మనోపాడ్ మండలం
మనోపాడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
మానవపాడ్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, మానవపాడ్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 15°57′50″N 77°56′28″E / 15.96397°N 77.941039°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జోగులాంబ జిల్లా |
మండల కేంద్రం | మనోపాడ్ |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 170 km² (65.6 sq mi) |
జనాభా (201) | |
- మొత్తం | 51,543 |
- పురుషులు | 28,132 |
- స్త్రీలు | 25,411 |
అక్షరాస్యత (201) | |
- మొత్తం | 47.46% |
- పురుషులు | 60.65% |
- స్త్రీలు | 33.81% |
పిన్‌కోడ్ | 509128 |
ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.ఇది అలంపూర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉంది. మండల కేంద్రం మానవపాడ్.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1063 ఇళ్లతో, 5013 జనాభాతో 1754 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2547, ఆడవారి సంఖ్య 2466. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1283 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 33. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576405.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 170 చ.కి.మీ. కాగా, జనాభా 31,481. జనాభాలో పురుషులు 15,965 కాగా, స్త్రీల సంఖ్య 15,516. మండలంలో 7,335 గృహాలున్నాయి.[4]
సరిహద్దులు
మార్చుఈ మండలానికి ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన తుంగభద్ర, తూర్పున అలంపూర్ మండలం, పశ్చిమాన ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
విద్యావకాశాలు
మార్చుఈ మండలంలో విస్తీర్ణంలోనూ, జనాభా పరంగానూ 4 పెద్ద గ్రామాలు ఉన్నాయి. అవి ఉండవెల్లి, జల్లాపూర్,పుల్లూర్, చెన్నిపాడు. ఈ గ్రామాలన్నిటిలోనూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.వీటితో పాటు మండల కేంద్రమైన మానోపాడులో ఉన్నత పాఠశాలతో పాటు, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలోనూ ప్రభుత్వేతర ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
మండలం లోని ఆలయాలు
మార్చుమండలంలోని కంచుపాడు గ్రామంలో ప్రసిద్ధి చెందిన జమ్ములమ్మ(ఎల్లమ్మ) ఆలయం ఉంది. మండలంలోని గ్రామ ప్రజలే కాకుండా సమీపంలో ఉన్న ఆలంపూర్, ఇటిక్యాల మండలాలలోని గ్రామ ప్రజలు కూడా ప్రతి మంగళ, శుక్ర వారాలలో పెద్ద ఎత్తున తరలివచ్చి, పూజించి వెళ్తుంటారు.
మండలానికి చెందిన ప్రముఖులు
మార్చు- సురవరం ప్రతాపరెడ్డి: ఆంధ్రల సాంఘిక చరిత్రతో జగానికి తెలిసిన పరిశోధకుడు, గోలకొండ పత్రికతో తెలంగాణను తట్టిలేపైన వైతాళికుడు. గోలకొండ కవుల సంచికతో తెలంగాణాలో కవులకు కొదువలేదని చాటిన కవి, 'శుద్ధాంత కాంత ' నవలా రచయిత, నాటక కర్త, కథకుడు సురవరం ప్రతాపరెడ్డి ఈ మండలానికి చెందినవాడే. మండలంలోని ఇటిక్యాలపాడు వీరి స్వగ్రామం.
- సురవరం సుధాకర్ రెడ్డి : భారత కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సుధాకర్‌రెడ్డి ఈ మండలానికి చెందినవాడే. మండలంలోని కంచుపాడు వీరి స్వగ్రామం.
- సురవరం రామిరెడ్డి: జల్లాపూర్ గ్రామానికి చెందిన వీరు గతంలో సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మండలంలోని చాలా గ్రామాలలో 'సురవరం' ప్రతాపరెడ్డి వంశీయులు ఉన్నారు. చండూరు గ్రామంలో ప్రతాపరెడ్డి కుమారులు ఉన్నారు.
- దుంపల రామిరెడ్డి: ఉండవెల్లి గ్రామానికి చెందిన ఇతను ఇదే గ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించాడు. గడియారం రామకృష్ణశర్మను అనేక విధాలుగా ప్రోత్సహించి, అనేక సందర్భాలలో అండగా నిలిచాడు.
- గంగుల వేంకట కృష్ణారెడ్డి: మండల కేంద్రానికి చెందిన వీరు గొప్పదాత. విలువైన వీరి భూమిని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు దానం చేశారు.
- ఏ.పి. జితేందర్‌రెడ్డి: మండలంలోని ఆముదాలపాడుకు చెందిన వీరు, మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చునిర్జన గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.