అబ్బాయితో అమ్మాయి
అబ్బాయితో అమ్మాయి 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో నాగశౌర్య, పాలక్ లల్వాని హీరో, హీరోయిన్ గా నటించగా రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2016, జనవరి 01వ తేదీన విడుదలయ్యింది.[1]
అబ్బాయితో అమ్మాయి | |
---|---|
దర్శకత్వం | రమేశ్ వర్మ |
నిర్మాత | జె. వందన అలేఖ్య, పి. కిరీటి , ఎస్. శ్రీనివాస్ |
తారాగణం | నాగశౌర్య పాలక్ లల్వాని |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | ఎస్.ఆర్.శేఖర్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థలు | జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఅభి (నాగశౌర్య) అందరిలానే ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ ని లైన్ లోపెట్టాలని ట్రై చేస్తుంటాడు. ప్రార్థన (పల్లక్ లల్వాని) ఫేస్ బుక్ లో మారు పేర్లతో పరిచయమై మంచి స్నేహితులవుతారు. ఆ ఆన్ లైన్ స్నేహం అలా కొనసాగుతుండగా.. ఇక్కడ ఆఫ్ లైన్లో ఒకరినొకరు చూస్తారు. అభి చాలా ప్లాన్లు వేసి ప్రార్థను ప్రేమలోకి దించుతాడు. తర్వాత ఇద్దరూ శారీరకంగా కూడా కలుస్తారు. ఈ విషయం వాళ్ల తల్లిదండ్రులకి తెలిసి సమస్య పెద్దదవుతుంది. ఆ సమయంలోనే అభి తననెలా మోసం చేసింది ప్రార్థనకు తెలుస్తుంది. దీంతో ఆమె అతణ్ని అసహ్యించుకుంటుంది. నిజ జీవితంలో విడిపోయిన వీళ్లిద్దరూ ఫేస్ బుక్ లో మాత్రం ఒకరినొకరు చూసుకోకుండా తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. మరి ఆ స్నేహం ఎంతవరకు వెళ్లింది, చివరికి వీళ్లిద్దరూ కలిశారా లేదా అన్నది ఈ సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- నాగ శౌర్య
- పాలక్ లల్వాని
- బ్రహ్మానందం
- రావు రమేశ్
- మోహన్
- ప్రగతి
- తులసి
- పృథ్వీ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: రమేశ్ వర్మ
- నిర్మాతలు: జె.వందన అలేఖ్య, పి.కిరీటి, ఎస్.శ్రీనివాస్
- సంగీతం: ఇళయరాజా
- సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కె. నాయుడు
- ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్
- పాటలు: రహ్మాన్
- ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి
పాటలు
మార్చుఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందివ్వగా, రెహ్మాన్, చైతన్య వర్మ & సిరాశ్రీ పాటలను రాశారు.
No. | పాట | గాయకులు | రచయిత | నిముషాలు (m:ss) |
---|---|---|---|---|
1 | "రీనామేకరీనా " | పీయూష్ కపూర్ | రెహ్మాన్ | 4:47 |
2 | "ఎదురు చూస్తున్న " | విభావరి | రెహ్మాన్ | 5:22 |
3 | "తొలి పరువం " | సత్య ప్రకాష్, విభావరి | రెహ్మాన్ | 5:47 |
4 | "మాటల్లో చెప్పలేని" | కార్తీక్ | రెహ్మాన్ | 4:18 |
5 | "కనులు కలను పిలిచే " | హరిచరణ్, చిన్మయి | రెహ్మాన్ | 4:57 |
6 | "ఒకసారి ఓ వయ్యారి" | యాజిన్ నిజార్, రీటా, బ్లేజ్ | రెహ్మాన్ | 3:47 |
7 | "సరదాలే" | ఎం.ఎం. మనసి, రమ్యా ఎన్ఎస్కె, రీటా, రీనా రెడ్డి | చైతన్య వర్మ | 4:46 |
8 | అబ్బాయితో అమ్మాయి (మేల్) | పీయూష్ కపూర్ | సిరాశ్రీ | 1:31 |
9 | అబ్బాయితో అమ్మాయి(ఫిమేల్) | అపర్ణ | సిరాశ్రీ | 1:28 |
మూలాలు
మార్చు- ↑ The Hindu (1 January 2016). "Abbayitho Ammayi: Can audience buy this?". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ Sakshi (1 January 2016). "ఓపికగా... అబ్బాయితో అమ్మాయి". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ The Indian Talks (1 January 2016). "Critics on Abbayitho Ammayi Telugu Movie Review & Rating- First Day Collections". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.