అబిద్ హసన్ సఫ్రాని

భారతీయ రాయబారి

జైహింద్ అనే నినాదం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎంత గానో ఉత్తేజపరిచింది. ఈ నినాదాన్ని మొదటగా మేజర్ అబిద్ హసన్ సఫ్రాని గారు నినదించారు.[1] ఈయన హైదరాబాదుకు చెందినవ్యక్తి.

మేజర్ అబిద్ హసన్ సఫ్రాని
అబిద్ హసన్ సఫ్రాని
జననం
అబిద్ హసన్ సఫ్రాని

(1911-04-11)1911 ఏప్రిల్ 11
మరణం1984 ఏప్రిల్ 5(1984-04-05) (వయసు 72)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
విద్యఇంజనీరింగ్
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు
తల్లిదండ్రులుతల్లి ఫక్రున్నీసా బేగం
పురస్కారాలుసాధించిన పురస్కారాలు

బాల్యం - కుటుంబం మార్చు

అబిద్ హసన్ హైదరాబాద్ నగరంలో ఒక ఉన్నత కుటుంబంలో 1912వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తల్లి ఫక్రున్నీసా బేగం. ఆమెకు సరోజినీ నాయుడు సాంగత్యంలో దేశభక్తికై ఉద్యమించడం అలవాటు ఐంది. విదేశి వస్త్రాలను పరశురామ ప్రీతి చేసిన హైదరాబాద్ మొదటి మహిళగా నాయకుల, ప్రజల గౌరవం ఆమె పొందగలిగింది. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఆజాద్ మొదలైన అగ్రనాయకులు ఆమెను 'అమ్మా జాన్' అని పిలిచేవారు. ఆమె ముగ్గురు కుమారులూ ఉన్నత విద్యావంతులే. దేశభక్తులే. నగరంలోని మతశక్తుల నుండి తప్పించుకోవడంలో వారెన్నో అపాయాలకు గురైనారు. సోదరులలో జ్యేష్టుడైన బద్రుల్ హసన్ 1925 సంవత్సరంలో గాంధీజీ నడిపిన 'యంగ్ ఇండియా' పత్రికను ఎడిట్ చేశారు.

అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో అబిద్ హసన్ చదివాడు.

చదువు మార్చు

కేంబ్రిడ్జ్ సీనియరు పరీక్షలో ఉత్తీర్ణుడైన అబిద్ హసన్ 1931లో సబర్మతి ఆశ్రమం చేరుకొని దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. సఫ్రాని అప్పటి స్వాతంత్ర్యోద్యమ విషయాలపై మాట్లాడుతూ 'హిందువులకే గాంధీజీ ఆశ్రమం అంకితం కారాదు. సర్వమత సామాన్యాయ ప్రార్థనలుండాలి' అని సూచించారు. ఆ తరువాత ప్రార్థనలలో మార్పు వచ్చింది. 'రఘుపతి రాఘవ రాజారాం - ఈశ్వర్ - అల్లా తెరేనాం' అనే ప్రార్థనా గీతాన్ని రూపొందించారు. అబిద్ హసన్ జైలు నుంచి విడుదల కాగానే జర్మనీ వెళ్లి ఇంజనీరింగ్ చదువుకున్నారు. విద్య సమాప్తమవుతున్న దశలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమయింది. అక్కడే పరిచయం ఐన మేజర్ స్వామితో అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అబిద్ హసన్ జర్మనీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్, అరబిక్, సంస్కృతం, పర్షియన్, హిందీ, ఉర్దూ, తెలుగులలో నిష్ణాతుడు.

మూలాలు మార్చు

  1. "A tale of two cities". The Hindu. 30 January 2014. Retrieved 31 January 2014.