అమరం అఖిలం ప్రేమ
అమరం అఖిలం ప్రేమ 2020, సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రామ్, శివశక్తి సచ్‌దేవ్, నరేష్, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించగా, రధన్ సంగీతం అందించాడు. ఈచిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, మరియప్పన్ ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. ఈ చిత్రం ఆహా (ఓటిటి)లో విడుదలైంది.[1]
అమరం అఖిలం ప్రేమ | |
---|---|
దర్శకత్వం | జోనాథన్ ఎడ్వర్డ్స్ |
రచన | జోనాథన్ ఎడ్వర్డ్స్ |
నిర్మాత | వీఈవీకేడీఎస్ ప్రసాద్ |
తారాగణం | విజయ్ రామ్ శివశక్తి సచ్‌దేవ్ |
ఛాయాగ్రహణం | రసూల్ ఎల్లోర్ |
కూర్పు | మరియప్పన్ |
సంగీతం | రధన్ |
పంపిణీదార్లు | ఆహా (ఓటిటి) |
విడుదల తేదీ | 18 సెప్టెంబరు 2020 |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా సారాంశం
మార్చుశ్రీకాంత్ అయ్యంగర్ కు తన కూతురు అఖిల (శివ్ శక్తి సచ్ దేవ్) అంటే ప్రాణం, అఖిల కూడా తన తండ్రిపై చిన్నప్పటి నుంచి ప్రేమను కలిగి ఉంటుంది. ఒకరినొకరు విడిచిపెట్టలేనంత ప్రేమతో ఉండగా అఖిల చేసిన ఒక పెద్ద తప్పు వల్ల తండ్రి కూతుర్ల మధ్య దూరం పెరుడుతుంది. కొంతకాలం తరువాత అఖిల ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చేస్తుంది. అక్కడ అమర్ (విజయ్ రామ్) పరిచయం అయిన విజయ్ ఆమెను ప్రేమిస్తాడు. ముందు అఖిల నో చెప్పినప్పటికీ తర్వాత అతనంటే ఇష్టపడుతుంది. ఇద్దరి ప్రేమకథ ఏమవుతుంది? అఖిల మళ్ళీ తన తండ్రిని కలుసుకుందా? అసలు ఆమె చేసిన ఆ తప్పేంటి అన్నది మిగతా కథ.[2]
నటవర్గం
మార్చు- విజయ్ రామ్ (అమర్)
- శివశక్తి సచ్‌దేవ్ (అఖిల)
- నరేష్ (అమర్ తండ్రి)
- శ్రీకాంత్ అయ్యంగార్ (అఖిల తండ్రి)
- అన్నపూర్ణ (అఖిల అమ్మమ్మ)
- శ్రీలక్ష్మి (అఖిల అత్త)
- శివారెడ్డి
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: జోనాథన్ ఎడ్వర్డ్స్
- నిర్మాణం: వీఈవీకేడీఎస్ ప్రసాద్
- సంగీతం: రధన్
- సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
- కూర్పు: మరియప్పన్
- పంపిణీదారు: ఆహా (ఓటిటి)
సంగీతం
మార్చురధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు రెహమాన్ సాహిత్యం అందించాడు. 2020, సెప్టెంబరు 16న "తొలి తొలి" అనే పాటను మధుర ఆడియో విడుదల చేసింది.[3]
విడుదల
మార్చుఈ చిత్రం కరోనా-19 మహమ్మారి కారణంగా 2020, సెప్టెంబరు 18న ఆహా (ఓటిటి) ద్వారా విడుదలైంది.[4]
స్పందన
మార్చుఈ చిత్రంలో మంచి సందేశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా చెందిన తధాగత్ పతి రాశారు.[2] ఈ చిత్రం "ప్రేమ, బంధం, ఈగోల గురించి చెబుతుందని ది హిందూకు చెందిన సంగీత దేవి దుండూ రాశారు.[5]
మూలాలు
మార్చు- ↑ "Amaram Akhilam Prema Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 2020-09-18. Retrieved 2020-11-27.
- ↑ 2.0 2.1 Amaram Akhilam Prema Review: Despite having a good message, the film doesn’t stick to its guns, retrieved 2020-11-27
- ↑ "Amaram Akhilam Prema 2020 Telugu Mp3 Naa Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-25. Archived from the original on 2020-10-23. Retrieved 2020-11-27.
- ↑ "OTT Review: Amaram Akhilam Prema". Gulte (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-09-19. Retrieved 2020-11-27.
- ↑ Dundoo, Sangeetha Devi (2020-09-18). "'Amaram Akhilam Prema' review: A familiar tale of love, bonding and egos". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-11-27.