అపరశక్తి ఖురానా

అపరశక్తి ఖురానా (జననం 1987 నవంబరు 18) ఒక భారతీయ నటుడు, రేడియో జాకీ, హాస్యనటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, టెలివిజన్ హోస్ట్. అంతేకాకుండా, ఆయన హర్యానా U-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన మాజీ భారతీయ క్రికెటర్.[1] ఆయన నటుడు ఆయుష్మాన్ ఖురానాకు తమ్ముడు.[2]

అపరశక్తి ఖురానా
2018లో అపరశక్తి ఖురానా
జననం (1987-11-18) 1987 నవంబరు 18 (వయసు 37)
వృత్తి
  • నటుడు
  • టెలివిజన్ హోస్ట్
  • రేడియో జాకీ
  • హాస్యనటుడు
  • గాయకుడు
  • సంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అకృతి అహుజా ఖురానా
(m. 2014)
పిల్లలు1
బంధువులుఆయుష్మాన్ ఖురానా (సోదరుడు)

అపరశక్తి ఖురానా మొట్టమొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ స్పోర్ట్స్ బయోపిక్ దంగల్ (2016). ఇది అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. అతనికి అనేక ప్రశంసలను సంపాదించిపెట్టింది. అతను తదనంతరం బద్రీనాథ్ కి దుల్హనియా (2017), స్త్రీ (2018), లుకా చుప్పి (2019), పతి పత్నీ ఔర్ వో (2019) వంటి అనేక ఇతర వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు. 2021లో, అతను సోలో లీడ్‌గా తన మొదటి చిత్రం హెల్మెట్‌లో నటించాడు.

ప్రారంభ జీవితం

మార్చు

ఆయన 1987 నవంబరు 18న చండీగఢ్‌లో జన్మించాడు. అతని తండ్రి పి. ఖురానా జ్యోతిష్యుడు, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన రచయిత, అయితే అతని తల్లి పూనమ్ సగం బర్మీస్ సంతతికి చెందిన గృహిణి.

చండీగఢ్‌లో పాఠశాల విద్య, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ ఆయన పూర్తి చేశాడు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలలో చురుకుగా ఉండే ఆయన హర్యానా U-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా అయ్యాడు. అతను ఢిల్లీలోని ఐఐఎంసి నుండి మాస్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

అతను 2014 సెప్టెంబరు 7న వ్యాపారవేత్త, ఐఎస్బీ గ్రాడ్యుయేట్ అయిన ఆకృతి అహుజాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2021న ఆగస్టు 27న అర్జోయ్ ఎ ఖురానా అనే పాప జన్మించింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం టైటిల్ పాత్ర మూలాలు
2016 దంగల్ ఓంకార్ సింగ్ ఫోగట్ [3]
సాత్ ఉచక్కీ ఖప్పే [4]
2017 బద్రీనాథ్ కీ దుల్హనియా భూషణ్ మిశ్రా [5]
2018 హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ అమన్ సింగ్ వాధ్వా [6]
స్త్రీ బిట్టు [7]
రాజ్మా చావల్ బల్జీత్ [8]
2019 లుకా చుప్పి అబ్బాస్ షేక్ [9]
జబరియా జోడి సంతోష్ పాఠక్ [10]
కాన్పురియే జైతాన్ మిశ్రా [11]
బాలా అర్జున్ సింగ్ [12]
పతి పత్నీ ఔర్ వో ఫాహిమ్ రిజ్వీ [13]
2020 స్ట్రీట్ డ్యాన్సర్ 3డి అమరీందర్ [14]
2021 హెల్మెట్ లక్కీ [15]
హమ్ దో హమారే దో సందీప్ "షంటీ" సచ్‌దేవా [16]
2022 ధోఖా: రౌండ్ డి కార్నర్ హక్ రియాజ్ గుల్ [17]
భేదియా బిట్టు [17]

మూలాలు

మార్చు
  1. "Aparshakti Khurrana Biography". IMDb. Retrieved 26 January 2017.
  2. "Ayushmann Khurrana's younger brother to make Bollywood debut with negative character". Daily News and Analysis. Retrieved 26 January 2017.
  3. "Aparshakti Khurana: People don't remember me from Dangal". www.mid-day.com (in ఇంగ్లీష్). 4 September 2018. Retrieved 15 October 2021.
  4. "Aparshakti Khurana's journey from the court to courting movies". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 7 March 2022.
  5. "Aparshakti Khurrana to Feature in Badrinath Ki Dulhania". News18 (in ఇంగ్లీష్). 22 February 2017. Retrieved 15 October 2021.
  6. "Happy Phirr Bhag Jayegi movie: Review, Cast, Director". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 15 October 2021.
  7. "Aparshakti Khurana on saying yes to Stree: I really wanted to work with Rajkummar Rao, that was the first kick". Hindustan Times (in ఇంగ్లీష్). 2 September 2018. Retrieved 15 October 2021.
  8. Rajma Chawal comedy (in ఇంగ్లీష్), retrieved 15 October 2021
  9. "Aparshakti Khurana roped in for Kriti Sanon's 'Luka Chuppi' even before release of 'Stree' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 15 October 2021.
  10. "Here's how Parineeti Chopra and Aparshakti Khurana prepping up for their next 'Jabariya Jodi' - Photos of Bollywood celebs from the film sets". The Times of India. Retrieved 15 October 2021.
  11. "Kanpuriye to release on Hotstar on Oct 25". Business Standard India (in ఇంగ్లీష్). Press Trust of India. 23 October 2019. Retrieved 15 October 2021.
  12. "Aparshakti Khurana: I don't think an actor in my space has a lot of choices to make". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 9 April 2021. Retrieved 7 March 2022.
  13. "Aparshakti Khurana on Pati, Patni Aur Woh: Kartik and I share a great chemistry on screen". The Indian Express (in ఇంగ్లీష్). 20 July 2019. Retrieved 15 October 2021.
  14. "Street Dancer posters: Varun Dhawan and Shraddha Kapoor ready for dance battle". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 5 February 2019. Retrieved 15 October 2021.
  15. "'Helmet' will always be close to my heart: Aparshakti Khurana". Zee News (in ఇంగ్లీష్). 24 September 2021. Retrieved 15 October 2021.
  16. "Kriti Sanon introduces her entire Hum Do Hamare Do family with new poster". India Today (in ఇంగ్లీష్). Retrieved 15 October 2021.
  17. 17.0 17.1 "R Madhavan, Khushalii Kumar, and Aparshakti Khurana wrap up the shoot of the film Dhokha". Bollywood Hungama (in Indian English). 16 November 2021. Retrieved 16 November 2021.