పాలక్ లల్వాని
పాలక్ లల్వాని తెలుగు, తమిళ చలనచిత్ర నటి. 2016లో అబ్బాయితో అమ్మాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]
పాలక్ లల్వాని | |
---|---|
జననం | 1 జనవరి, 1998 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016 - ప్రస్తుతం |
ఎత్తు | 5 అ. 6 అం. (168 cమీ.) |
తల్లిదండ్రులు | జితెన్ అల్వాని దీపిక లల్వాని |
జీవిత విషయాలు
మార్చుసాలక్ లల్వాని 1998, జనవరి 1న జితెన్, దీపిక దంపతులకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదులో జన్మించింది. జితెన్ లల్వాని హిందీ టివి నటుడు.[2]
సినిమారంగం
మార్చుతెలుగులో నాగశౌర్య హీరోగా వచ్చిన అబ్బాయితో అమ్మాయి సినిమా పాలక్ లల్వాని తొలి సినిమా.[3] 2028లో కమల్ చంద్ర దర్శకత్వంలో రవి శంకర్ సంగీతంలో రహత్ ఫతేహ్ ఆలీ ఖాన్ తో దిల్ జఫ్రాన్ అనే వీడియోలో నటించింది.[4] 2018లో జువ్వ సినిమాలో నటించింది. ఈ సినిమాలో పాలక్ లల్వాని గ్లామర్ గా, చిలిపి అమ్మాయి పాత్రలో చాలా బాగా నటించిందని తెలంగాణ టుడే రివ్యూలో రాసింది.[5]
2019లో క్రేజీ క్రేజీ ఫీలింగ్ సినిమాలో నటించింది.[6][7] 2019లో బాబా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కుప్పతు రాజా చిత్రంతో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో లాల్వాని మద్రాస్ అమ్మాయిగా నటించింది.[8][9] అదే సంవత్సరం వైభవ్‌తో కలిసి సిక్సర్ సినిమాలో జర్నలిస్టుగా నటించింది.[6][8][10] అరుణ్ విజయ్ తో సినమ్, ఆది పినిశెట్టి, హన్సికతో పార్ట్‌నర్ సినిమాల్లో నటించింది.[11][12]
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | చిత్రం పేరు | పాత్రపేరు | భాష | మూలాలు |
---|---|---|---|---|
2016 | అబ్బాయితో అమ్మాయి | ప్రార్థన | తెలుగు | |
2018 | జువ్వ | శృతి | తెలుగు | |
2019 | క్రేజీ క్రేజీ ఫీలింగ్ | స్పందన | తెలుగు | |
2019 | కుప్పతు రాజా | కమల | తమిళం | [13] |
2019 | సిక్సర్ | కార్తీక | తమిళం | |
2020 | సినమ్ | TBA | తమిళం | [14] |
2020 | పార్ట్‌నర్ | TBA | తమిళం | |
2023 | భగవంత్ కేసరి | రిపోర్టర్ | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ "New actress in GV Prakash's next". The New Indian Express. Retrieved 2020-07-27.
- ↑ "जितेन लालवानी 'पहरेदार पिया की' के लिए राजस्थान में कर रहे हैं शूटिंग". khas khabar (in హిందీ). 2017-07-07. Retrieved 2020-07-27.
- ↑ "'Abbayitho Ammayi' will be my perfect bday gift: Palak Lalwani". Indian Express. 29 December 2015.
- ↑ "'Dil Zaffran' sung by Rahat Fateh Ali Khan is going to put you in a romantic mood". www.radioandmusic.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-27.
- ↑ Tanmayi, Bhawana. "Movie Review: This 'Juvva' doesn't sparkle". Telangana Today.
- ↑ 6.0 6.1 "I'm a big fan of Mahesh Babu: Palak Lalwani". Deccan Chronicle. 20 February 2018.
- ↑ "'Crazy Crazy Feeling': Ahead of its release, a brief journey with the team - Times of India". The Times of India.
- ↑ 8.0 8.1 M Suganth (22 March 2019). "To be working with Hansika is a very big thing for me: Pallak Lalwani". Times of India.
- ↑ "Kuppathu Raja movie review: A tedious watch that wastes GV Prakash's potential- Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2019-04-06. Retrieved 2020-07-28.
- ↑ S, Srivatsan (2019-08-30). "'Sixer' movie review: Eyes wide shut". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-28.
- ↑ Subramanian, Anupama (13 September 2019). "Palak to romance Arun Vijay". Deccan Chronicle.
- ↑ "Hansika Motwani and Aadhi Pinisetty team up for a sci-fi comedy". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-03-25. Retrieved 2020-07-28.
- ↑ "I don't have a 'blink-and-miss' role in Kuppathu Raja: Pallak Lalwani". Times of India. 30 March 2019.
- ↑ V Lakshmi (13 September 2019). "Pallak Lalwani in GNR's #AV30". Times of India.