అబ్బారెడ్డి నాగేశ్వరరావు

అబ్బారెడ్డి నాగేశ్వరరావు ఆర్కిడాలజీ శాస్త్రవేత్త.

జీవిత విశేషాలు మార్చు

ఆయన గుంటూరు జిల్లా చేబ్రోలులో[1] 1954 జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోటనీలో పి.జి.చేసారు. బోటనీలోనే పి.హెచ్.డి కూడా చేసారు. "ఆర్కిడ్స్ ఆఫ్ అరుణాచల ప్రదేశ్"ను పరిశోధనాంశంగా సిద్దాంత వ్యాసం రాసారు. టిప్పి లోని ఆర్కిడ్ పరిశోధనా కేంద్రంలో ఆర్కిడాలజిస్టు(orchidologist)గా ప్రవేశించి పరిశోధనలు కొనసాగించారు. పశ్చిమ కామెంగ్‌లోని ఈ టిప్పి గ్రామం అసోంలోని తేజ్‌పూర్ నుండి రోడ్డు మార్గంగుండా వెళతే 60 కి.మీ దూరంలో ఉంది. అక్కడ ఆసియాలో అతిపెద్ద ఆర్కిడారియం, టిప్పి పూలతోటల పరిశోధనా కేంద్రం ఇక్కడ ఉన్నాయి. అరుణాచల అడవుల్లో విస్తృతంగా సంచరించి అపారమైన విజ్ఞానం గడించారు.[1]

పరిశోధనలు మార్చు

1980లో అస్సాం లోని తేజపూర్ పట్టణానికి 65 కి.మీ దూరంలో ఉన్న టిప్పి ఆర్కిడ్ స్టేషన్‌లో ప్రవేశించి ఆర్కిడ్ పరిశోధనలు విస్తృతంగా చేపట్టారు. టిప్పి నుండి అరుణాచల ప్రదేశ్ లోని పశ్చిమ కామెంగ్ జిల్లా కేంద్రమైన బొమ్‌దిలాకు వెళ్ళే మార్గంలో ఆయన కొత్తగా 250 ఆర్కిడ్స్ ను కనుగొని రికార్డు చేసారు.[2]

ఒకటి రెండు రోజుల్లో వాడిపోయి స్వరూప రూపలావణ్యాలను కోల్పోయె పూల స్థానంలో ఆర్కిడ్స్ రంగం ప్రవేశం చేసిన నేపథ్యంలో ఈయన పరిశోధనా విజయం ఉంది. రోజుల తరబడి తాజాదనాన్ని కోల్పోకుండా ఆకట్టుకొనే ఈ ఆర్కిడ్స్ కోసం విదేశాల్లో గిరాకీ ఉంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించి, విశేష ప్రాచుర్యం పొందుతున్న ఆర్కిడ్స్ ను రంగ ప్రవేశం చేసిన ఘనత ఈయనది.

ఆర్కిడ్స్ మార్చు

పుష్పించే మొక్కల మాదిరిగానే ఒక రకమైన పూలజాతి మొక్కలు ఆర్కిడ్స్ "ఆర్కిడీస్" కుటుంబానికి చెందినవి. ఈ మొక్కలు పూల అలంకరణలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అరుణాచల్ లో కేవలం 250 రకాలు మాత్రమే నాగేశ్వరరావు పరిశోధనల ఫలితంగా దేశ వ్యాప్తంగా అయితే 1200 రకాల ఆర్కిడ్స్ ఉండగా అరుణాచల్ ప్రదేశ్ ను అగ్రగామిగా నిలిపారు. 30 రకాలు ప్రపంచంలో మరెక్కడా లభించనివి కావడం వల్ల ఈ రోజు అరుణాచల ప్రదేశ్ ను "ఆర్కిడ్స్ రాజధాని"గా పేర్కొంటున్నారు.

టిప్పి ఆర్కిడ్స్ పరిశోధనా కేంద్రాన్ని అనూహ్య రీతిలో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రపంచంలో ప్రకృతి సృష్టించిన సహజసిద్ధమైన ఆర్కిడ్స్ దాదాపు 30 వేల రకాలుంటాయి. వాటిద్వారా శాస్త్రవేత్తలు 1.3 లక్షల రకాలను సృష్టించారని తాజా నివేదికలు చెబుతున్నాయి. డా. నాగేశ్వరరావు సృష్టించిన 250 ఆర్కిడ్స్ లో అయిదారు కొత్త రకాల హైబ్రిడ్స్ ను రిజిస్టర్ చేసారు.[1]

ఆర్కిడ్స్ విజ్ఞానరంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రతిభ ఉన్న కొద్ది మందిలో ఆయన ఒకరు. అరుణాచల ప్రదేశ్‌లో "డా.రావు"గా పేరు పొందారు. ఆయన "అరుణాచెలన్సీస్"[3] (మన దేశంలో ప్రప్రథమంగా కనుగొన్న ప్రజాతి), బీర్ మానియా జైనియాన ఓబోరోనియా కమ్‌లాంగినెస్ మొదలగు అనేక రకాల ఆర్కిడ్స్ ను ఆయన అభివృద్ధిచేసారు.

పురస్కారాలు మార్చు

  1. Awarded Plaque of honour by the Orchid Society of India, Chandigarh in 2008 at Bangalore and by The National Research Centre for Orchids, Pakyong, Sikkim in 2013 at Gangtok for outstanding contributions to the Indian Orchidology.
  2. Received FAO fellowship in 1999 and visited Australia for training in Tree Breeding, Plant DNA figure printing, Tissue culture at CALM Science, Perth for 3 months
  3. 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అబ్బారెడ్డి నాగేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది[4].
  4. ్ర ప్రభుత్వం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 ఆంధ్ర శాస్త్రవేత్తలు (krishnaveni publishers,vijayawada ed.). శ్రివాసవ్య. 1 August 2011. p. 410.
  2. "ORCHIDOLOGY REASEARCH PAPERS". Archived from the original on 2016-03-04. Retrieved 2016-05-14.
  3. "Gastrochilus arunachalensis A.N.Rao is an accepted name". Archived from the original on 2022-10-24. Retrieved 2016-05-14.
  4. Desk, HT Telugu. "Padma Awards 2023: చినజీయర్‌కు పద్మభూషణ్.. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు వీరికే". Hindustantimes Telugu. Retrieved 2023-09-04.

ఇతర లింకులు మార్చు