అమరజీవి (1983 సినిమా)

అమరజీవి జంధ్యాల రచన, దర్శకత్వంలో వహించగా అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించిన 1983 నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రాన్ని భీమవరపు బుచ్చిరెడ్డి, జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించాడు. భీశెట్టి కథను అందించగా, జంధ్యాల స్క్రీన్ ప్లే సమకూర్చాడు. కె. చక్రవర్తి సంగీతం సమకూర్చగా వేటూరి సుందరరామ్ముర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, అనితా రెడ్డి పాటలు పాడారు.[1]

అమరజీవి
Amara-Jeevi-1983.jpg
దర్శకత్వంజంధ్యాల
రచనభీశెట్టి (కథ), జంధ్యాల (స్క్రీన్ ప్లే), వేటూరి సుందరరామ్మూర్తి (పాటలు)
నిర్మాతభీమవరపు బుచ్చిరెడ్డి
నటవర్గంఅక్కినేని నాగేశ్వరరావు,
జయప్రద
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
కూర్పుగౌతంరాజు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
దేశంభారత దేశం
భాషతెలుగు

కథసవరించు

డాక్టర్ మురళి, లలితల ప్రేమకథతో చిత్రం మొదలవుతుంది. తీరా పెళ్ళి సమయానికి లలిత పెళ్ళికి నిరాకరిస్తుంది. తన అక్క సావిత్రిని మురళి ప్రేమ పేరుతో మోసం చేసినందువలనే తాను ఆత్మహత్యకి పాల్పడినదని, తన మరణానికి కారణం మురళి అని తెలుసుకొన్న లలిత, ప్రేమలో మోసగింపబడితే ఎలా ఉంటుందో తనకి తెలియజేయటానికే అతనితో ప్రేమ నాటకమాడినదని తెలియజెబుతుంది.

చిత్రబృందంసవరించు

తారాగణంసవరించు

ప్రధాన తారాగణం
  • డాక్టర్ మురళీధర్ గా అక్కినేని నాగేశ్వరరావు. మురళీధర్ వైద్యునిగా పనిచేస్తుంటారు. పెద్దవయసు వచ్చినా స్త్రీద్వేషంతో పెళ్ళిచేసుకోకుండా ఉండిపోయిన వ్యక్తి. అక్కాచెల్లెళ్ళ చేతిలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పీటల మీది పెళ్ళి ఆగిపోయానా, వారి క్షేమమే కోరుకునే త్యాగమూర్తి. చివరకు తన కళ్ళు కూడా దానం చేసి మరణించి అమరజీవిగా నిలుస్తాడు.
  • లలితగా జయప్రద. మురళీధర్ కారణంగా తన అక్క చనిపోయిందని భావించి, అతనికి దగ్గరై అతన్ని కూడా సరిగ్గా పెళ్ళిపీటలపై మోసం చేసే వ్యక్తి. మురళీ తప్పేమీ లేదని తెలసుకున్నప్పుడు పశ్చాత్తాపం పొందుతుంది. ఈమె కోసమే మురళీ తన జీవితాన్నే త్యాగం చేస్తాడు.
  • గాయత్రిగా సుమలత. మురళీధర్ ని ప్రేమించి, పెళ్ళిచేసుకోబోయిన సమయంలో దుస్సంఘటనల వల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఈమె చెల్లెలు లలిత అక్కమరణానికి కక్ష తీర్చుకుంటుంది.
  • మధుగా శరత్ బాబు. లలిత భర్త. అతనికే చివర్లో తన కళ్ళు దానం చేసి మురళీ మరణిస్తాడు.
ఇతర తారాగణం

సాంకేతిక నిపుణులుసవరించు

  • దర్శకత్వం, స్క్రీన్ ప్లే - జంధ్యాల
  • నిర్మాత - భీమవరపు బుచ్చిరెడ్డి
  • కథా రచయిత - భీశెట్టి
  • గీత రచన - వేటూరి
  • నేపథ్య గాయకులు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, అనితా రెడ్డి
  • డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీ - పి.కృష్ణంరాజు
  • పాటల రికార్డింగ్ - ఎ.ఆర్.స్వామినాథన్
  • అసోసియేట్ డైరెక్టర్లు - బి.ఎస్.నిష్టల, బత్తుల రామకృష్ణ
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - ఎస్. గోపాలరెడ్డి
  • నృత్యదర్శకుడు - శేషు, శివసుబ్రహ్మణ్యం
  • కళాదర్శకుడు - భాస్కరరాజు
  • ఎడిటర్ - గౌతంరాజు
  • నిర్వహణ - బి.అంజిరెడ్డి

పాటలుసవరించు

ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, అనితా రెడ్డి పాటలు పాడారు.

  • మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి
  • అసుర సంధ్యవేళ ఉసురు తగుల నీకు స్వామీ
  • ఎలా గడపనూ ఒక మాసం ముప్పై రోజుల ఆరాటం

మూలాలుసవరించు

  1. "Amarajeevi (1983)". Indiancine.ma. Retrieved 2021-05-18.