అభిమానాలు (నవల)
అభిమానాలు కాళీపట్నం రామారావు గారి అత్యంత ప్రసిద్ధి చెందిన నవలల్లో ఒకటి. ఈ నవలను రచయిత మార్చి 1952లో రచించారు.
అభిమానాలు. | |
అభిమానాలు నవల ముఖ చిత్రము | |
కృతికర్త: | కాళీపట్నం రామారావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నలల |
ప్రచురణ: | న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్, ఏలూరు రోడ్. విజయవాడ. |
విడుదల: | 1974(రచనా కాలం 1952) |
నవలా విశేషాలు
మార్చు- కథ ఆద్యంతమూ అందమైన పదాల కూర్పుతో సాగుతూ చదివేవారికి హాయిని కలిగిస్తుంటుంది.
- కాళీపట్నం వారి సహజ శైలితో కథనం నడిపిన తీరు మనసులను ఆకట్టుకుంటుంది.
కవి పరిచయం
మార్చుకారా మాస్టారుగా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంధ్రనాధ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా అత్యంత సుప్రసిద్ధమైన రచనలు చేసారు.
కథా విశేషాలు
మార్చుఇది ఒక అసహాయ చలపతి కథ. తండ్రి క్రమశిక్షణలో భయపడుతూ బ్రతికే చలపతి కథ. తన తమ్ముడిని బాగా ప్రయోజకుడిని చేద్దామని తలచిన చలపతి తండ్రి తనమాట వినకుండా కులం కాని అమ్మాయిని చేసుకున్నాడని తమ్ముడిని వెలివేస్తాడు. తనకొడుకు అలానే పెరుగుతాడనే భయం వలన ఆయన చలపతిని విపరీతమైన క్రమశిక్షణతో పెంచుతూ ఆఖరుకు అతడు ఆత్మహత్య చేసుకొవాలనే తలంపు కలిగేలా చేస్తాడు.దాంతో చలపతి స్కూలు నుండి పారిపోయి తన బాబాయి దగ్గరకు చేరతాడు. విషయం తెలిసి వచ్చిన చలపతి తండ్రి తన కొడుకు ఆరోగ్యపరిస్థితి తనయందు అతడికి గల భయం తెలుసుకొంటాడు. తన తమ్ముడిని కలుపుకోవడం, కొడుకుకు అతని యందు భయం పోగొట్టడం ద్వారా కథకు ముగింపు చెప్తాడు.
పాత్రలు
మార్చు- పద్మనాభం
- లక్ష్మమ్మ
- భాస్కరం
- రాఘవి
- చలపతి
- శారద