కంభం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా, కంబం మండలం లోని జనగణన పట్టణం


కంభం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం కేంద్రము, చారిత్రక పట్టణము.

కంభం
రెవిన్యూ గ్రామం
కంభం is located in Andhra Pradesh
కంభం
కంభం
నిర్దేశాంకాలు: 15°34′36″N 79°06′20″E / 15.5767°N 79.1055°E / 15.5767; 79.1055Coordinates: 15°34′36″N 79°06′20″E / 15.5767°N 79.1055°E / 15.5767; 79.1055 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకంభం మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం881 హె. (2,177 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం15,169
 • సాంద్రత1,700/కి.మీ2 (4,500/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08406 Edit this at Wikidata)
పిన్(PIN)523333 Edit this at Wikidata

గ్రామ చరిత్రసవరించు

గుండికా వీరాంజనేయస్వామివారి ఆలయం గుండ్లకమ్మనది ఒడ్డున "నాగంపల్లి" పాత గ్రామం ఉంది. మొఘల్ సామ్రాజ్యం పరిపాలనా కాలములో నాయక్ వీదీ, పార్క్ వీదీ, కోనేటి వీదీ, మెయిన్ బజార్ కలుపుకొని "గుల్షానాబాద్" పాత గ్రామం ఉంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీ రికార్డ్స్ లో కూడా "గుల్షానాబాద్" అని ఉంది. "గుల్షానాబాద్"(కంభం) 17 వ శతాబ్దంలో 6000 జనాభా ఉంది.అప్పట్లో "గుల్షానాబాద్"(కంభం) నగర పాలక సమస్త(మునిస్పాలిటి) ఉంది. శ్రీ కృష్ణదేవరాయల విజయనగర రాజవంశం యొక్క రాణి వరదరాజమ్మ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో పెద్ద కంభం, చిన్నకంభం, పేరు గల అనువారిని చెరువు ఆనకట్టకు(తూములు) కట్టబడే గోడకు వారిని బలి దానం చేశారు. వారి చిహ్నముగా "కంభం" ప్రస్తుతం అని పిలువ బడుతుంది .

శాసనాలుసవరించు

కంభంలో రెండు శాసనాలు లభ్యమైనవి. మొదటిది 1706లో ఔరంగజేబ్‌ పరిపాలనా కాలములో కంభం కోట ఖిలాదార్‌ అయిన ఖాజా మొహమ్మద్‌ షరీఫ్‌ యొక్క మరణము గురించి ప్రస్తావిస్తుంది. రెండవది 1729లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా పరిపాలనా కాలములో కంభం గవర్నర్ అయిన మొహమ్మద్‌ ఖయ్యూం యొక్క కుమారుడు మొహమ్మద్‌ సాహీన్‌ గురించి ప్రస్తావిస్తుంది.

గ్రామ భౌగోళికంసవరించు

 

 1. కంబం వద్ద ఉన్న 15,5669 ° N 79,1167 ° / [4] ఇది 184 మీటర్ల (606 అడుగులు) ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

దక్షణాన బెస్తవారిపేట మండలం,తూర్పున తర్లుపాడు మండలం,పడమరన అర్ధవీడు మండలం,దక్షణాన రాచర్ల మండలం.

జన గణనసవరించు

2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 15169. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1కాలువ,825.[1]

రవాణా సౌకర్యాలుసవరించు

రాష్ట్రం రహదారి వినుకొండ-నంద్యాల-కడప విజయవాడ-గుంతకల్ పట్టణం మీదుగా వున్నాయి. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ గుంటూరు-గుంతకల్ రైల్వే లైను మార్గంలో వుంది.

విద్యా సౌకర్యాలుసవరించు

1938 లో స్థాపించిన ప్రభుత్వం ఉన్నత పాఠశాలతో పాటు గురుకుల పాఠశాల, మరి ఇతర ప్రైవేటు పాఠశాలలున్నాయి. 1938 లో స్థాపించిన ప్రభుత్వం జూనియర్ కళాశాల తో పాటు గురుకుల జూనియర్ కళాశాల,మరి ఇతర ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వం డిగ్రీ కళాశాల తో పాటు, పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, డిఇడి కళాశాలలు, బీఇడి కళాశాలలు, పారామెడికల్ కళాశాలలున్నాయి.

వైద్య సౌకర్యంసవరించు

స్థానిక వైద్యవిధాన పరిషత్తు వైద్యశాల తో పాటు పలు ప్రైవేట్ వైద్యశాలలున్నాయి.

బ్యాంకులుసవరించు

ది కంభం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ తో పాటు పలు ప్రభుత్వరంగ బ్యాంకులు సేవలందిస్తున్నాయి.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

కంభం చెరువుసవరించు

చారిత్రక కంభం చెరువు 15 వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి రాజులు నిర్మించారు, తరువాత విస్తృతంగా విజయనగర రాజవంశం 16వ శతాబ్దము తొలి రోజులలో విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల విజయనగర రాజవంశం యొక్క రాణి వరదరాజ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో కట్టించినారని భావిస్తారు. గుండ్లకమ్మ, జంపాలేరు నుండి పారే ఒక యేరు ఈ చెరువుకు నీటిని సమృద్ధిగా తెచ్చి రైతులు వరి, పసుపు, చెరుకు, అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు పండించుటకు వీలు కల్పిస్తున్నది. వర్షపు నీరే ఈ చెరువు యొక్క ఏకైక ఆధారము.20 వ శతాబ్దం మొదట్లో ఆనకట్ట ఎత్తు 57 అడుగుల (17 మీటర్లు), డ్రైనేజీ ప్రాంతం 430 చదరపు మైళ్ల (1,100 కిమీ 2) ఉండేది. ప్రత్యక్ష నీటి పారుదల భూమి 10,300 ఎకరాలు (42 km 2) ఉండేది. ఈ చెరువు యొక్క ఆయకట్టు కంభం, బెస్తవారిపేట మండలములలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, 3 TMC ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల రైతులకు నీరందిస్తుంది. పరీవాహక ప్రాంతము యొక్క విస్తీర్ణము 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996, 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు.

చెరువు 1,113 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని,23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ఠ నీటి మట్టం 204.10 మీటర్లు. చెరువు ఆనకట్ట పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం కాలువ, చిన్న కంభం కాలువ, చితిరలకట్ట, నక్కల గండి కాలువ, పాపాయిపల్లి కాలువ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం కాలువ 32 తుములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీనికింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

రాజకీయాలుసవరించు

పట్టణం ఆంధ్ర ప్రదేశ్. 2009 వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది . కంబం నియోజకవర్గం పునర్వ్యవస్థీకరించారు, గిద్దలూరు నియోజకవర్గంలో విలీనం చేశారు.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ యూసుఫ్ షరీఫ్, సర్పంచిగా ఎన్నికైనారు. [2] ప్రస్తుతం ప్రత్యేకఅధికారి పాలన కొనసాగుతుంది .

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

 1. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం (కాపువీధి)
 2. శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్నది
 3. శ్రీ కాశీవిశ్వేశ్వర శ్రీ కోటేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయం, కంభం-పోరుమామిళ్ళ మార్గంలో, గుండికా నది ఒడ్డున ఉంది.
 4. కందులపురం యందు ఫైర్ స్టేషన్ దగ్గర గల కొండపైన, శ్రీ మస్తాన్ వలి స్వామి దర్గా ఉంది.
 5. జుమ్మామస్జిద్ 1629 లోభారతదేశం (దక్షిణ) చక్రవర్తి కట్టించారు.
 6. గచ్చు కాలువ మస్జిద్ 1729 లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా కట్టించారు.
 7. బేస్తవారిపేట పోవు దారిలో మస్జిద్ ను ఔరంగజేబ్‌ పరిపాలనా కాలములో కట్టించారు.
 8. గుండ్లకమ్మ నది గురించి మార్చి,1794 లో ఒక తెలియని కళాకారుడు చిత్రీకరించాడు. ఈ చిత్రం పెయింటింగ్ ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

చెరకు, వరి,టమోటా, అరటి,పసుపు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

 • అబ్దుల్ గఫూర్ "ఖురాన్‌"ను మొదటిసారిగా సరళీకరించిన కంభంవాసి ఆయన పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌.ఇస్లాంపై మమకారంతో అబ్దుల్ గఫూర్ 1946లో కంభంలో తన నివాసం పక్కనే మసీదు నిర్మించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లి దారుల్ ఉలూమ్ దేవబంద్‌లో మౌల్వి కోర్సు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయన పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌గా మారింది. కొంత కాలం కర్నూలు ఇస్లామియా అరబిక్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ కళాశాల ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో తన కల సాకారం చేసుకోవడానికి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. కంభంలో ఆయన నిర్మించిన మసీదులో కూర్చొని ఖరాన్‌ను 3 భాగాలుగా తెలుగులోకి అనువదించారు. ఇదే సమయంలో ఓ వైపు అరబిక్ లిపి, దాని పక్కనే తెలుగులిపి, మరో పక్క పూర్తి తెలుగులో అర్థంతో పాటు, ఇంగ్లీషు లిపి కూడా రాశారు. 1948 నాటికి పుస్తకం ముద్రించారు.గఫూర్.. ఖురాన్‌తో పాటు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, మిష్కాత్ షరీఫ్ పుస్తకాలను కూడా రచించారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు అమ్మాయిలున్నట్లు తెలిసింది. ఖురాన్ అనువాదం తర్వాత మక్కాకు వెళ్లారు. అయితే మక్కా యాత్ర చేసిన ఫొటోలు ఉండకూడదని వాటిని తగులబెట్టారట. గఫూర్ అనువాదం తర్వాత 1978లో విజయవాడ వాసి హమీదుల్లా షరీఫ్.. ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించారు.ఇస్లాంలోని అంశాలను తెలియజేసే ఖురాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. రంజాన్ మాసంలో అవతరించిన ఈ దివ్య గ్రంథం శాంతి.. సమానత్వం.. సేవా గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. గతంలో ఇతర భాషల్లోనే అనువాదమైన ఖురాన్‌ను ఎలాగైనా తెలుగులోకి తర్జుమా చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమివ్వాలనే ఆలోచన మొట్టమొదటిగా కంభం వాసికి కలిగింది. అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ వంటి 30కి పైగా వివిధ భాషల్లో అచ్చయిన ఖురాన్ అప్పటికింకా తెలుగు ప్రజలకు సరిగా అందుబాటులోకి రాలేదు. దీనిపై కలత చెందిన అబ్దుల్ గఫూర్ చివరకు తెలుగులో సరళీకరించారు.
 • త్యాగరాజు (1767 మే 4 - 1847 జనవరి 6) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.త్యాగరాజు ప్రస్తుత కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767 లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు.
 • పూల సుబ్బయ్య వీరు కంభంలో జన్మించారు. 1952లో కంభం పంచాయతీకి వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయినారు. అప్పుడు మార్కాపురానికి మకాం మార్చి, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తిరిగి ఆరు సంవత్సరాల తరువాత, రాజకీయాలలోకి వచ్చి, యర్రగొండపాలెం శాసనసభకు సి.పి.ఐ.అభ్యర్థిగా పోటీచేసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అదే స్థానంలో 1967 లోనూ, 1978లోనూ, మార్కాపురం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. వరుస కరువు కాటకాలతో కుదేలవుచున్న అన్నదాతల చింతలు తీర్చేటందుకు, వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే పరిష్కారమని తలచి, ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసారు . ఫలితంగా మూడు జిల్లాల వరదాయిని, "వెలుగొండ ప్రాజక్టు" నిర్మాణానికి అడుగులు పడినవి. ఆయన సేవలకు గుర్తుగా ప్రభుత్వం, ఈ జలాశయానికి "పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు" అని నామకరణం చేసింది. [3]
 • స్వతంత్రం వచ్చినతరువాత నెహ్రుా గారి  పరిపాలనలో కరణాలని నియమించడం జరిగింది. అనగ 1955 నుంది 1990 వరకు కంభం, చుట్టుపక్కన పలుగ్రామాలకి "ఆకవీటి బాల క్రిష్నమూర్తి గారు" కరణంగా పనిచేసి ఎన్నో గ్రామాలకి తమ సహయ సహకారలని అందచేశారు.వారి సేవలని మెచ్చి బ్రిటిష్, భారత ప్రభుత్వం నుండి పలు సత్కారాలు పొందినారు.
 • కంభం పట్టణానికి చెందిన నిట్టూరి సుబ్బారావు, 2014,డిసెంబరు-22వ తేదీన, విశాఖపట్నంలోని కళా భారతిలో నిర్వాహకులనుండి, "ఆంధ్రరత్నం" బిరుదును అందుకున్నారు. వీరు సంగీతాభివృద్ధికి విశేషకృషి చేస్తున్నారు. [4]
 1. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కవులు, శాస్త్రవేత్తలలో త్యాగరాజస్వామి తాత గిరిరాజ కవి , పరవస్తు వెంకయ్యసూరి (శచీదేవి కావ్యరచయిత), చలువాది వెంకట సుబ్రమణ్యం (రసాయనిక శాస్త్రవేత్త) మొదలైనవారు ఆ జాబితాలో ఉన్నారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి, ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఇక్కడి వారేనని తెలిసింది.

మూలాలుసవరించు

 1. "జనగణన 2011".
 2. ఈనాడు ప్రకాశం; 2017,ఫిబ్రవరి-16; 5వపేజీ.
 3. ఈనాడు ప్రకాశం; 2017,జూన్-12; 4వపేజీ.
 4. sakshi ప్రకాశం; 2017,జూన్-20; 5వపేజీ.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కంభం&oldid=2861214" నుండి వెలికితీశారు