అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం

అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.[1][2]

అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం
KCR Kit Logo.png
పథకం రకంతల్లి, బిడ్డ సంరక్షణ
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
ప్రారంభం2017 జూన్ 2 (2017-06-02)
తెలంగాణ
బడ్జెట్రూ. 500 కోట్లు (సంవత్సరానికి)
స్థితిఅమలులోవున్నది
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్

ప్రారంభంసవరించు

2017, జూన్ 3న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిచబడింది.[3]

అమ్మఒడిసవరించు

గర్భిణిలు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడంకోసం, ప్రసవానంతరం ఇంటికి చేరడంకోసం ప్రభుత్వం ప్రత్యేక వాహన సదుపాయాన్ని ఏర్పాటుచేసింది. 102 నంబరుకు ఫోన్‌ చేస్తే ప్రత్యేక సదుపాయాలు ఉన్న వాహనం గర్భిణీ ఇంటిముందుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అమ్మఒడి పథకం కోసం 250 వాహనాలు పనిచేస్తున్నాయి. గర్భం దాల్చిన 3 నెలల నుంచి ప్రసవం అయ్యే వరకు చెకప్‌లకు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావటం, డెలివరీ అయ్యాక తల్లీబిడ్డను ఇంటికి చేరవేయడం, చిన్నారులను టీకాలు వేయడానికి తీసుకురావడం వంటి కార్యక్రమాలు 102 వాహనం ద్వారా నిర్వహిస్తారు. ఈ పథకానికి రూ. 561 కోట్లు కేటాయించారు.[4]

కె.సి.ఆర్‌. కిట్‌సవరించు

సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో చేరేవారికి ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లు అందిస్తుంది. గర్భం దాల్చిన నాటినుంచి ప్రసవం జరిగి శిశువుకు 10 నెలల వయసు వచ్చేంతవరకూ నాలుగు విడతలలో అనగా గర్భం దాల్చిన ఐదు నెలలలోపు డాక్టరు పరీక్ష అనంతరం రూ. 3000, ప్రసవ సమయంలో ఆడ శిశువుకు రూ. 5000, లేదా మగ శిశువుకు రూ. 4000, శిశువుకు వ్యాధినిరోధక టీకాలు 14 వారాల వయసులో రూ. 3000,, 10 నెలల వయసులో రు. 2000 చొప్పుననాలుగు విడతలలో రూ. 12,000 రూపాయలను అందిచడంతోపాటు, ఆడిపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నది. ప్రసవం తర్వాత రెండు వేల రూపాయల విలువచేసే 16 రకాల వస్తువులు ఉండే కేసీఆర్‌ కిట్‌ను కూడా ఇస్తుంది.

విమర్శలుసవరించు

2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమ ప్రభుత్వం అమలుచేసిన కెసిఆర్ కిట్ పథకాన్ని ఒకానొక విజయంగా చెప్పుకుంటూండగా, ప్రతిపక్షాలు కెసిఆర్ కిట్ కేవలం ఒకానొక సంక్షేమ పథకం అనీ, సాధారణంగా ప్రతీ ప్రభుత్వాలు ఈ సంక్షేమ పథకాలు అమలుచేస్తాయని దీన్నొక గొప్పగా చూపించుకోవడం తగదని విమర్శించాయి.[5]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 10టీవి, హోం, వార్తలు (27 May 2017). "అమ్మఒడి పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం". Archived from the original on 23 February 2018. Retrieved 29 April 2018.
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.
  3. Telangana Today (18 April 2017). "'Amma Vodi', 'KCR Kits' from June 2". Retrieved 29 April 2018.
  4. తెలంగాణ మ్యాగజైన్. "అన్నదాతకు అండగా." magazine.telangana.gov.in. Retrieved 29 April 2018.
  5. శాండిల్య, అరుణ్ (4 December 2018). "టీఆర్ఎస్, మహాకూటమి ముందున్న సవాళ్లు". BBC News తెలుగు. Retrieved 9 December 2018.