అబలా సచ్చరిత్ర రత్నమాల

తెలుగు పుస్తకము

అబలా సచ్చరిత్ర రత్నమాల భండారు అచ్చమాంబ రచించిన గ్రంథం. ఇది మూడు భాగాలుగా ముద్రించబడినది. మొదటి భాగాన్ని కొమర్రాజు వినాయకరావు అభ్యుదయ ప్రెస్, విజయవాడ ద్వారా 1935 సంవత్సరంలో ప్రచురించారు.

అబలా సచ్చరిత్ర రత్నమాల
కృతికర్త: భండారు అచ్చమాంబ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: కొమర్రాజు వినాయకరావు
విడుదల: 1935

స్త్రీలు బలహీనులు, శౌర్యహీనులు కాదని వారిలో ఎందరో వీరనారులు, పవిత్ర చరితులు, జ్ఞాన సంపన్నులు ఉన్నారని నిరూపించేందుకు, స్త్రీ విద్య నాశనహేతువు కాక దేశోపకారణం కాగలదనీ నిరూపించేందుకు ఈ గ్రంథం రచించానని రచయిత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో భారతదేశంలోని పలువురు వీరనారుల సంగ్రహ జీవిత గాథలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు. తెలుగులో తొలి కథ రాసిన గౌరవం పరిశోధనల వల్ల ఇటీవల బండారు అచ్చమాంబకే దక్కుతోంది. ఆమె తెలుగు వైతాళికుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సోదరి కాగా లక్ష్మణరావు ఆమెను రచనరంగంలో బాగా ప్రోత్సహించారు. ఈ సంపుటంలో ప్రాచీన భారతీయ స్త్రీల నుంచి ఆధునిక కాలానికి చెందిన స్త్రీల జీవిత గాథలు ఉన్నాయి. రాణీ సంయుక్త జీవితగాథతో మొదలుపెట్టి 34మంది జీవితచిత్రణలు చేశారు.

విషయసూచిక

మార్చు

మొదటి సంపుటము

మార్చు

ద్వితీయ సంపుటము

మార్చు
  • రాణీ సంయుక్త
  • ఉమాబాయి ధాభాడే
  • ఆర్గళి సంస్థానాధీశ్వరి
  • జగన్మోహిని
  • కొమఱ్ఱాజు జోగమాంబ
  • పద్మిని
  • కృపాబాయి
  • మొల్ల
  • --- భార్య
  • తఱిగొండ వెంగమాంబ
  • మీరాబాయి
  • అవడాబాయి
  • రుద్రమదేవి
  • డాక్టరు ఆనందబాయి జోశి
  • మహారాణీ ఝాశీ లక్ష్మీబాయి
  • విమలదేవి
  • లీలావతి
  • సత్యవతి
  • మహారాణి త్రిపురసుందరి
  • సావిత్రీబాయి .........
  • వాక్పుష్టా
  • రాణి ఔస్కువరు
  • రాణీసాహేబ్ కువరు
  • కమలాదేవి
  • తారాబాయి
  • గనోరు సంస్థానపు రాణి
  • బసవేశ్వరి
  • జోధపురపు రాణి
  • విమల
  • పద్మావతి
  • కృష్ణాకుమారి
  • మైసలదేవి
  • రఖమాబాయి కిలే
  • నాచి
  • సరసవాణి
  • చాందబీబీ
  • ధనలక్ష్మి
  • విద్వత్కులుంబము
  • మహారాణి స్వవిషయి
  • నవలతాదేవి
  • గనపాంబ

బయటి లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: