అబ్దుల్ గఫూర్ ముహమ్మద్ మౌల్వీ
అబ్దుల్ గఫూర్ ముహమ్మద్ మౌల్వీ, బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో ఆరు పుస్తకాలు వెలువరించారు. అబ్దుల్ గఫూర్ "ఖురాన్"ను మొదటిసారిగా సరళీకరించిన కంభంనివాసి. అతని పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్.ఇస్లాంపై మమకారంతో అబ్దుల్ గఫూర్ 1946లో కంభంలో తన నివాసం పక్కనే మసీదు నిర్మించాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లి దారుల్ ఉలూమ్ దేవబంద్‌లో మౌల్వి కోర్సు పూర్తి చేశారు. అప్పటి నుంచి అతని పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌గా మారింది. కొంత కాలం కర్నూలు ఇస్లామియా అరబిక్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఆ కళాశాల ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో తన కల సాకారం చేసుకోవడానికి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశాడు.కంభంలో అతను నిర్మించిన మసీదులో కూర్చొని ఖరాన్‌ను 3 భాగాలుగా తెలుగులోకి అనువదించాడు. ఇదే సమయంలో ఓ వైపు అరబిక్ లిపి, దాని పక్కనే తెలుగులిపి, మరో పక్క పూర్తి తెలుగులో అర్థంతో పాటు, ఇంగ్లీషు లిపి కూడా రాశాడు. 1948 నాటికి పుస్తకం ముద్రించాడు. గఫూర్.. ఖురాన్‌తో పాటు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, మిష్కాత్ షరీఫ్ పుస్తకాలను కూడా రచించాడు.ఖురాన్ అనువాదం తర్వాత మక్కాకు వెళ్లారు. అయితే మక్కా యాత్ర చేసిన ఫొటోలు ఉండకూడదని వాటిని తగులబెట్టారని తెలుస్తుంది. గఫూర్ అనువాదం తర్వాత 1978లో విజయవాడ వాసి హమీదుల్లా షరీఫ్.. ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించాడు.ఇస్లాంలోని అంశాలను తెలియజేసే ఖురాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. రంజాన్ మాసంలో అవతరించిన ఈ దివ్య గ్రంథం శాంతి.. సమానత్వం.. సేవా గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. గతంలో ఇతర భాషల్లోనే అనువాదమైన ఖురాన్‌ను ఎలాగైనా తెలుగులోకి తర్జుమా చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమివ్వాలనే ఆలోచన మొట్టమొదటిగా కంభం వాసికి కలిగింది. అరబిక్, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ వంటి 30కి పైగా వివిధ భాషల్లో అచ్చయిన ఖురాన్ అప్పటికింకా తెలుగు ప్రజలకు సరిగా అందుబాటులోకి రాలేదు. దీనిపై కలత చెందిన అబ్దుల్ గఫూర్ చివరకు తెలుగులో సరళీకరించారు.
బాల్యం
మార్చుఅబ్దుల్ గఫూర్ ముహమ్మద్ మౌల్వీ జన్మ స్థలం ప్రకాశం జిల్లా కంభం .
రచనా వ్యాసంగం
మార్చుచదువు: మున్షీ, ఫాజిల్. ఉర్దూ పండితులు. ఉర్దూ, అరబిక్, తెలుగు భాషల్లో మంచి ప్రవేశం. అరబ్బీ నుండి తెలుగులోకి ఖుర్ ఆన్ గ్రంథాన్ని అనువదించారు. ఈ అనువాదం 1949లో రెండు భాగాలుగా వెలువడింది. రచనలు: జగత్ప్రవక్త, మిఫ్‌కాతెఫరీష్ (రెండు సంపుటాలు), 'ముస్లిం ప్రభువులు'.
మూలాలు
మార్చు- అక్షరశిల్పులు గ్రంథం: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త—ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్, పుట31