తెలంగాణా ముఖ్యమంత్రులు

(తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా నుండి దారిమార్పు చెందింది)

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తారు.రాజ్యాంగం ప్రకారం గవర్నరే రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి ఆయనకు ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. శాసనసభ ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న పార్టీ లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఆయన ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది.ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటీ సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
Telangana logo (New).jpg
Styleగౌరవనీయులైన
Residenceప్రగతి భవన్
గ్రీన్ ల్యాండ్స్ రోడ్డు, పంజాగుట్ట
హైదరాబాద్ 500 082
తెలంగాణ, భారతదేశం
Appointerతెలంగాణ‌ రాష్ట్ర గవర్నరు

హైదరాబాదు రాష్ట్రంసవరించు

1948లో హైదరాబాదు సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య తరువాత, సంస్థానం భారతదేశంలో విలీనమై, ఈ సంస్థానం మొత్తం హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. 1956లో భాషా ప్రయుక్తంగా జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా, 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను (ప్రస్తుత తెలంగాణా), ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది..

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం వ్యవధి
2 ఎం కె వెల్లోడి 1950 జనవరి 26 1952 మార్చి 6
3 బూర్గుల రామకృష్ణారావు 1952 మార్చి 6 1956 అక్టోబరు 31

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంసవరించు

1956 నుండి 2014 వరకు తెలంగాణా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల జాబితాకై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చూడండి.

తెలంగాణా రాష్ట్రంసవరించు

తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారి జాబితా.

సంఖ్య పేరు చిత్రం ఆరంభం అంతం పార్టీ పదవీకాలం
1 కె.చంద్రశేఖరరావు   2014 జూన్ 2 ప్రస్తుతం తెరాస 7 సంవత్సరంలు, 99 రోజులు


మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు