మన్మథుడు (సినిమా)

2012 సినిమా

మన్మథుడు 2002 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, సోనాలి బెంద్రే ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఆడవాళ్ళంటే ఇష్టం లేని కథా నాయకుడు అలా ఎందుకు మారాడు తిరిగి అతను ఎలా మారాడు అనేది ఈ చిత్ర కథాంశం.[1]

మన్మథుడు
దర్శకత్వంకె. విజయ భాస్కర్
స్క్రీన్ ప్లేకె. విజయ భాస్కర్
కథత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంఅక్కినేని నాగార్జున,
సోనాలి బెంద్రే,
, చంద్రమోహన్,
సునీల్,
తనికెళ్ళ భరణి,
బ్రహ్మానందం,
సుధ,
బాలయ్య,
అన్షు,
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు


2002 వ సంవత్సరానికి ఉత్తమ ప్రధమ చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకుంది

కథ సవరించు

అభిరాం ప్రకటనలు తయారుచేసే సంస్థను నిర్వహిస్తూ ఉంటాడు. ఆడజాతి మొత్తం మోసపూరితమైనది అని అసహ్యించుకొంటూ ఉంటాడు. ఆ సంస్థ అధినేత అయిన తన బాబాయ్ ప్రసాద్ సహ నిర్వాహాకురాలిగా హారిక ని నియమిస్తాడు. స్త్రీ ద్వేషి అయిన అభి హారికని ముప్పు తిప్పలు పెడతాడు. విసిగి పోయిన హారిక రాజీనామా చేస్తుంది. ప్రసాద్ అభి గతాన్ని వివరిస్తాడు. తను ప్రేమించిన మహేశ్వరి అనే అమ్మాయి తాను నడిపిన కారునడుపుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని తెలిస్తే తట్టుకోలేడని తన కుటుంబ సభ్యులు ఆమె వేరే పెళ్ళి చేసుకొందని అబద్ధం చెప్పటంతో అభి స్త్రీ ద్వేషిగా మారతాడు. నిజం తెలిసిన అభి ఎలా స్పందించాడు? హారిక ఏమయ్యిందన్నదే తర్వాతి కథ.

పాత్రలు-పాత్రధారులు సవరించు

నటి / నటుడు ధరించిన పాత్ర
అక్కినేని నాగార్జున అభిరాం
సోనాలి బెంద్రే హారిక
అన్షు మహేశ్వరి
చంద్రమోహన్ మహేశ్వరి మామయ్య
తనికెళ్ళ భరణి ప్రసాద్
బ్రహ్మానందం లవంగం
మన్నవ బాలయ్య అభిరాం తాతయ్య
అన్షు[2] మహేశ్వరి
సునీల్ బంకు శీను
అనంత్ సుబ్బారావు
రంగనాథ్ హారిక తండ్రి
సుధ లక్ష్మి, ప్రసాద్ భార్య
ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రొఫెసర్ బాలసుబ్రమణ్యం
మెల్కోటే సుందర్
మాస్టర్ తనీష్ హారిక తమ్ముడు
స్వప్న మాధురి ఆఫీసులో పనిచేసే అమ్మాయి

నిర్మాణం సవరించు

2000 సంవత్సరంలో వచ్చిన నువ్వు వస్తావని తో మంచి విజయం అందుకున్నాడు నాగార్జున. తర్వాత ఆయన క్యామియో పాత్ర పోషించిన నిన్నే ప్రేమిస్తా కూడా బాగానే ఆడింది. తర్వాత వచ్చిన ఆజాద్, ఎదురులేని మనిషి, బావ నచ్చాడు, అధిపతి, ఆకాశవీధిలో, స్నేహమంటే ఇదేరా లాంటి సినిమాలు నిరాశపరిచాయి. ఆ సమయంలో దర్శకుడు కె. విజయభాస్కర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మన్మథుడు కథతో ఆయన్ను కలిశారు. తొలుత తను ప్రేమించిన అమ్మాయితో ప్రేమ కొన్ని అపార్థాల వల్ల విఫలం కావడంతో అమ్మాయిల మీద ద్వేషం పెంచుకున్న వ్యక్తి రెండవసారి ప్రేమించిన అమ్మాయి ఎలా మార్చుకుంది అనే కథాంశం వినిపించారు. వినడానికి సీరియస్ గా ఉన్న ఈ కథాంశాన్ని కొన్ని వినోదభరిత అంశాలతో సరదాగా చెప్పాడు త్రివిక్రం. నాగార్జున మొదట్లో సందేహించినా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అంతేకాకుండా తన స్వంత బ్యానర్ అయిన అన్నపూర్ణ పిక్చర్స్ పతాకం మీదనే నిర్మించేందుకు సిద్ధపడ్డాడు.

సోనాలి బెంద్రే ప్రధాన కథానాయికగా, రెండో కథానాయికగా కొత్త అమ్మాయి అన్షును పరిచయం చేశారు.[3]

ఈ చిత్రంలోని సంభాషణలు సవరించు

  • నువ్వు చూస్తున్న అభి అభి కాదమ్మా, వాడు వేరు, వాడి ప్రేమ ఒక సముద్రం, వాడి జాలి ఒక వర్షం, వాడి కోపమొక ప్రళయం
  • నాగ్: ముందు మీరావిడని ప్రేమించారా? లేక ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా?
    • బ్రహ్మీ: ముందు తను నన్ను ప్రేమించింది... తర్వాత నేను తనని ప్రేమించాల్సి వచ్చింది.

విశేషాలు సవరించు

  • ఈ చిత్రంలో నాగ్ వేసిన షార్ట్ కుర్తాలు, మన్మథుడు షర్ట్ లుగా పేరొందాయి.
  • 83 రోజుల ప్రదర్శనలో ఈ సినిమా 13.5 కోట్లు వసూలు చేసింది. [1]
  • మెల్ గిబ్సన్ సినిమా What women want లోని చాలా సన్నివేశాలు ఈ సినిమాలో అనుకరింపబడినాయి - ఆఫీసులో ఒకమ్మాయిని ఆత్మహత్యనుండి కాపాడడం, ఇతరుల సంభాషణలను వినడం (మనసులో మాట తెలుసుకోవడం), ఇంటివద్ద హీరో లిప్‌స్టిక్ ను వాడడానికి ప్రయత్నించడం.
  • ఇందులో అభి (నాగ్) వాడిన ఎర్రని స్పోర్ట్స్ కారు 1992 Nissan 300sx.

పాటలు సవరించు

  1. అందమైన భామలు, లేత మెరుపు తీగలు - దేవిశ్రీ ప్రసాద్ - రచన: భువనచంద్ర
  2. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుగుస్తుంది - వేణు, సుమంగళి - రచన: సిరివెన్నెల
  3. చెలియ చెలియా - షాన్ - రచన: సిరివెన్నెల
  4. డోన్ట్ మ్యారీ బి హ్యాపీ - బాలు - రచన: సిరివెన్నెల
  5. నా మనసునే వీడకే చైత్రమా - బాలు, చిత్ర - రచన: సిరివెన్నెల
  6. నేను నేనుగా లేనే - గానం: ఎస్ పి చరణ్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

మూలాలు సవరించు

  1. "'మన్మథుడు'కి పదిహేడేళ్లు". సితార. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-14.
  2. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  3. "మాయ చేసిన మాటల మన్మథుడు - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-12-20. Retrieved 2020-12-22.
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.