అమూల్ భారతీయ సహకార డైరీ, గుజరాత్ లోని ఆనంద్  లో ఉంది ఈ సంస్థ.[1]

ఆనంద్ లోని అమూల్ కర్మాగారం

1946లో ప్రారంభమైన ఈ డైరీ గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సంఘం నిర్వహిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ లోని దాదాపు 3.6 మిలియన్ పాడి రైతులు ఈ సంస్థలో వాటాదారులుగా ఉన్నారు.[2]

భారత శ్వేత విప్లవాన్ని ప్రోత్సాహించిన అమూల్ సంస్థ ఈ విప్లవం ద్వారా  ప్రపంచంలోనే భారతదేశాన్ని పాల, పాల ఉత్పత్తుల తయారీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టింది.[3] ఈ సమయంలోనే అమూల్ దేశంలోని అతిపెద్ద ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థగా ఎదిగి, విదేశీ విపణిలోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్ళింది.

అమూల్ విజయానికి కారణం ఈ సంస్థను స్థాపించి, గుజరాత్ పాల సహకార సంఘానికి చైర్మన్ గా 30 ఏళ్ళు కృషి చేసిన డాక్టర్ వర్ఘీస్ కురియన్కు చెందుతుంది.[4]

చరిత్ర

మార్చు

14 డిసెంబర్ 1946న అమూల్ సంస్థ రిజిస్టర్ అయింది. ఆనంద్ జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాల పాడిరైతుల నుంచీ పాలు కొని, ఇతర నగరాల్లో అమ్మే పోల్సన్ డైరీ వారికి తక్కువ రేటు ఇచ్చి దోపిడీ చేస్తోందంటూ రైతులు అందరూ కలసి కో-ఆపరేటివ్ పద్ధతిలో అమూల్ ను స్థాపించారు. అప్పట్లో ప్రభుత్వం బాంబే నగరానికి పాలు అమ్మేందుకు పోల్సన్ కంపెనీకి గుత్తాధిపత్యం ఇవ్వడంతో రైతులకు తక్కువ ధర ఇచ్చేవారు. పైగా పాలు పాడైపోయాయంటూ ఒకోసారి వారికి అతి తక్కువ ధరలు ఇవ్వడం లేదా మొత్తానికి మానేయడం చేసేవారు.[5][6]

ఈ దోపిడీకి ఎదురుతిరిగిన కైరా జిల్లా రైతులుసర్దార్ వల్లభభాయి పటేల్ ను సంప్రదించగా, స్థానిక రైతు త్రిభువన్‌దాస్ పటేల్ నాయకత్వంలో కో-అపరేటివ్ పాల సంస్థ పెట్టుకోమని సలహా ఇచ్చారు. త్రిభువన్ దాస్ తదితరులు బాంబే మిల్క్ స్కీమ్ పేరుతో పాల కో-ఆపరేటివ్ సంస్థను ప్రారంభించి పోల్సన్ కంపెనీకి బదులు వాళ్ళే బాంబేకు పాలు సరఫరా చేయడం మొదలుపెట్టారు.[7] రైతుల పనులు నిర్వహించేందుకు మొరార్జీ దేశాయ్ ను పంపించారు వల్లభభాయ్. అలా 1946లో పాలను సేకరించి, అమ్మేందుకు అమూల్ సంస్థను స్థాపించారు. రోజుకు 1-2లీటర్ల పాలు మాత్ర్రమే అమ్మే సన్నకారు రైతులకు కూడా లాభం వచ్చే విధంగా పాల సేకరణ చేసేలా ఈ సంస్థను తయారు చేశారు.[8]

మూలాలు

మార్చు
  1. Alexander Fraser Laidlaw.
  2. The Amul Story – General Management Review Archived 4 December 2005 at the Wayback Machine.
  3. indiadairy.com Archived 2010-05-16 at the Wayback Machine. indiadairy.com.
  4. Dasgupta, Manas (9 September 2012).
  5. George, Shanti (1985).
  6. Heredia, Ruth (1997).
  7. Suhrud, Tridip (8 April 2006).
  8. Thapar, Romila (2001).
"https://te.wikipedia.org/w/index.php?title=అమూల్&oldid=4306559" నుండి వెలికితీశారు