప్రస్థానంసవరించు

సినిమా చాయగ్రహుడు కబీర్ లాల్ అన్షుకు కుటుంబ మిత్రుడు. నటనలో అసక్తి ఉన్న అన్షు ఫోటోలను కొన్నిటిని విజయ భాస్కర్ గారికి చూపించడం జరిగింది. అలా మన్మధుడు సినిమా ఎంపికైంది. ఆ తరువాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ పాత్రను, మిస్సమ్మ సినిమాలో అతిధి పాత్రలో నటించింది. కొన్ని కన్నడ చిత్రాలలో కూడా నటించింది.

వివాహం - పిల్లలుసవరించు

లండన్ లోని నివసిస్తున్న సచిన్ అనే వ్యక్తిని అన్షు పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప.[1]

నటించిన చిత్రాల జాబితాసవరించు

నటిగాసవరించు

  1. పత్తర్ దిల్ (బాలనటి) - 1985
  2. మన్మధుడు - 2002
  3. రాఘవేంద్ర - 2002[2]
  4. మిస్సమ్మ - 2003
  5. సిటీ ఆఫ్ గాడ్ - ముంబై 1982: ఎక్ ఆంకహీ కహానీ - 2010
  6. బేవాజా - 2017

కాస్ట్యూమ్ డిజైనర్ గాసవరించు

  1. ఓం జై జగదీష్ - 2002
  2. ఉష్క్ విష్క్ - 2003

మూలాలుసవరించు

  1. తెలుగు న్యూస్ స్టాంప్. "నాగ్ తో మన్మధుడు సినిమా చేసిన అన్షు గుర్తుందా? ఇప్పుడెలా ఉందో తెలుసా?". telugu.newsstamp.com. Retrieved 19 May 2017.[permanent dead link]
  2. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". మూలం నుండి 5 January 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 5 January 2020. Cite news requires |newspaper= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=అన్షు&oldid=2820854" నుండి వెలికితీశారు