అమీ తుమీ
అమీ తుమీ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై కె సి నరసింహా రావు నిర్మించగా ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అడివి శేష్, ఈషా రెబ్బ, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్ ప్రధాన పాత్రలలో నటించారు. మణి శర్మ సంగీతాన్ని సమకూర్చగా, పి.జి. వింద ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
అమీ తుమీ | |
---|---|
దర్శకత్వం | ఇంద్రగంటి మోహన కృష్ణ |
రచన | ఇంద్రగంటి మోహన కృష్ణ |
నిర్మాత | కె సి నరసింహా రావు |
తారాగణం | అడివి శేష్ ఈషా రెబ్బ వెన్నెల కిశోర్ అవసరాల శ్రీనివాస్ తనికెళ్ళ భరణి అదితి మ్యాకల్ |
ఛాయాగ్రహణం | పి.జి. వింద |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జూన్ 9, 2017([1]) |
సినిమా నిడివి | 124 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బడ్జెట్ | 3 కోట్లు |
బాక్సాఫీసు | 10 కోట్లు |
ఈ చిత్రం 2017 జూన్ 9న విడుదలయ్యి ప్రశంసలను అందుకుంది, ముఖ్యంగా వెన్నెల కిశోర్నటనకి మంచి పేరు లభించింది.[2][3][4] 1971 లో విడుదలైన ఆనంద నిలయం సినిమా ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
పాటల జాబితా
మార్చుఅయ్య బాబోయ్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.పవన్ చరణ్ , సాహితి చాగంటి, వెన్నెల కిషోర్, తనికెళ్ల బార్గవ్
తకడిమి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.స్వీకార్ అగస్టి , రమ్య బెహరా ,
తకధిమి ,(క్లబ్ వెర్షన్)రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.శ్రీకృష్ణ
మూలాలు
మార్చు- ↑ http://www.filmibeat.com/telugu/movies/ami-tumi.html
- ↑ Toleti, Siddartha. "Ami Thumi Review, Ami Thumi Movie Review, Ami Thumi Ratings Live Updates, Ami Tumi Review". www.mirchi9.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 October 2019.
- ↑ Telugu360 (2017-06-10). "Ami Tumi Review Rating". Telugu 360 (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 October 2019.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Ami Tumi Review - Telugu Movie Ami Tumi nowrunning review". NOWRUNNING. Archived from the original on 15 అక్టోబరు 2019. Retrieved 15 October 2019.