శివారెడ్డి (నటుడు)
శివారెడ్డి నటుడు, మిమిక్రీ కళాకారుడు, వ్యాఖ్యాత. 100 కి పైగా సినిమాల్లో నటించాడు.[1] దేశ విదేశాల్లో 6000 కి పైగా అనేక ప్రదర్శనలిచ్చాడు.
శివారెడ్డి | |
---|---|
జననం | 1974 (age 49–50) |
వృత్తి | నటుడు, మిమిక్రీ కళాకారుడు, వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 1994-ప్రస్తుతం |
వ్యక్తిగత జీవితం
మార్చుశివారెడ్డి 1974 లో కరీంనగర్ జిల్లా, రామగుండంలో జన్మించాడు. శివారెడ్డి బాల్యంలో డ్యాన్సు, పాటలంటే ఆసక్తి చూపేవాడు. తండ్రి దేవాలయానికి తీసుకెళితే అక్కడ భక్తి పాటలు పాడేవాడు. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యం చేసేవాడు. ఉపాధ్యాయులను అనుకరించి నవ్వించేవాడు. పదో తరగతి పూర్తి కాగానే శివారెడ్డి సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు. కానీ అతనికి వయసు సరిపోకపోవడంతో ఎక్కడా అవకాశాలు రాలేదు. అక్క పెళ్ళి కోసం వరంగల్ వచ్చిన శివారెడ్డిని నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర అనే ఆయన దూరదర్శన్ లో నృత్యం చేయమని కోరాడు. అలాగే ప్రముఖ జానపద కళాకారుడు సారంగపాణి తన ప్రదర్శనలన్నింటికీ ఇతన్ని వెంటపెట్టుకుని తిప్పడంతో అతనికి వరంగల్ జిల్లాలో మంచి గుర్తింపు వచ్చింది.
కెరీర్
మార్చుసినీ నిర్మాత సానా యాదిరెడ్డి పరిచయంతో మొదటి సారిగా పిట్టల దొర సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత బ్యాచిలర్స్, అమ్మాయి కోసం, ఆనందం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, మనసంతా నువ్వే, అతడే ఒక సైన్యం, వసంతం, నాగ, నేనున్నాను తదితర చిత్రాల్లో నటించాడు.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
1996 | పిట్టల దొర | |
2001 | ఆనందం | |
2001 | అమ్మాయి కోసం | |
2003 | ఆయుధం | |
2003 | నీ మనసు నాకు తెలుసు | |
2003 | వసంతం | |
2003 | కేడీ నం 1 | |
2003 | ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ | |
2003 | నాగ | |
2004 | అతడే ఒక సైన్యం | మిమిక్రీ ఆర్టిస్టు |
2004 | గూఢచారి 117 | |
2004 | కారు దిద్దిన కాపురం | |
2004 | దొంగ దొంగది | |
2004 | ఎక్స్ట్రా | |
2004 | ఐతే ఏంటి | |
2004 | అడవి రాముడు | |
2004 | కాశి | |
2005 | రంభ నీకు ఊర్వశి నాకు | |
2005 | చక్రం | |
2006 | స్టాలిన్ | |
2008 | రెయిన్‌బో | |
2010 | ఆలస్యం అమృతం | |
2010 | పప్పు | |
2010 | బురిడీ | |
2010 | నమో వెంకటేశ | సంగీత కళాకారుడు |
2011 | జై బోలో తెలంగాణా | |
2011 | వస్తాడు నా రాజు | |
2011 | నగరం నిద్రపోతున్న వేళ | |
2011 | దూకుడు | మిమిక్రీ కళాకారుడు |
2011 | క్రికెట్ గర్ల్స్ & బీర్ | |
2012 | తిక్క[2] | |
2017 | 2 కంట్రీస్ | |
2020 | అమరం అఖిలం ప్రేమ | |
2024 | వి లవ్ బ్యాడ్ బాయ్స్ |
మూలాలు
మార్చు- ↑ "శివారెడ్డి వెబ్ సైటు". shivareddy.co.in. శివా రెడ్డి. Retrieved 18 November 2016.[permanent dead link]
- ↑ http://www.123telugu.com/mnews/srihari-priyamani-and-posani-in-thikka.html